Cricketer Angkrish Apology To Saina Nehwal : భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఇటీవలే సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది. క్రికెట్‌తో పోల్చుకుంటే బ్యాడ్మింటన్, టెన్నిస్, బాస్కెట్‌బాల్ లాంటి క్రీడలు శారీరకంగా చాలా కష్టమైనవని. కానీ, ఆడియెన్స్ మాత్రం ఇతర క్రీడల కంటే క్రికెట్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారంటూ తాజాగా కామెంట్ చేసింది. అయితే ఆమె ఓ ఇంటర్వ్యూలో అన్న ఈ మాటలు కాస్త వివాదాస్పదంగా మారింది.
"సైనా ఏం చేస్తోంది? రెజ్లర్లు, బాక్సర్లు, నీరజ్ చోప్రా ఏం చేస్తున్నారు అనే విషయాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అనుకుంటారు. ఈ ప్లేయర్లందరూ దాదాపు అందరికీ తెలుసు. ఎందుకంటే తరచూ పేపర్లో వస్తుంటారు. ఇలా గుర్తింపు తెచ్చుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అయితే అందరి దృష్టి మాత్రం క్రికెట్ మీదే ఉంటోందని కొన్నిసార్లు నాకు బాధేస్తుంది. బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, టెన్నిస్ లాంటి క్రీడలు శారీరకంగా ఎంతో కష్టమైనవి. షటిల్ తీసుకొని సర్వ్ చేసేంత టైమ్ కూడా దొరకదు. అతి కష్టం మీద ఊపిరి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, క్రికెట్‌లో అటువంటి పరిస్థితి ఉండదు. అయితే అదే ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది." అని సైనా పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది.
I’m sorry everyone, I meant my remarks as a joke, looking back I think it was a really immature joke. I realize my mistake and I sincerely apologize.
— Angkrish Raghuvanshi (@angkrish10) July 12, 2024
అయితే ఆ ట్వీట్‌కు రఘువంశీ రిప్లై ఇచ్చాడు. "బుమ్రా 150 కి.మీ వేగంతో ఆమె తలపైకి బౌలింగ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం" అని కామెంట్ చేశాడు. ఇక ఈ కామెంట్ కాస్త నెట్టింట వైరల్ అయ్యి ఈ యంగ్ ప్లేయర్‌పై విమర్మలు వెల్లువెత్తాయి. దీంతో రఘువంశీ ఆ పోస్టును డిలీట్ చేశాడు. అంతేకాకుండా సైనా నెహ్వాల్‌కు సారీ చెప్తూ మరో పోస్టు పెట్టాడు.
"అందరూ నన్ను క్షమించండి. నా వ్యాఖ్యలు సరదాగా తీసుకుంటారని అనుకున్నా. కానీ, ఆలోచించే సరికి అది పరిణతి లేని జోక్‌గా మారింది. నా తప్పును నేను తెలుసుకున్నా" అంటూ అంగ్క్రిష్ పోస్ట్ చేశాడు. ఇక ఈ పోస్ట్‌కు నెటిజన్లు రియాక్ట్ అయ్యారు. కొంతమందేమో అతడికి మద్దతు తెలుపుతున్నారు. 'ఇందులో నీ తప్పేం లేదు' అంటూ కామెంట్లు పెడుతున్నారు.
— Saina Nehwal (@NSaina) July 11, 2024
సైనా నెహ్వాల్‌తో బ్యాడ్మింటన్ ఆడిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము - President Murmu Saina Nehwal
Saina Nehwal Retirement : ఇప్పట్లో ఆ ఆలోచన లేదు.. నా దృష్టి అంతా దానిపైనే: సైనా