PCB Coach Gary Kirtsen : పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై ఆ దేశ క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పాకిస్థాన్ తాత్కాలిక కోచ్‌గా జాసన్ గిలెస్పీని నియమించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జాసన్ గిలెస్పీ కోచ్‌గా సరిపోతాడా? అని విమర్శిస్తున్నారు. కష్టకాలంలో ఉన్న పాక్‌కు గిలెస్పీ విజయాలు అందించగలడా? అని సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.
ఫ్యాన్స్ ఫైర్
పాకిస్థాన్ జట్టు కోచ్ పదవి నుంచి గ్యారీ కిరిస్టెన్ తాజాగా వైదొలిగాడు. దీంతో ప్రస్తుతం టెస్టులకు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరిస్తున్న జాసన్ గిలెస్పీకే ప్రధాన కోచ్ పగ్గాలు అప్పగిస్తూ పీసీబీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై పాక్ క్రికెట్ అభిమానులు పీసీబీపై విమర్శలు గుప్పిస్తున్నారు. కష్టాల సుడిగుండంలో ఉన్న పాక్‌ను గెలెస్పీ ఒడ్డెక్కించగలడా అని మండిపడుతున్నారు.
పాక్ హెడ్ కోచ్‌గా గెలెస్పీ నియామకంపై ప్రకటన వెలువడిన వెంటనే సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం జట్టు సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని ఆరోపించారు. హెచ్ కోచ్ పదవికి గెలెస్పీ సరిపోతారా అని మరికొందరు సందేహం వ్యక్తం చేశారు.
Mene pahle Hi Bola tha Garry Kristen Sir Ko Pakistan Team Ke Coach Banne Se Accha Hai Aap IPL team Ke Coach Banke Rahiye.... India Cricket team main aur pakistan Cricket team main kitna Anter Hai... Aaj Unko Pta Chal Gya
— Mukesh Kumar Pareek (@Pareek197) October 28, 2024
No self respect 🤡🤡
— Hassan Abbasian (@HassanAbbasian) October 28, 2024
Sharam hy ya Nhi?
సోషల్ మీడియా సెగ
- అది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కాదు. అది పొలిటికల్ సర్కస్
- బోర్డులో ఇలాగే రాజకీయాలు జరిగితే కొన్నాళ్ల తర్వాత పాక్ జట్టుకు విదేశీ కోచ్‌లు రారు
- ఆకిబ్ జావేద్‌ను హెచ్ కోచ్‌గా చేసేందుకు పీసీబీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తోంది
- పాకిస్థాన్‌ను వదిలిపెట్టినందుకు కిరిస్టెన్‌కు థ్యాంక్స్. ఇప్పుడు మీ కోచింగ్ వారసత్వానికి ఎలాండి ఇబ్బంది ఉండదు
- కిరిస్టెన్ మరో బాబ్ వూల్మర్ కావాలని అనుకోవడం లేదు. ఇప్పట్నుంచి పాపం జాసన్ గిసిప్పీ కోసం ప్రార్థించాలి
అంటూ పీసీబీ తాజా నిర్ణయాన్ని ట్యాగ్ చేస్తు, నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.
آوے کا آوا بگڑا ہوا ہے 💔 pic.twitter.com/EBnRWNLWZF
— Rashid Hussain (@Rashid_chan_) October 28, 2024
Mohsin Naqvi has completely overshadowed the entire management and team. I’m sure Gary must have opposed this and taken a stand, saying that you shouldn’t treat Fakhar and the other players badly just because of a tweet. Have some shame, PCB! Have some shame!
— Bilal Hussain (@BilliCodes) October 28, 2024
గుడ్ బై చెప్పిన కిరిస్టెన్
టీమ్ఇండియాకు వరల్డ్ కప్ అందించిన గ్యారీ కిరిస్టెన్‌ను పాక్ క్రికెట్ బోర్డు నాలుగు నెలల కిందట తమ జట్టుకు కోచ్‌గా తీసుకొచ్చింది. అయితే, పాక్‌కు పరిమిత ఓవర్ల క్రికెట్ కోచ్‌గా వచ్చినప్పటి నుంచి కిరిస్టెన్ తీవ్ర అసంతృప్తితోనే ఉన్నట్లు వార్తలు వచ్చాయి. బసిత్ అలీ వంటి మాజీ క్రికెటర్ కూడా గ్యారీ మరింతకాలం ఉండడని వ్యాఖ్యానించాడు.
Gary Kirsten didn't want to become another Bob Woolmer. Prayers for Jason Gillespie pic.twitter.com/7t9HwKiWtq
— Lord Immy Kant (Eastern Exile) (@KantInEast) October 28, 2024
No foreign coach will come to Pakistan again after the way things have been lately. All this is being done to facilitate a hostile takeover by Aaqib Javed.
— AIR (@AIRGold_) October 28, 2024
Short term moves being made with the expectation that they'll fix longterm issues. That's not how things work.
అదే కారణమా?
కోచ్ పదవి నుంచి అకస్మాత్తుగా కిరిస్టెన్ వైదొలగడానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)తో విభేదాలే కారణమని తెలుస్తోంది. కోచ్, కెప్టెన్ అభిప్రాయాలను తీసుకోకుండా జాతీయ సెలక్షన్ కమిటీకి జట్టు ఎంపిక బాధ్యతను పీసీబీ అప్పగించడం వల్ల కిరిస్టెన్ అసంతృప్తికి గురైనట్లు సమాచారం. కిరిస్టెన్ అనుమతి లేకుండా వికెట్ కీపర్ రిజ్వాన్ ను కెప్టెన్ నియమించడం కూడా ఒక కారణంగా తెలుస్తోంది.
పాకిస్థాన్ కొత్త కెప్టెన్ ప్రకటన- బాబర్‌ను రిప్లేస్ చేసేది అతడే
'బాత్రూమ్లు, సీట్లు సరిగ్గా లేవు!' పాక్ స్టేడియాల పరిస్థితిపై PCB ఛైర్మన్ - Champions Trophy 2025