ETV Bharat / sports

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్​ - కన్​ఫ్యూజన్​లో ఆ స్టార్ ప్లేయర్ల కెరీర్

BCCI Central Contract 2024 : బీసీసీఐ తాజాగా తమ వార్షిక కాంట్రాక్ట్​కు ఎంపికైన ప్లేయర్ల జాబితాను వెల్లడించింది. అయితే ఇందులో కొంతమంది సీనియర్ ప్లేయర్లు చోటు దక్కించుకోలేకపోయారు. దీంతో వారి భవిత్వం పట్ల అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

BCCI Central Contract 2024
BCCI Central Contract 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 29, 2024, 1:34 PM IST

Updated : Feb 29, 2024, 1:46 PM IST

BCCI Central Contract 2024 : బీసీసీఐ తాజాగా టీమ్ఇండియా ప్లేయర్లకు సంబంధించిన కొత్త యాన్యువల్ కాంట్రాక్ట్​ను ప్రకటించింది. ఇందులో భాగంగా 11 మంది యంగ్ ప్లేయర్లను ఈ లిస్ట్​లో యాడ్​ చేయగా, కొంతమంది సీనియర్లు మాత్రం ఈ జాబితాలో స్థానం దక్కించుకోలేకపోయారు. దీంతో ఆ ప్లేయర్ల కెరీర్ పాక్షికంగా ముగిసినట్లేనంటూ క్రిటిక్స్​ చర్చలు మొదలెట్టారు. అంతే కాకుండా ఈ రిజల్ట్​తో ఆ ప్లేయర్లు ఇక రిటైర్మెంట్​ ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇంతకీ ఆ స్టార్స్ ఎవరంటే ?

శిఖర్ ధావన్: 2022 డిసెంబర్​లో భారత జట్టు తరపున తన చివరి మ్యాచ్ ఆడాడు టీమ్ఇండియా వెటరన్​ ప్లేయర్ శిఖర్ ధావన్‌. అయితే ఆ తర్వాత అతడిపై సెలక్టర్లు అంతగా ఇంట్రెస్ట్​ చూపించలేదు. దీంతో ధావన్​ ప్రస్తుతం ఏ రూపంలోనూ జట్టులో లేడు. అయితే ఇప్పుడు సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బీసీసీఐ మినహాయించడం వల్ల అతడి పునరాగమనంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఛతేశ్వర్ పుజారా: ఇక తాజా కాంట్రెక్ట్​లో చోటు దక్కించుకోని క్రికెటర్లలో స్టార్​ ప్లేయర్ ఛతేశ్వర్​ పుజారా పేరు కూడా ఉంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్స్​ తర్వాత టీమ్ఇండియాకు దూరమైన పుజారా, ప్రస్తుతం రంజీలో తన సత్తా చాటుతున్నాడు. శతకాలు బాది సంచలనాలు క్రియేట్​ చేస్తున్నాడు. ఇంగ్లాండ్​ టెస్ట్ సిరీస్​లో భాగంగా టీమ్ఇండియా తుది జట్టులోకి పుజారాను ఎంపిక చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ అది జరగలేదు. ఇప్పుడీ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి కూడా అతడ్ని తప్పించారు. దీంతో పుజారా కెరీర్ ముగిసిందంటూ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

అజింక్యా రహానే : టీమ్ఇండియా మాజీ వైస్ కెప్టెన్ అజింక్యా రహానేను కూడా బీసీసీఐ ఈ వార్షిక కాంట్రాక్ట్​కు ఎంపిక చేయలేదు. గతేడాది ఐపీఎల్ తర్వాత భారత జట్టులోకి వచ్చిన రహానే, 2023 డబ్ల్యూటీసీ ఫైనల్స్​లో సత్తా చాటాడు. ఇక వెస్టిండీస్‌ టూర్​లోనూ అతడు వైస్‌ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే, దీని తర్వాత అకస్మాత్తుగా జట్టుకు దూరమయ్యాడు. మరోవైపు రంజీల్లోనూ రహానే పేలవంగానే ఆడుతున్నాడు.

ఉమేశ్​ యాదవ్ : గతేడాది కాంట్రాక్ట్​లో ఉన్న టీమ్ఇండియా ఫాస్ట్ బౌలర్ ఉమేశ్​ యాదవ్ ఈ సారి తన స్థానాన్ని దక్కించుకోలేకపోయాడు. దీంతో ఈ స్టార్ బౌలర్​ కమ్​బ్యాక్​పై క్రికెట్​ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇషాంత్ శర్మ : గత రెండేళ్లుగా జట్టుకు దూరంగా ఉన్న టీమ్ఇండియా సీనియర్ ప్లేయర్ ఇషాంత్ శర్మ కూడా ఈ సారి కాంట్రాక్ట్​లోకి ఎంపిక కాలేకపోయాడు. దీంతో ఇషాంత్ ఇకపై టీమ్ఇండియాలోకి వస్తాడో లేదో అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.

సెంట్రల్​ కాంట్రాక్ట్ నుంచి ఔట్​ - ఇషాన్, శ్రేయస్​కు కలిగే నష్టాలేంటి?

బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్​ - శ్రేయస్​, ఇషాన్​పై వేటు!

Last Updated : Feb 29, 2024, 1:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.