Border - Gavaskar Trophy 2024 : కీలకమైన బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ఇంకో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. మొదటి టెస్టుకు రోహిత్ శర్మ అందుబాటులో లేకపోయినా, తర్వాత సిరీస్‌లో జట్టుకు కెప్టెన్ వహించనున్నాడు. కోహ్లీ బ్యాటర్‌గా ఆరంభం నుంచి జట్టును ముందుకు నడిపించనున్నాడు. మరి ఈ స్టార్ దృఢంగా నిలబడి జట్టును నిలబెడతారా? వారి గణాంకాలు ఏం చెబుతున్నాయి? ప్రస్తుతం వారి ఫామ్ ఎలా ఉంది? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Kohli VS Australia : భారత బ్యాటర్లకు టఫ్ ఛాలెంజ్ విసిరే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పర్యటనల్లో మొదటి సారి ఇబ్బంది పడిన కోహ్లీ, తన రెండో సారి పర్యటనలో విశ్వరూపం చూపించి ప్రపంచ క్రికెట్ ఆశ్చర్యపోయేలా చేశాడు.
విరాట్, తన తొలి ఆస్ట్రేలియా పర్యటనలో 4 మ్యాచులు ఆడి 37.50 సగటుతో 300 పరుగులు సాధించాడు. ఓ ఆటగాడి కెరీర్ ఆరంభ దశలో ఇది మెరుగైన ప్రదర్శనే అని చెప్పాలి. 2014లో అతడు 4 మ్యాచ్‌ల్లో ఏకంగా 86.50 సగటుతో 692 పరుగులు ఖాతాలో వేసుకున్నాడు. అందులో శతకాలు ఉండటం విశేషం. అయినా సిరీస్‌లో ఓటమి ఎదురైంది.
కానీ 4 ఏళ్ల తర్వాత కోహ్లీ కెప్టెన్సీలో టీమ్ ఇండియా ఆస్ట్రేలియాలో తొలి సిరీస్ విజయం సాధించి సంచలనం సృష్టించింది. ఆ సిరీస్‌లో కోహ్లీ బ్యాటర్‌గానూ అద్భుతం చేశాడు. ఆ తర్వాతి సిరీస్‌లోనూ టీమ్ ఇండియా విజయం సాధించినప్పటికీ అందులో విరాట్ పాత్రేమీ లేదు. తొలి టెస్టులో ఓటమి అందుకున్న తర్వాత, అతడు కుటుంబ కారణాలతో సిరీస్‌కు దూరమయ్యాడు.
అయితే ఇప్పుడు విరాట్ కెప్టెన్‌గా కాకుండా, కేవలం బ్యాటర్‌గా ఆస్ట్రేలియా సిరీస్ ఆడబోతున్నాడు. అయితే ఇంతకముందు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన ప్రతీ సారి కోహ్లి బెస్ట్ ఫామ్‌తోనే వెళ్లాడు. కానీ ఇప్పుడు మాత్రం పేలవ ఫామ్‌తో వెళ్తున్నాడు. రీసెంట్గా న్యూజిలాండ్‌పై టీమ్ ఇండియా వైట్‌వాష్‌కు గురైన సిరీస్‌లో కోహ్లి 15.5 సగటుతో 93 పరుగులు మాత్రమే చేశాడు. పరుగులు చేయలేక ఇబ్బండి పడ్డాడు. దీంతో విరాట్ రిటైరైతే మంచిదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుత సిరీస్‌లో అతడు విఫలమైతే మాత్రం ఇబ్బందులు తప్పవు. తన కెరీర్‌ను తప్పక ముగించాల్సిన పరిస్థితి ఎదురవొచ్చు. ఆస్ట్రేలియాలో అయితే అతడికిది చివరి సిరీస్ అవ్వొచ్చు.
మొత్తంగా కోహ్లీ ఆస్ట్రేలియాపై 25 మ్యాచులు ఆడి 47.48 సగటుతో 2042 పరుగులు చేశాడు. అందులో అతడి అత్యధిక స్కోరు 186. వీటిలో 8 శతకాలు ఉన్నాయి. 5 అర్ధ శతకాలు ఉన్నాయి.
ఆస్ట్రేలియాలో 13 మ్యాచులు ఆడిన కోహ్లీ 54.08 సగటుతో 1352 పరుగులు సాధించాడు. ఇందులో అతడి అత్యధిక స్కోరు 169. మొత్తం 6 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు బాదాడు.
𝟏𝟎𝟎 𝐟𝐨𝐫 𝐊𝐢𝐧𝐠 𝐊𝐨𝐡𝐥𝐢 👑⚡️#INDvAUS #TeamIndia pic.twitter.com/UXGl32n3WL
— BCCI (@BCCI) March 12, 2023
Rohit Sharma VS Australia : టెస్టుల్లో రోహిత్ శర్మ కెరీర్ పుంజుకోవడానికి చాలా సమయమే పట్టింది. చాలా ఏళ్ల పాటు సుస్థిర స్థానం సంపాదించుకోలేకపోయాడు. కానీ టెస్టుల్లోనూ ఓపెనర్‌గా వచ్చిన తర్వాత అతడి స్టైల్ మారింది. ప్రధాన ఆటగాళ్లలో ఒకడిగా ఎదిగాడు. విరాట్ నుంచి కెప్టెన్సీ అందుకున్నాక జట్టులో మరింత కీలకంగా మారాడు.
కానీ ఆస్ట్రేలియాలో రోహిత్ రికార్డు అంత గొప్పగా ఏమీ లేదు. 7 టెస్టులు ఆడి 31.38 యావరేజ్‌తో 408 పరుగులే చేశాడు. ఒక్క సెంచరీ కూడా బాదలేదు. గత ఆసీస్ పర్యటనలో సిరీస్ సంచలన విజయం సాధించిన జట్టులో హిట్ మ్యాన్ కూడా ఉన్నాడు. కానీ అతడి ప్రదర్శన సాధారణంగానే ఉంది. అయితే ఇప్పుడతడు కెప్టెన్‌గా వెళ్లబోతున్నాడు. కానీ తన భార్య డెలివరీ కారణంగా తొలి టెస్టుకు దూరమయ్యాడు.
ఆ తర్వాత నాలుగు టెస్టుల్లో కెప్టెన్‌గా ఉండనున్నాడు. కాబట్టి అతడిపై పెద్ద బాధ్యత ఉంది. ప్రస్తుతం చేజారేలా కనిపిస్తున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్స్ ఫైనల్ బెర్తుకు అర్హత సాధించాలన్నా టీమ్‌ఇండియా ఈ సిరీస్‌లో అసాధారణ ప్రదర్శన చేయాలి. ఆ దిశగా జట్టును రోహిత్ నడిపించాలి. కాగా, రోహిత్‌కు కూడా ఇదే చివరి ఆస్ట్రేలియా పర్యటన కానుంది. కెరీర్ కూడా ముగింపు దశలో ఉంది. చూడాలి మరి ఈ సిరీస్‌లో ఎలా ఆడతాడో.
మొత్తంగా ఆస్ట్రేలియాపై రోహిత్ 12 మ్యాచులు ఆడి 33.71 సగటుతో 708 పరుగులు చేశాడు. 120 అత్యధిక స్కోరు. ఓ సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు బాదాడు.
ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి 7 మ్యాచులు ఆడి 31.38 సగటుతో 408 రన్స్ చేశాడు. 63* అత్యధిక స్కోరు. అక్కడ ఒక్క సెంచరీ కూడా బాదలేదు. 3 అర్ధ శతకాలు ఉన్నాయి.
NEWS - Rohit Sharma clears fitness test, set to join Team India in Australia.
— BCCI (@BCCI) December 12, 2020
More details here - https://t.co/OTENwpOOjt #TeamIndia #AUSvIND pic.twitter.com/iksKNmMi97
ఛాంపియన్స్ ట్రోఫీ - పాక్‌ను ఒప్పించేందుకు ఐసీసీ తెర వెనక ప్రయత్నాలు!