ETV Bharat / sports

ఛాంపియన్స్ ట్రోఫీ రగడపై ఐసీసీ ప్లాన్ బీ - పాకిస్థాన్ చేతులెత్తేస్తే ఆ దేశంలోనే టోర్నీ! - CHAMPIONS TROPHY 2025 VENUE

ఛాంపియన్స్ ట్రోఫీ వేదిక విషయంపై కొనసాగుతోన్న రగడ!

Champions Trophy 2025 Venue
Champions Trophy 2025 Venue (source Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 12, 2024, 3:20 PM IST

Champions Trophy 2025 Venue : ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 ఆతిథ్య హక్కులను పాక్​ దేశం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మ్యాచ్‌ల నిర్వహణ కోసం మూడు స్టేడియాల్లో ఆధునికీకరణ పనులను చేపడుతోంది. అయితే పాక్ దేశానికి వెళ్లి మరీ టోర్నీ ఆడేందుకు టీమ్ ఇండియా రెడీగా లేదు. దీంతో చాలా కాలంగా పాక్​కు టీమ్ ఇండియా వెళ్తుందా లేదా అనే విషయమై సందిగ్ధత నెలకొంది. భారత జట్టు వెళ్లబోమని పక్కాగా చెబుతున్నా పాక్​ మాత్రం తన పంతాన్ని వీడట్లేదు. ఛాంపియన్స్ ట్రోఫీని తమ దేశంలో నిర్వహిస్తామని అంటోంది.

అవసరమైతే తప్పుకునేందుకు - ఇదే సమయంలో ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహిస్తేనే పాల్గొంటామని భారత్ ఐసీసీకి చెప్పింది. దీంతో టీమ్ ఇండియా ఆడే మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించేలా సన్నాహాలు చేయాలని పాక్ క్రికెట్‌ బోర్డును ఐసీసీ కోరింది. కానీ, ఈ ప్రతిపాదనకు పీసీబీ అంగీకరింట్లేదు. తమ దేశంలోనే టోర్నీకి సంబంధించిన అన్నీ మ్యాచ్​లను నిర్వహించాలని అంటోంది. ఒక వేళ తమ ఆతిథ్య హక్కులను తగ్గిస్తే ఏకంగా టోర్నీని వీడేందుకైనా సిద్ధంగా ఉన్నామని పాక్‌ చెబుతోంది.

లాబీయింగ్​ చేసేందుకు - పైగా ఇరు దేశాల మధ్య వివాదాలు పరిష్కారమయ్యే వరకు కూడా భారత్‌లో జరిగే ఇతర ఐసీసీ ఈవెంట్లలోనూ పాల్గొనకూడదని పాక్ బలంగా నిర్ణయించుకుందట. 2036 ఒలింపిక్స్‌ ఇక్కడ నిర్వహించేలా తమ ఆసక్తిని తెలియజేస్తూ ఐఓసీ భవిష్యత్‌ ఆతిథ్య కమిషన్‌కు భారత్‌ ఇప్పటికే లేఖ కూడా రాసింది. అయితే పాకిస్థాన్‌ ఇందుకు వ్యతిరేకంగా లాబీయింగ్ చేయాలనుకుంటున్నట్లు పాక్‌ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి.

ఒకవేళ పాక్ క్రికెట్ బోర్డు ఇలాగే మొండిగా వ్యవహరించి హైబ్రిడ్ మోడల్‌ను తిరస్కరిస్తే, ఇక టోర్నీ మొత్తాన్ని దక్షిణాఫ్రికా నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారట. అయితే మొత్తం పరిస్థితిని పీసీబీ అంచనా వేస్తోంది. కానీ నెక్ట్స్​ ఏం చేయాలనే విషయంపై ఎటువంటి నిర్ణయాన్ని మాత్రం తీసుకోలేదు. ఈ వ్యవహరంపై ప్రస్తుతం పాక్‌ ప్రభుత్వం, బోర్డు తీవ్రంగా చర్చలు జరుపుతోంది. అయితే ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే బోర్డు నడుచుకుంటుందని ఓ పీసీబీ అధికారి పేర్కొన్నారు.

భారత్ లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ జరగదు- ఆ విషయం పాక్​కు తెలుసు! : ఆకాశ్ చోప్రా

పాకిస్థాన్​కు టీమ్ఇండియా 'వెళ్లేదేలే'- ఛాంపియన్స్ ట్రోఫీ సంగతేంటి? క్యాన్సిలేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.