Andy Roberts About Shami : టీమ్ఇండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమిపై వెస్టిండీస్ దిగ్గజ పేసర్ ఆండీ రాబర్ట్స్ ప్రశంసలు కురిపించాడు. యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా ఎక్కువగా వికెట్లు పడగొట్టినా షమీనే కంప్లీట్ ప్యాకేజీ అని పేర్కొన్నాడు. షమీకి బౌలింగ్ యాక్షన్‌పై కంట్రోల్ ఉండడమే కాకుండా బంతిని రెండు వైపులా స్వింగ్ చేయడం తన ప్రత్యేకత అని రాబర్ట్స్ అన్నాడు. ప్రస్తుతం టీమ్ఇండియాలో అతడే అత్యుత్తమ బౌలర్ అని షమీని కొనియాడాడు.
'షమీ కొంతకాలంగా అత్యుత్తమ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. అయితే బుమ్రాకు దక్కినన్ని వికెట్లు షమీకి పడకపోవచ్చు. కానీ, షమీ టీమ్ఇండియా టాప్ క్లాస్ బౌలర్. అతడు ఓ ఫుల్ ప్యాకేజీ. జట్టులో ఉన్న మిగిలిన వాళ్లకంటే షమీ నిలకడగా రాణిస్తాడు. అతడు బంతిని స్వింగ్ చేయగలడు, సీమ్ చేయగలడు. అంతేకాకుండా బంతిని బుమ్రా కంటే ఎక్కువగా కంట్రోల్ చేయగలడు' అని రాబర్ట్స్ ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. కాగా, రాబర్ట్స్ 1974- 83 మధ్య కాలంలో వెస్టిండీస్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 9ఏళ్ల కెరీర్లో మొత్తం 47 టెస్టుల్లో 25.21 యావరేజ్‌తో 202 వికెట్లు పడగొట్టాడు.
ప్రస్తుతం షమీ ఫామ్ అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడుతున్నాడు. సోమవారం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్లో చండీగఢ్‌పై బ్యాటింగ్‌లో రఫ్పాడించాడు. 17 బంతుల్లోనే 32 పరుగులు బాదాడు. ఆఖరి ఓవర్లో స్ట్రైకింగ్‌లో ఉన్న షమీ రెండు సిక్స్‌లు, ఓ ఫోర్ సహా 19 పరుగులు బాదాడు. ఇందులో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉండడం విశేషం.
మరోవైపు టీమ్ఇండియాలోకి వచ్చేందుకు షమీ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. గతేడాది వన్డే వరల్డ్‌కప్‌లో గాయపడ్డ షమీ అప్పట్నుంచి టీమ్ఇండియాకు దూరమయ్యాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో ఆడతాడని ప్రచారం సాగుతోంది. అయితే బీసీసీఐ సెలక్షన్ కమిటీ కూడా షమీని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. అతడు ఎంత త్వరగా పూర్తి స్థాయి ఫిట్నెస్ అందుకుంటే అంత తొందరగా అంతర్జాతీయ క్రికెట్లో రీ ఎంట్రీ ఇస్తాడు.
రఫ్పాడించిన షమీ- ఫోర్లు, సిక్స్‌లతో విమర్శలకు చెక్?
షమీ రీ ఎంట్రీ కోసం బీసీసీఐ డెడ్‌లైన్ - ఆ రెండింట్లో పాస్ అయితేనే!