ETV Bharat / sports

వరల్డ్​కప్ ​ఛాంపియన్ల అడ్డా- ఆసీస్​, ఇంగ్లాండ్​పైనే అందరి కళ్లు! - T20 World Cup 2024 - T20 WORLD CUP 2024

Australia T20 World Cup 2024: టీ20 వరల్డ్​కప్​కు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు సిద్ధమవుతున్నాయి. ప్రపంచ క్రికెట్​లో స్టార్ జట్లైన ఆసీస్ రెెండో టైటిల్​ కోసం, ఇంగ్లాండ్ మూడో కప్పుకోసం బరిలో దిగనున్నాయి.

Australia England T20
Australia England T20 (Source: Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : May 31, 2024, 9:28 AM IST

Australia T20 World Cup 2024: ప్రపంచ క్రికెట్​లో అత్యంత పటిష్ఠమైన జట్లలో ఆస్ట్రేలియా ఒకటి. గతేడాది 2023 డబ్ల్యూటీసీ, 2023 వన్డే వరల్డ్​కప్ ఖాతాలో వేసుకున్న ఆసీస్ తాజాగా 2024 టీ20 ప్రపంచకప్​పైనా కన్నేసింది. వరుసగా మూడో ఐసీసీ ట్రోఫీ పట్టేయాలన్న కసితో ఆసీస్ రెడీ అవుతోంది. వన్డే వరల్డ్​కప్​లో అత్యధిక ట్రోఫీలు నెగ్గిన ఆసీస్, టీ20 ప్రపంచకప్​ను ఆలస్యంగా (2021) సాధించినా, ఆ జట్టును ఈజీగా తీసుకోడానికి లేదు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉన్న కంగారూలు ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వనున్నారు.

బ్యాటింగ్​లో ట్రావిస్ హెడ్, బౌలింగ్​లో మిచెల్ స్టార్క్ ఆ జట్టుకు కీలక ఆటగాళ్లు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఇద్దరూ రీసెంట్​గా ముగిసిన ఐపీఎల్​లో ఏ స్థాయిలో రాణించారో ఇప్పుటికే చూశాం. ఇక కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్, మ్యాక్స్‌వెల్, స్టాయినిస్, గ్రీస్‌ రూపంలో ఆసీస్‌కు ఆల్‌రౌండర్లకూ కొదవ లేదు. బౌలింగ్​లో స్టార్క్​తోపాటు కమిన్స్, హేజిల్‌వుడ్‌ బుల్లెట్ లాంటి బంతులతో ప్రత్యర్థులను హడలెత్తిస్తారు. ఇక గత 12నెలల్లో ఆసీస్ 10.11 రన్‌రేట్‌తో పరుగులు సాధించడం విశేషం.

  • ప్రదర్శన: 2021లో ఛాంపియన్

డిఫెండింగ్ ఛాంప్​గా బరిలోకి: 2024 టీ20 వరల్డ్​కప్​లో ఇంగ్లాండ్ డిఫెండింగ్ ఛాంప్​ హోదాలో బరిలోకి దిగనుంది. టెస్టుల్లో దూకుడైన ఆటతో ప్రత్యర్థులను బెంబేలిస్తున్న ఇంగ్లాండ్, ఇక టీ20ల్లో ఏ రకంగా రెచ్చిపోగలదో అర్థం చేసుకోవచ్చు. 2010, 2022లో టైటిల్ నెగ్గిన ఇంగ్లాండ్ ముచ్చటగా మూడోసారి హాట్ ఫేవరెట్​గా బరిలోకి దిగనుంది. ఫిల్‌ సాల్ట్‌, విల్ జాక్స్, బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, బెన్ డకెట్​తో బ్యాటింగ్ బలంగా ఉంది. ఇక మొయిన్‌ అలీ, శామ్‌ కరన్, లియమ్ లివింగ్‌స్టోన్​తో ఆల్​రౌండ్ విభాగం, ఆదిల్‌ రషీద్‌, ఆర్చర్, జోర్డాన్, టాప్లీ, మార్క్‌వుడ్‌తో బౌలింగ్​లోనూ పటిష్ఠంగా ఉంది. ఇలా జట్టునిండా స్టార్లతో ఉన్న ఇంగ్లాండ్ మూడోసారి టైటిల్ వేటలో దిగేందుకు సిద్ధమవుతోంది.

  • ఉత్తమ ప్రదర్శన: 2010, 2022లో ఛాంపియన్

వరల్డ్ కప్ హిస్టరీలో టాప్​ - 5 వికెట్​ టేకర్స్​ వీరే! - T20 World Cup 2024

అన్ని టోర్నీల్లోనూ భాగమైన ఆ ఇద్దరు ప్లేయర్స్​ ఎవరంటే? - T20 World cup 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.