Agni Chopra Ranji Trophy 2024 : అగ్ని చోప్రా దేశవాళీ క్రికెట్లో రికార్డుల మీద రికార్డులు నెలకొల్పుతున్నాడు. రంజీల్లో మిజోరంకు ప్రాతినిథ్యం వహిస్తున్న అగ్ని, అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన ఒకే టెస్టు మ్యాచ్‌లో సెంచరీ, డబుల్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. దేశవాళీ క్రికెట్లో ఒకే మ్యాచ్‌లో సెంచరీ, డబుల్ సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా అగ్ని రికార్డుకెక్కాడు.
భారీ ఇన్నింగ్స్‌లతో ప్రత్యర్థి కుదేల్! - అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 110 పరుగులు చేసిన అగ్ని, రెండో ఇన్నింగ్స్‌లో 238 పరుగులు చేశాడు. అగ్ని సూపర్ శతకాలతో చెలరేగడం వల్ల ఈ మ్యాచ్‌లో మిజోరం 267 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో అగ్నికి 'ప్లేయర్ ఆప్ ద మ్యాచ్' అవార్డు లభించింది.
పరుగుల వరద - 2023-24 రంజీ సీజన్లో పరుగుల వరద పారించాడు అగ్ని. ఆరు మ్యాచుల్లో 78.25 సగటుతో ఏకంగా 939 పరుగులు బాదాడు. అందులో ఐదు శతకాలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ అయితే ఏకంగా 103.30 ఉండడం గమనార్హం. ఓవరాల్‌గా 8 లిస్ట్ ఏ మ్యాచులను ఆడిన అగ్ని, 1367 రన్స్ చేశాడు. అందులో 7 సెంచరీలు, 4 అర్ధ శతకాలు ఉన్నాయి.
అవకాశాల కోసం మిజోరం తరఫున - మిచిగాన్‌లోని డెట్రాయిట్లో జన్మించిన అగ్ని చోప్రా గతేడాది మిజోరాం తరఫున రంజీల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ముంబయి ఏజ్ గ్రూప్ లీగ్‌లో తన కెరీర్‌ను ప్రారంభించిన అగ్ని, ఆ తర్వాత మరిన్ని అవకాశాలను పొందేందుకు మిజోరాంకు మకాం మార్చాడు. 25 ఏళ్ల అగ్ని 2023లో చండీగఢ్‌తో జరిగిన లిస్ట్ ఏ మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. అండర్ ప్రెజర్లోనూ నిలకడగా రాణించడం ఈ యువ ప్లేయర్లో ఉన్న ప్రత్యేకత. అలాగే బంతిని బలంగా బాదడంలో ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ దిట్ట అని చెప్పొచ్చు.
బాలీవుడ్ దర్శకనిర్మాత కుమారుడే అగ్ని - ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత విధు వినోద్ చోప్రా కుమారుడే అగ్ని చోప్రా. ఇటీవల బ్లాక్ బస్టర్ కొట్టిన '12th ఫెయిల్' సినిమాను తెరకెక్కించింది విధు వినోద్ చోప్రానే. ఈ సినిమాకు నిర్మాత కూడా ఆయనే. అలాగే ఆమిర్ ఖాన్ 'త్రి ఇడియడ్స్', సంజయ్ దత్ 'మున్నాభాయ్ ఎంబీబీఎస్' కు కథను అందించారు. అలాగే నిర్మాతగానూ వ్యవహరించారు. విధు వినోద్ దర్శకుడు, నిర్మాత, రచయితగానూ బాలీవుడ్లో పేరుపొందారు. అలాగే అగ్ని చోప్రా తల్లి అనుపమ చోప్రాకు బాలీవుడ్లో మూవీ క్రిటిక్‌గా మంచి పేరుంది.
Agni Chopra, son of Film Director Vidhu Vinod Chopra, completed 1000 runs in first-class cricket in just 7 matches, scoring 5 centuries and 5 fifties with an impressive average of over 72 🤯 pic.twitter.com/FPhvEJJE2p
— Vipin Tiwari (@Vipintiwari952) October 20, 2024
కివీస్‌తో రెండో టెస్టులో పంత్ ఆడతాడా?, గిల్ పరిస్థితేంటి? - భారత అసిస్టెంట్ కోచ్ రిప్లై ఇదే
'టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఆడేందుకు సిద్ధమయ్యా - కానీ రోహిత్ అలా అనేసరికి!'