ETV Bharat / sports

బోర్డర్ గావస్కర్ ట్రోఫీ: 'షమీకి బదులు ఆ బౌలర్​కు ఛాన్స్ ఇవ్వాలి- అతడు కంప్లీట్ ప్యాకేజీ!'

బోర్డర్ గావస్కర్​ ట్రోఫీపై బ్రెట్​లీ కామెంట్స్- షమీ కోలుకోకుంటే యువ బౌలర్​కు ఛాన్స్ ఇవ్వాలని సూచన

India Border Gavaskar Trophy
India Border Gavaskar Trophy (Source: Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Oct 23, 2024, 7:45 PM IST

India Border Gavaskar Trophy 2024 : 2024 ఐపీఎల్‌లో సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకున్న ఆటగాళ్లలో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ ఫాస్ట్ బౌలర్‌ మయాంక్‌ యాదవ్‌ ఒకడు. క్రమం తప్పకుండా 150 kmph వేగంతో బౌలింగ్‌ చేస్తూ బ్యాటర్లకు సవాల్‌ విసిరాడు. ఈ క్రమంలో అనేక మంది మాజీల దృష్టిని ఆకర్షించాడు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ స్టార్‌ బౌలర్‌ బ్రెట్ లీ కూడా మయాంక్ ప్రదర్శనపై మాట్లాడాడు. బోర్డర్ గావస్కర్ ట్రోఫీకి షమీకి బదులుగా మయాంక్​ను ఎంపిక చేయాలని అభిప్రాయపడ్డాడు.

'బోర్డర్ గావస్కర్ ట్రోఫీ సమయానికి మహ్మద్‌ షమీ కోలుకోకపోతే, మయాంక్ యాదవ్​ను పరిశీలించాలి. నేను ఐపీఎల్‌లో పని చేసినప్పుడు, అనేక మంది భారత యువ క్రికెటర్లను చూశాను. మయాంక్ యాదవ్ తన మొదటి ఐపీఎల్‌ మ్యాచ్‌లో 157 kmph వేగంతో ఆశ్చర్యపరిచాడు. దురదృష్టవశాత్తూ, అతడు గాయపడ్డాడు. ఇక ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకోక ముందే ఫ్రాంచైజీ అతడిని ఆడించింది. మయాంక్‌ మళ్లీ గాయపడ్డాడు. భారత్‌ గొప్ప విషయం ఏంటంటే, ఓ ప్లేయర్‌ ఎన్ని మ్యాచ్‌లు ఆడాడు? ఆడలేదు అనే అంశాన్ని పట్టించుకోదు. బరిలో దిగడానికి సిద్ధంగా ఉంటే అవకాశం ఇస్తుంది. నేను నిజానికి ఈ విధానాన్ని ఇష్టపడుతున్నాను. 135- 140 kmph వేగంతో బౌలింగ్ చేసినప్పుడు బ్యాటర్లు సులువుగా ఎదుర్కోగలరు. కానీ, 150 kmph వేగాన్ని ఎదుర్కోవడానికి ఏ బ్యాటర్​ ఇష్టపడడు. మయాంక్ యాదవ్‌ కంప్లీట్‌ ప్యాకేజీలా కనిపిస్తున్నాడు. మహ్మద్ షమీ సిద్ధంగా లేకుంటే, మయాంక్‌ని జట్టులోకి తీసుకోండి. ఆస్ట్రేలియా వికెట్లపై అతడు బాగా రాణిస్తాడని నేను భావిస్తున్నాను' అని చెప్పాడు.

సిరీస్‌కు ముందు షమీ కోలుకుంటే అతడు చాలా కీలకం అవుతాడని బ్రెట్ లీ తెలిపాడు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌ను కూడా ప్రశంసించాడు. కొత్త బంతితో పాట్ కమిన్స్ నేతృత్వంలోని జట్టుపై ఒత్తిడి తీసుకురాగలని పేర్కొన్నాడు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సామర్థ్యాల గురించి మాట్లాడాడు. 'అశ్విన్ 600 వికెట్లకు చేరువలో ఉన్నాడు. అతడు కొత్త బంతితో కూడా బౌలింగ్ చేయగలడు. కానీ భారత్ గెలవాలంటే, షమీ కీలకం అవుతాడు. జస్ప్రీత్ బుమ్రా రెండు విధాలుగా బౌలింగ్ చేయగలడు. రివర్స్ స్వింగ్‌ కూడా అద్భుతంగా చేస్తాడు' అని తెలిపాడు.

కాగా, మయాంక్ ఇటీవల టీ20ల్లో అరంగేట్రం చేశాడు. బంగ్లాదేశ్‌పై తొలి అంతర్జాతీయ టీ20 ఆడాడు. ప్రస్తుతం స్వదేశంలో న్యూజిలాండ్ టెస్ట్‌ సిరీస్‌కు రిజర్వ్ బౌలర్‌గా ఎంపికయ్యాడు. టీమ్ మేనేజ్‌మెంట్ యంగ్‌ పేసర్‌ను నిశితంగా పరిశీలిస్తోంది. మయాంక్‌ని ఫిట్‌గా భావిస్తే టీమ్‌తో పాటు ఆస్ట్రేలియా వెళ్లే అవకాశం ఉంది.

తొలి ఓవరే​ 'మెయిడెన్'- డెబ్యూలోనే మయాంక్ అరుదైన రికార్డ్ - Mayank Yadav Debut

మయాంక్, నితీశ్ లక్కీ ఛాన్స్! టీ20 దెబ్బకు మిలియన్ డాలర్ల క్లబ్​లోకి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.