ETV Bharat / sports

'బాబర్'కు చేదు అనుభవం- పాక్ ఫ్యాన్స్ ట్రోల్స్- వీడియో వైరల్ - babar azam centurie

Babar Azam Trolled: పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్​ పీఎస్​ఎల్​లో ట్రోలింగ్​కు గురయ్యాడు. తన సొంత దేశం ఫ్యాన్స్​ బాబర్​ను ట్రోల్ చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్​టాపిగ్​గా మారింది.

Babar Azam Trolled
Babar Azam Trolled
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 24, 2024, 7:31 PM IST

Updated : Feb 24, 2024, 7:52 PM IST

Babar Azam Trolled: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్​కు స్వదేశంలో చేదు అనుభవం ఎదురైంది. 2024 పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ (Pakistan Premier League 2024)​లో ది పెష్వార్ జల్మి- ముల్తాన్ సుల్తాన్ మ్యాచ్​ జరుగుతుండగా సొంత దేశం అభిమానులే బాబర్​ను ట్రోల్ చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన బాబర్ చేతిలో ఉన్న బాటిల్​ను ఫ్యాన్స్​పై విసరబోయాడు.

బాబర్​ ఆజమ్​ ది పెష్వార్ జల్మి జట్టుకు కెప్టెన్​గా వ్యవహరిస్తున్నాడు. శుక్రవారం ముల్తాన్ సుల్తాన్​తో మ్యాచ్ జరుగుతుండగా బాబర్ బౌండరీ లైన్​ వద్ద టీమ్​మేట్స్​తో కలిసి కూర్చున్నాడు. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు 'జింబాబర్', 'జింబాబర్' అంటూ బాబర్​ను ట్రోల్ చేశారు. దీంతో బాబర్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. 'ఇలా రండి' అన్నట్లుగా సైగ చేసిన బాబర్, తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్​ను వారిపై విసరబోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

అయితే బాబర్ జింబాబ్వేపై సిరీస్​ల్లో మాత్రమే హాఫ్ సెంచరీలు, సెంచరీలు బాది ర్యాంకింగ్స్​లో టాప్ ప్లేస్ దక్కించుకున్నాడని కొందరు అంటుంటారు. అందుకే అతడిని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తుంటారు. అయితే ఈసారి ప్రేక్షకులు హద్దులు దాటి ప్రవర్తించారు. ఏకంగా లైవ్​లోనే బాబర్​ను విమర్శించారు. ఇక 2023 వరల్డ్​కప్​లో పాకిస్థాన్ ఓటమికి పూర్తి బాధ్యత వహించిన బాబర్ అన్ని ఫార్మాట్​ల కెప్టెన్ బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నాడు. ప్రస్తుతం బ్యాటర్​గానే కొనసాగుతున్నాడు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే, టాస్ నెగ్గిన పెష్వార్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో పెష్వార్ ఎనిమిది వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (31 పరుగులు) ఫర్వాలేదనిపించాడు. ఛేజింగ్​లో ముల్తాన్ సుల్తాన్ 174 పరుగులకే కుప్పకూలింది. దీంతో పెష్వార్ 5 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ సీజన్​లో మూడు మ్యాచ్​లు ఆడిన పెష్వార్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ప్రస్తుతం 2 పాయింట్లతో పెష్వార్ ఐదో స్థానంలో ఉండగా, ముల్తాన్ సుల్తాన్ 6 పాయింట్లతో టాప్​లో ఉంది.

స్టంపౌట్​ చేశాడని రిజ్వాన్​ను​ బ్యాట్​తో కొట్టబోయిన బాబర్!-​ వీడియో చూశారా?

బాబర్ షాకింగ్ డెసిషన్ - పాక్​ కెప్టెన్సీకి గుడ్​బై

Last Updated : Feb 24, 2024, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.