ETV Bharat / sports

మిడిలార్డర్ నుంచి ఓపెనర్లుగా ప్రమోట్​- ఇంటర్నేషనల్ క్రికెట్​లో అదరగొట్టిన బ్యాటర్లు వీరే! - Top Openers In International Format

author img

By ETV Bharat Sports Team

Published : 2 hours ago

Best Openers In International Cricket : కెరీర్ తొలినాళ్లలో మిడిలార్డర్ గా బరిలోకి దిగి, ఆ తర్వాత కాలంలో ఓపెనర్లగా అవతారమెత్తి, దిగ్గజ క్రికెటర్లుగా మారిన ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం పదండి.

Best Openers In International Cricket
Best Openers In International Cricket (Getty Images)

Best Openers In International Cricket : క్రికెట్​లో ప్రతి ఆటగాడు కీలకమే. ఓపెనర్ నుంచి 11వ స్థానంలో దిగే బౌలర్ వరకు అందరూ సమష్ఠిగా రాణిస్తేనే జట్టు సునాయాశంగా విజయం సాధిస్తుంది. ఈ క్రమంలో అంతర్జాతీయ కెరీర్ తొలినాళ్లలో మిడిలార్డర్​లో బ్యాటింగ్ చేసి ఆ తర్వాత ఓపెనర్లుగా మారి సక్సెస్ అయిన టాప్-3 బ్యాటర్ల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వీరేంద్ర సెహ్వాగ్ (నజఫ్‌ గఢ్ నవాబ్)
టీమ్ ఇండియా మాజీ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ తన అంతర్జాతీయ కెరీర్​ను మిడిల్ ఆర్డర్ బ్యాటర్​గా ప్రారంభించాడు. ఆ తర్వాత కాలంలో ఓపెనర్ స్థానానికి ప్రమోట్ అయ్యాడు. అప్పటి నుంచి అన్ని ఫార్మాట్లలోనూ వెనుదిరిగి చూసుకోకుండా అదరగొట్టాడు. ఇన్నింగ్స్ తొలి బంతి నుంచి దూకుడుగా ఆడేవాడు. దిగ్గజ బౌలర్లకు సైతం చుక్కలు చూపించేవాడు.

ఈ క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్ 2004లో జరిగిన టెస్టు మ్యాచ్​లో పాకిస్థాన్​పై ట్రిపుల్ సెంచరీ(309) బాదాడు. అలాగే 2008లో దక్షిణాఫ్రికాపై డబుల్ శతకం (293)తో చెలరేగాడు. టెస్టు మ్యాచ్​ల్లోనూ వన్డేల్లా దూకుడుగా ఆడేవాడు సెహ్వాగ్. మిడిలార్డర్ నుంచి ఓపెనర్​గా మారిన తర్వాత క్రికెడ్ లెజెండ్​గా సెహ్వాగ్ మారాడనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

రోహిత్ శర్మ (హిట్‌ మ్యాన్)
క్రికెట్ చరిత్రలో అత్యంత నిలకడైన ఓపెనర్లలో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒకడు. కెరీర్ తొలినాళ్లలో మిడిలార్డర్​లో బ్యాటింగ్ దిగిన హిట్​మ్యాన్, సొగసైన స్ట్రోక్ ప్లే, దూకుడైన బ్యాటింగ్ శైలితో ఓపెనర్​గా ప్రమోట్ అయ్యాడు. ఆ తర్వాత రోహిత్ కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది. వన్డేల్లో ఏకంగా హిట్ మ్యాన్ మూడు డబుల్ సెంచరీలను బాదాడు. అలాగే టెస్టుల్లోనూ అదరగొడుతున్నాడు. ప్రస్తుతం టీ20లకు గుడ్ బై చెప్పిన రోహిత్, టీమ్ ఇండియాకు వన్డే, టెస్టు ఫార్మాట్​కు కెప్టెన్​గా వ్యవహరిస్తున్నాడు.

బ్రెండన్ మెక్ కల్లమ్ (ది బజ్)
న్యూజిలాండ్ మాజీ దిగ్గజం బ్రెండన్ మెక్​కల్లమ్ కెరీర్ తొలినాళ్లలో మిడిలార్డర్​లో బ్యాటింగ్​కు దిగేవాడు. ఆ తర్వాత ఓపెనర్​గా అవకాశం దక్కింది. దీంతో మెక్ కల్లమ్ ఆకాశమే హద్దుగా బౌలర్లపై విరుచుకుపడేవాడు. 2015 ప్రపంచ కప్ ఫైనల్​లో ఆస్ట్రేలియాపై కేవలం 73 బంతుల్లో 158 పరుగులు బాదాడు. అంతలా ఓపెనర్​గా ప్రమోటైన తర్వాత మెక్​కల్లమ్ దూకుడును చూపించాడు. కెప్టెన్​గా ఉన్న సమయంలో కూడా మెక్​కల్లమ్ తన దూకుడును తగ్గించలేదు. ప్రస్తుతం బజ్​బాల్ వ్యూహం సృష్టికర్తగానూ మెక్​కల్లమ్​ను పిలుస్తున్నారు.

సింగిల్ బాల్​కు 286 రన్స్​ - పిచ్ మధ్యలో 6కిమీ పరుగు- క్రికెట్​లో రేర్ సీన్ - One Ball 286 Runs

అప్పుడు సచిన్ కొలీగ్- ఇప్పుడు ఫేమస్ బిజినెస్​మ్యాన్- టాలీవుడ్ హీరోయిన్​ మరిదే! - Sachin Tendulkar Colleague

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.