Warner LifeTime Captaincy Ban Lifted : 2018లో సాండ్‌పేపర్ స్కాండల్ నేపథ్యంలో ఆస్ట్రేలయా మాజీ ప్లేయర్ డేవిడ్ వార్నర్‌పై జీవిత కాల కెప్టెన్సీపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అతడిపై ఉన్న ఈ జీవిత కాల కెప్టెన్సీ నిషేధం ఎత్తివేసింది క్రికెట్ ఆస్ట్రేలియా. తనపై విధించిన బ్యాన్‌ను తొలగించాలని ఇప్పటికే వార్నర్ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దీంతో ముగ్గురితో కూడిన రివ్యూ ప్యానెల్ అప్పీల్‌ను సమీక్షించి ఏకగ్రీవంగా నిర్ణయాన్ని ప్రకటించింది.
ఈ తాజా ప్రకటనతో వార్నర్ బిగ్‌బాష్ లీగ్‌లో నాయకత్వం చేపట్టే అవకాశం ఉంటుంది. నిషేధం వల్ల ఇప్పటి వరకు ఆస్ట్రేలియా జాతియ జట్టుతో పాటు లీగ్‌ల్లోనూ సారథ్యం చేపట్టకుండా ఉన్న వార్నర్, రాబోయే బిగ్‌బాష్ లీగ్‌లో ఫ్రాంఛైజీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించేందుకు అవకాశం దొరికినట్లైంది. సిడ్నీ థండర్స్‌కు అతడు నాయకత్వం వహించనున్నాడు.
"వార్నర్ తన పొరపాటుకు బాధ్యత వహించాడు. క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయంపై రివ్యూ చేయాలని విజ్ఞప్తి చేశాడు. దీంతో మేం పూర్తి స్థాయిలో సమీక్షించాం. ఆ సంఘటన గురించి వార్నర్ స్టేట్‌మెంట్‌ను కూడా తీసుకున్నాం. నిషేధం ఎదుర్కొంటున్నప్పటి నుంచి అతడి ప్రవర్తన, కండక్ట్ చాలా మారింది. బాగుంది కూడా. ఒక్కసారి కూడా ప్రత్యర్థి జట్టుపై స్లెడ్జింగ్, కవ్వింపు చర్యలకు పాల్పడలేదు. దీంతో రివ్యూ పానెల్ వార్నర్ పై మంచి ఉద్దేశంతోనే ఉంది. అందుకే అతడిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నాం" అని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది.
సాండ్‌పేపర్ స్కామ్ ఇదే - స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా 2018లో నాలుగు టెస్ట్‌ల సిరీస్ ఆడేందుకు సౌతాఫ్రికాకు వెళ్లింది. మొదటి రెండు టెస్టుల్లో చెరొకటి గెలిచి సిరీస్‌ను సమం చేశాయి. మూడో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్ బాన్‌క్రాఫ్ట్ బంతిని రుద్దుతూ కనిపించాడు. దీంతో సాండ్ పేపర్‌లా ఉన్న గుడ్డ ముక్కను జేబులో దాచి పెట్టినట్లు ప్రత్యర్థి జట్టు ఆరోపించింది. దీని వెనక అప్పుడు వైస్ కెప్టెన్‌గా ఉన్న డేవిడ్ వార్నర్ కీలక పాత్ర పోషించాడని, బాన్‌క్రాఫ్ట్ అలా చేయమని చెప్పినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అలానే అప్పుడు మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లోనూ బాన్ క్రాఫ్ట్ మాట్లాడుతూ, సాండ్ పేపర్‌ను ఉపయోగించినట్లు అంగీకరించాడు. దీంతో విచారణ చేపట్టిన క్రికెట్ ఆస్ట్రేలియా స్మిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించింది. బాన్ క్రాఫ్ట్ కూడా నిషేధం ఎదుర్కొన్నాడు. అలానే వైస్ కెప్టెన్‌గా ఉన్న వార్నర్‌పైనా జీవిత కాలం కెప్టెన్సీ బ్యాన్ విధించింది.
మా బ్రదర్ విషయంలో అలా చేయడం సరికాదు!: వాషింగ్టన్ సుందర్ సోదరి