ETV Bharat / sports

బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ షెడ్యూల్ రిలీజ్- సిరీస్​లో ఓ డే/నైట్ టెస్టు కూడా - Border Gavaskar Trophy 2024

Border Gavaskar Trophy 2024 Schedule: భారత్‌- ఆస్ట్రేలియా మధ్య జరిగే ప్రతిష్ఠాత్మక బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ షెడ్యూల్‌ విడుదలైంది.

Gavaskar Trophy 2024 Schedule
Gavaskar Trophy 2024 Schedule
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 26, 2024, 8:13 PM IST

Updated : Mar 26, 2024, 9:08 PM IST

Border Gavaskar Trophy 2024 Schedule: ప్రతిష్ఠాత్మక బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ 2024-25 షెడ్యూల్ మంగళవారం విడుదలైంది. ఈమేరకు ఐసీసీ (International Cricket Council) ఎక్స్​ (ట్విట్టర్)లో షెడ్యూల్​ షేర్ చేసింది. ఆస్ట్రేలియా వేదికగా 2024 నవంబర్- 2025 జనవరి మధ్యలో ఈ సిరీస్ జరగనుంది. ఈ ఏడాది నవంబర్​ 22న తొలి మ్యాచ్ ప్రారభం కానుంది. అయితే ఈ సిరీస్​లో ఓ డే/ నైట్​ టెస్టు (రెండో మ్యాచ్) కూడా ఉంది. అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6-10 మధ్య ఈ మ్యాచ్ జరగనుంది.

2024-25 బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ షెడ్యూల్

  • తొలి టెస్టు: నవంబర్‌ 22-26- పెర్త్
  • రెండో టెస్టు: డిసెంబరు 6-10- అడిలైడ్ (డే/నైట్‌)
  • మూడో టెస్టు: డిసెంబరు 14-18- బ్రిస్బేన్‌
  • నాలుగో టెస్టు: డిసెంబరు 26-30- మెల్‌బోర్న్‌
  • అయిదో టెస్టు: జనవరి 3-7- సిడ్నీ

ఇక 1996- 97లో ప్రారంభమైన ఈ టోర్నీ ఈసారి గతంలో కంటే భిన్నంగా ఈ టోర్నీ జరగనుంది. ఇప్పటి వరకూ 4 మ్యాచ్‌ల సిరీస్‌గా కొనసాగిన ఈ ట్రోఫీలో మరో టెస్టు జోడించారు. దీంతో ఇప్పటి నుంచి ఈ సిరీస్​లో 5 టెస్టు మ్యాచ్​లు జరగనున్నాయి. ఇక ఇప్పటివరకు 16సార్లు ఈ సిరీస్ జరగ్గా భారత్ అత్యధికంగా 10సార్లు విజేతగా నిలిచింది. 5సార్లు ఆస్ట్రేలియా నెగ్గగా, 2003-04లో డ్రా అయ్యింది.

గత నాలుగింట్లోనూ భారత్​దే ఆధిపత్యం: ఆడిన చివరి నాలుగు సిరీస్‌ల (2016-17, 2018-19, 2020-21, 2022- 23)లో టీమ్‌ఇండియా విజయం సాధించింది. ఇందులో రెండు సార్లు ఆస్ట్రేలియా గడ్డపైనే ఖంగారూలను ఓడించడం విశేషం. ఇక 2024 సిరీస్ గురించి క్రికెట్‌ ఆస్ట్రేలియా ఛైర్మన్ మైక్ బైర్డ్ మాట్లాడారు. ఈ సిరీస్​లో ఒక టెస్టు మ్యాచ్​ పెంచినందుకు సంతోషంగా ఉందని ఇటీవల తెలిపారు.'మా రెండు గొప్ప క్రికెట్ దేశాల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. ఈ ఉత్సాహం కారణంగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ఐదు టెస్టులకు పొడిగించినందుకు సంతోషంగా ఉన్నాం' అని ఛైర్మన్ మైక్ బైర్డ్ అన్నారు.

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో ఐదు టెస్టులు - బీసీసీఐ కీలక నిర్ణయం - Border Gavaskar Trophy 2024

ఐపీఎల్ ఫుల్ షెడ్యూల్ ఔట్ - ఫైనల్​ మ్యాచ్ చెన్నైలోనే - IPL 2024 Schedule

Last Updated : Mar 26, 2024, 9:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.