Rohit Sharma Son Name : టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల రెండోసారి తండ్రయ్యాడు. అతడి భార్య రితికా సజ్దే నవంబర్ 15న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో 'రోహిక'(Rohika) జంట తమ చిన్నారి పేరు రివీల్ చేశారు. రోహిత్ భార్య రితిక ఇన్ స్టా వేదికగా కుమారుడి పేరు అనౌన్స్ చేశారు. ఆ చిన్నారికి 'అహాన్' అనే పేరు ఫిక్స్ చేసినట్లు రితిక ఇన్ స్టా పోస్టు చూస్తే తెలుస్తోంది.
డిసెంబర్ నెల వచ్చేసింది అంటూ క్రిస్మస్ శాంటా గెటప్‌లో ఉన్న ఓ ఫ్యామిలీ ఫొటోను కూడా పోస్ట్ చేశారు రితిక. అందులోనే అహాన్ పేరును రివీల్ చేశారు. ఇక సోషల్ మీడియాలో పెట్టిన ఆ పోస్టర్లో ఉన్న బొమ్మలకు రితిక, రోహిత్ శర్మ, సమ్మీ, అహాన్ అనే పేర్లు కూడా పెట్టారు. దీంతో అభిమానులు ఆ పేరుకు అర్థం ఏంటని ఇంటర్నెట్లో తెగ వెతికేస్తున్నారు.
రోహిత్ శర్మ, తన మేనేజర్ అయిన రితికా సజ్దేను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాల ఆశీర్వాదంతో 2015 డిసెంబర్ 13న ఈ జంట వివాహం గ్రాండ్‌గా జరిగింది. వీరి ప్రేమకు గుర్తుగా 2018 డిసెంబరు 30న ఓ కూతురు జన్మించింది. పాపకు సమైరాగా నామకరణం చేశారు. ఇక ఈ ఏడాది నవంబరు 15న రోహిత్- రితిక జంట రెండో బిడ్డను ఆహ్వానించారు. వీరికి పండంటి మగబిడ్డ జన్మించాడు. ఆ చిన్నారికి తాజాగా అహాన్ అని నామకరణం చేశారు.
ఆసీస్ పర్యటనలో
రోహిత్ శర్మ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. కాన్ బెర్రా వేదికగా ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్ జట్టుతో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆడుతున్నాడు. అలాగే డిసెంబరు 6న అడిలైడ్ ఓవల్‌లో జరగబోయే పింక్ బాల్ డే అండ్ నైట్ మ్యాచ్ కోసం సిద్ధమవుతున్నాడు. తొలి మ్యాచ్‌కు దూరమైన రోహిత్, రెండో టెస్టులో భారత్‌కు సారథ్యం వహించనున్నాడు.
ఇప్పటికే 1-0 తేడాతో బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భారత్ ముందంజలో ఉంది. తొలి టెస్టుకు రోహిత్ దూరమవ్వడం వల్ల జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టి సక్సెస్ అయ్యాడు. రోహిత్ స్థానంలో ఓపెనింగ్‌కు వచ్చిన కేఎల్ రాహుల్ కూడా రాణించాడు. దీంతో అతడినే రెండో టెస్టులోనూ ఓపెనర్‌గా దింపే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
రోహిత్‌కు శుభాకాంక్షల వెల్లువ- ఎమోషనలైన తిలక్ వర్మ!
రెండోసారి తండ్రైన రోహిత్ శర్మ - మగబిడ్డకు జన్మనిచ్చిన రితికా సజ్దే