ETV Bharat / sports

T20 సిరీస్​లో ఆసీస్ విజయం- ట్రోఫీకి బదులు ​'ఐస్ క్రీమ్ కప్​'- ఎందుకంటే? - AUS vs Scotland 2024 - AUS VS SCOTLAND 2024

Australia vs Scotland 2024: తాజాగా స్కాట్‌లాండ్‌పై ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌ గెలిచింది. ఈ సందర్భంగా అందజేసిన కప్పు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Australia vs Scotland 2024
Australia vs Scotland 2024 (Source: Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Sep 11, 2024, 10:46 PM IST

Australia vs Scotland 2024: ఆస్ట్రేలియా- స్కాట్లాండ్ మధ్య టీ20 సిరీస్‌ సోషల్ మీడియాలో హాట్ టాపిక్​గా మారింది. సిరీస్‌లో ఊహించని ఫలితాలు ఏవీ రాలేదు. అందరికీ తెలిసినట్లే ఆస్ట్రేలియా 3-0తో సిరీస్‌ని క్లీన్‌ స్వీప్‌ చేసింది. మరెందుకు హాట్ టాపిక్ అయ్యింది అనుకుంటున్నారా? ఎడిన్‌బర్గ్‌లో సిరీస్‌ విజేతలకు అందజేసిన కప్పును చూసి ఆస్ట్రేలియా ప్లేయర్లు షాక్‌ అయ్యారు. సిరీస్‌ పూర్తయ్యాక ఆసీస్ ప్లేయర్లకు ట్రోఫీకి బదులు 'ఐస్‌క్రీమ్ కప్'ని పోలి ఉన్న ఓ గిన్నే (Bowl)ను ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా ఆసీస్ ప్లేయర్లంతా నవ్వుల్లో మునిగిపోయారు.

ఆ ట్రోఫీ ఏంటంటే?
స్కాట్‌లాండ్‌లో ఈ ప్రత్యేక వస్తువును 'క్వాయిచ్ (Quaich)' అని పిలుస్తారు. ఈ మినీ- బౌల్‌ని ట్రెడిషినల్‌గా విస్కీ లేదా ఇతర పానీయాలను తాగడానికి ఉపయోగిస్తారు.

నవ్వుల్లో మునిగిపోయిన ఆస్ట్రేలియా
కెప్టెన్ మిచెల్ మార్ష్‌కి ప్రెజెంటర్ ట్రోఫీని అందజేయగా, జట్టు మొత్తం నవ్వుల్లో మునిగిపోయింది. మార్ష్ కూడా నవ్వును దాచుకోలేకపోయాడు. కప్పు అందిస్తుండగా కాస్త కన్ఫ్యూజ్‌ అయ్యాడు. ట్రోఫీని వింతగా చూశాడు. విషయం అర్థమయ్యాక నవ్వుతూ కప్పు పట్టుకొన్నాడు. అనంతరం ప్లేయర్లంతా అందరూ ఫోటో కోసం గుమిగూడారు. ఆ విచిత్రమైన ట్రోఫీతో ఎలా పోజులివ్వాలో తెలియక తికమక పడటం మరింత నవ్వు తెప్పించింది.

నెటిజన్ల స్పందన
క్వాయిచ్ చారిత్రిక ప్రాముఖ్యత తెలియకపోయినా, ఆస్ట్రేలియన్లు కప్‌ను చూసి నవ్వు ఆపుకోలేకపోయారు. ఈ అంశం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు ట్రోఫీని 'ఐస్‌క్రీమ్ కప్', 'గిన్నె' తో పోలుస్తున్నారు. ఇంకొందరు 'టీ కప్‌' అని కామెంట్లు చేస్తున్నారు. ఓ యూజర్‌ 'పాకిస్థాన్‌ నుంచి ఆర్డర్‌ చేశారా? ఏంటి?' అని కామెంట్‌ చేశాడు.

అదరగొట్టిన గ్రీన్
చివరి టీ20లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కామెరూన్‌ గ్రీన్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండింట్లో రాణించాడు. బౌలింగ్‌లో మూడు వికెట్లు తీసి 35 పరుగులు ఇచ్చాడు. బ్యాటింగ్‌లో 39 బంతుల్లో 62 పరుగులు చేసి మ్యాచ్‌ గెలిపించాడు. స్కాట్‌లాండ్ నిర్దేశించిన 149 పరుగుల లక్ష్యాన్ని 23 బంతులు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా ఛేదించింది. స్కాట్‌లాండ్ బ్యాటర్‌ బ్రాండన్ మెక్‌ముల్లెన్ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మిగతా బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో స్కాట్‌లాండ్‌కి ఓటమి తప్పలేదు.

ఆస్ట్రేలియాకు టీమ్​ఇండియా చెక్‌ - అజేయంగా సెమీస్‌లోకి ఎంట్రీ - T20 WORLD CUP 2024

'మమ్మల్ని ఓడించడాన్ని ఇండియన్స్ బాగా ఇష్టపడతారు!' - Border Gavaskar Trophy 2024 25

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.