Yash Dayal Border Gavaskar Trophy : ఉత్తర్ ప్రదేశ్ యంగ్ ఫాస్ట్ బౌలర్ యశ్ దయాళ్ బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ సిరీస్ కోసం టీమ్ ఇండియా జట్టులో బ్యాకప్ ప్లేయర్‌గా జాయిన్ అయ్యాడు. ఈ విషయాన్ని యశ్ తండ్రి చందర్ పాల్ నేషనల్ మీడియాతో చెప్పారు. అయితే, దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. రీసెంట్గా దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగు టీ20ల సిరీస్‌కు యశ్ దయాళ్ సెలక్ట్ అయ్యాడు. కానీ, అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రాలేదు. ఈ సిరీస్ జరుగుతుండగానే ఆస్ట్రేలియాలో టెస్టు జట్టుకు తన తనయుడు ఎంపికయ్యాడని యశ్ తండ్రి చెప్పారు.
"యశ్ దయాళ్ సౌతాఫ్రికాలో టీ20 టీమ్‌తో ఉన్నప్పుడు ఆస్ట్రేలియాలో టెస్టు జట్టులో చేరాలని ఒక కాల్ వచ్చింది. అందుకే యశ్ దయాళ్ నవంబర్ 17 న అక్కడికి వెళ్ళ వలసి వచ్చింది. అతడు బ్యాకప్ ప్లేయర్‌గా జట్టులో జాయిన్ అయ్యాడు. ఈ రోజు అతడు మొదటి ప్రాక్టీస్ సెషన్ ప్రారంభం కానుంది. అతడు త్వరగా అరంగేట్రం చేసి మంచి ప్రదర్శన ఇచ్చి జట్టు విజయాల్లో భాగం కావాలని నేను కోరుకుంటున్నాను" అని చందర్ పాల్ అన్నారు.
Yash Dayal Australia Series : ప్రస్తుతం యశ్ దయాళ్ వయసు 26 ఏళ్లు. రీసెంట్గా ల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్ టీమ్‌లోనూ అతు చోటు దక్కించుకున్నాడు. అయితే అతడికి అరంగేట్రం చేసే అవకాశం రాలేదు. సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా వంటి పేసర్లు టీమ్‌లో ఉన్నా, ఐదు టెస్టుల సిరీస్ కావడంతో ముందు జాగ్రత్త చర్యగా యశ్ దయాళ్‌ను బ్యాకప్ ప్లేయర్‌గా తీసుకున్నట్లు తెలిసింది. యశ్ దయాళ్ ఇప్పటి వరకు 24 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి, 28.89 సగటుతో 76 వికెట్లు తీశాడు. నవంబర్ 22 నుంచి బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ సిరీస్ మొదలు కానుంది. తొలి టెస్టు పెర్త్ వేదికగా నిర్వహించనున్నారు.