Boxing In Paris Olympics 2024 : ఒలింపిక్స్‌లో భారత్‌కు పతాకవకాశాలు ఎక్కువగా ఉన్న క్రీడాంశాల్లో బాక్సింగ్ ఒకటి. దీంతో టోక్యో ఒలింపిక్స్ తర్వాత ఫ్రాన్స్ రాజధానిలో జరిగే ఈ విశ్వ క్రీడల్లో సత్తా చాటాలని భారత బాక్సర్లు ఉవ్విళ్లూరుతున్నారు. మరోసారి పతకాలు సాధించి సగర్వంగా భారత్‌కు రావాలన్న లక్ష్యంతో ఉన్నారు.
బాక్సింగ్‌లో పతకాల వేట-ఆరంభమైంది అప్పుడే?
2021 ఒలింపిక్ క్రీడల వరకు భారత బాక్సర్లు 15 సార్లు ఈ విభాగంలో పోటీ పడ్డారు. అయితే మొదటి ఒలింపిక్ పతకాన్ని బీజింగ్ 2008 ఎడిషన్‌లో విజేందర్ సింగ్ సాధించాడు. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలుచుకున్న మొదటి భారతీయుడు కూడా విజేందర్ సింగే. 2012లో లండన్ ఒలింపిక్స్‌లో మహిళల ఫ్లైవెయిట్ 51 కిలోలలో ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన మేరీ కోమ్ భారత్‌కు కాంస్యాన్ని గెలుచుకున్నారు.
మేరికోమ్ వారసురాలిపై అందరి ఆశలు
ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన నలుగురు భారత బాక్సర్లు రాబోయే ఒలింపిక్ క్రీడలలో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన నిఖత్ జరీన్ మహిళల లైట్ ఫ్లైవెయిట్‌లో ఈసారి స్వర్ణంపై గురి పెట్టింది. ఎంతో అనుభవజ్ఞురాలైన నిఖత్ పారిస్‌లో పతకం సంపాదించడానికి సిద్ధంగా ఉంది.
2023లో ప్రపంచ ఛాంపియన్‌షిప్ స్వర్ణాన్ని నిలబెట్టుకుని మేరీ వారసురాలిగా నిఖత్ పేరు తెచ్చుకుంది. అందుకే పారిస్ ఒలింపిక్స్‌లో ఈమె భారీ అంచనాల నడుమ బరిలో దిగుతోంది. ఏదో ఒక పతకానికి కాదు ఏకంగా స్వర్ణానికే గురి పెట్టింది. ఆమె కేటగిరిలో బరిలో ఉన్న ప్రత్యర్థులపై మెరుగైన రికార్డు ఉన్న నిఖత్‌కు పసిడిపోరుకు దూసుకెళ్లడం కూడా పెద్ద కష్టమేమి కాదు.
పంగాల్ పంజా విసురుతాడా?
ఈ సారి బాక్సింగ్ పోటీల్లో అమిత్ పంఘల్ తన సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఫ్లైవెయిట్ (51 కిలోలు) పోటీల ద్వారా బరిలోకి దిగుతున్నాడు. భారత్‌కు కచ్చితంగా బంగారు పతాకం తెస్తాడని అందరూ భావిస్తున్నారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో విఫలమైన అతడు, ఆ అనుభవంతో ఈసారి రాణించగలననే నమ్మకంతో ఉన్నాడు.
ఇక 2023లో తాష్కెంట్ వేదికగా జరిగిన పురుషుల ఎలైట్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నిశాంత్ దేవ్ కాంస్య పతకాన్ని సాధించాడు. ఇప్పుడు ఈ బాక్సర్‌పై కూడా భారీ ఆశలున్నాయి. మహిళల విభాగంలో బరిలో ఉన్న మరో ఇద్దరు భారత బాక్సర్లు జైస్మిన్ లాంబోరియా (57 కేజీ), ప్రీతి పన్వర్ (54 కేజీ). ఈ ఇద్దరిపై తక్కువ అంచనాలే ఉన్నప్పటికీ తీసిపారేసే బాక్సర్లు కాదని క్రీడా వర్గాల మాట.
పంచ్ కొడితే పతకం రావాల్సిందే - ఒలింపిక్ గేమ్సే లక్ష్యంగా హుసాముద్దీన్
ప్రపంచంలోనే ఖరీదైన బాక్సింగ్ మ్యాచ్.. విన్నర్‌కు 1800 కోట్లు.. రన్నరప్ 1000 కోట్లు!