CSK Retain Dhoni IPL 2025 : ఐపీఎల్ 2025 సీజన్‌లో ధోనీ ఆడతాడా? లేదా? అనే విషయంపై సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. అలానే వచ్చే సీజన్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉండే అవకాశం లేదని కూడా అంటున్నారు. అయితే గత ఎడిషన్‌లో కెప్టెన్సీ వదిలేసిన మహీ లోయర్ ఆర్డర్ కన్నా దిగువన బ్యాటింగ్‌కు వచ్చి ఆఖరి ఓవర్లలో పరుగులు సాధించాడు. దీంతో వచ్చే సీజన్‌లో అతడు ఇంపాక్ట్‌గా బరిలోకి దిగొచ్చని అంతా భావించారు.
మరి ఇప్పుడా రూల్‌నే పక్కన పెట్టేస్తారని ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో మహీని అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా తీసుకునేందుకు చెన్నై ఫ్రాంఛైజీ మొగ్గు చూపిస్తోందని తెలుస్తోంది.
సాధారణంగా అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ అంటే నేషనల్ టీమ్‌కు ప్రాతినిథ్యం వహించని క్రికెటర్ అని అర్థం. అంటే దేశవాళీలో ఆడుతూ ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి ఇంకా అడుగుపెట్టని ఆటగాళ్లను అలా పిలుస్తుంటారు. అలానే ఇంటర్నేషనల్ కెరీర్‌కు రిటైర్మెంట్ చెప్పి ఐదేళ్లు పూర్తి చేసుకున్న ఆటగాళ్లను ఇలానే పిలుస్తుంటారు. కానీ, ఈ నిబంధన ఇప్పుడు ఉపయోగంలో లేదు. అయితే ఇప్పుడు మహీ విషయంలో దీనినే అమలులోకి తీసుకురావాలని చెన్నై సూపర్ కింగ్స్ బీసీసీఐకి విజ్ఞప్తి చేసింది. గత నెలాఖరున బీసీసీఐతో జరిగిన సమావేశంలో బీసీసీఐ దృష్టికి ఈ రిటెన్షన్ రూల్‌ను చెన్నై కింగ్స్ తీసుకెళ్లగా బోర్డు కూడా పాజిటివ్‌గానే రియాక్ట్ అయినట్లు సమాచారం.
ఒకవేళ ఈ రూల్ అందుబాటులోకి వస్తే నిధుల పరంగా సీఎస్కేకు మంచి ప్రయోజనం ఉంటుంది. ప్రస్తుతం మహీ రూ.12 కోట్లు వరకు అందుకుంటున్నాడు. ఒకవేళ అన్ క్యాప్‌డ్ ప్లేయర్‌గా ఆడితే అతడికి రూ.4 కోట్లకు మించి ఇవ్వనక్కర్లేదు. దీంతో మిగిలిన అమౌంట్‌ను పెద్ద ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు ఉపయోగించుకోవచ్చు. వినియోగించుకోవచ్చు.
ధోనీ ఏమన్నాడంటే? - వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడతారా అని అడిగిన ప్రశ్నకు ఆ మధ్య ధోనీ స్పందించాడు. సీజన్‌కు ఇంకా చాలా సమయం మిగిలి ఉంది. ప్లేయర్ రిటెన్షన్ నిబంధనపై(IPL Retention Rule) ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారో చూద్దాం. ఇప్పుడు బాల్ మన కోర్టులో లేదు. ఒక్కసారి నియమ నిబంధనలు కన్ఫామ్ అయితే ఆలోచించి డెసిషన్ తీసుకుంటాను. ఏది తీసుకున్నా జట్టు ప్రయోజనానికే నా మొదటి ప్రాధాన్యం ఉంటుంది" అని మహీ చెప్పుకొచ్చాడు.
'పంజాబ్ కింగ్స్'లో విభేదాలు - అతడిపై ప్రీతీ జింటా లీగల్ యాక్షన్ - Punjab Kings Preity Zinta