ETV Bharat / sports

ఫస్ట్​ ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా 445 పరుగులకు ఆలౌట్ - బుమ్రా ఖాతాలో మరో రికార్డు - AUS VS IND 3RD TEST

మరో రికార్డు సాధించిన బుమ్రా - కపిల్ దేవ్ తర్వాతి స్థానంలో చోటు

IND VS AUS 3rd Test Bumrah Wickets Record
IND VS AUS 3rd Test Bumrah Wickets Record (source Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : 2 hours ago

IND VS AUS 3rd Test Bumrah Wickets Record : బోర్డర్‌- గావస్కర్‌ సిరీస్‌ గమనాన్ని నిర్ణయించే కీలకమైన మూడో టెస్టులో టీమ్‌ ఇండియా తడబడుతు ఆడుతోంది. గత రెండు టెస్టుల్లో బ్యాటింగ్‌లో అంచనాలు అందుకోలేకపోయినప్పటికీ, బంతితో రాణించిన భారత్‌, ఇప్పుడు మూడో మ్యాచ్​ బౌలింగ్‌లోనూ పట్టు విడిచింది. ఒక్క బుమ్రా (5/72)నే మంచి ప్రదర్శన చేస్తున్నాడు. ఈ క్రమంలోనే బుమ్రా మూడో రోజు ఆటలో ఓ రికార్డును అందుకున్నాడు.

కపిల్ దేవ్ తర్వాత బుమ్రా - ఆస్ట్రేలియా అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన భారత ప్లేయర్ల జాబితాలో చేరాడు. రెండో స్థానాన్ని సంపాదించుకున్నాడు. అగ్రస్థానంలో మాజీ దిగ్గజ క్రికెటర్ కపిల్ 51 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా, బుమ్రా 50 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు. అనిల్ కుంబ్లే (49), ఆర్ అశ్విన్ (40), బిషాన్ సింగ్ బేడీ (35) వికెట్లను తీసి మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు.

మూడో రోజు ఆటలో మిచెల్ స్టార్క్​ను ఔట్​ చేసి ఈ 50 వికెట్ల ఘనతను అందుకున్నాడు బుమ్రా. ఈ పేసు గుర్రానికి ఈ మార్క్​ను టచ్ చేయడానికి 42.82 స్ట్రైక్ రేట్​తో 19 ఇన్నింగ్స్ పట్టింది. కపిల్ దేవ్ 24.58 యావరేజ్, 61.50 స్ట్రైక్ రేట్​తో 51 వికెట్లు తీశారు.

అగ్రస్థానంలో బుమ్రా - సౌతాఫ్రికా, ఇంగ్లాండ్​, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో టెస్టుల్లో అత్యధిక సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేసిన భారత బౌలర్ల జాబితాలో బుమ్రా అగ్రస్థానానికి చేరాడు. ఇప్పటివరకు బుమ్రా 8 సార్లు సేనా గడ్డపై 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. ఈ లిస్ట్​లో బుమ్రా తర్వాత కపిల్ దేవ్ (7 సార్లు) ఉన్నారు.

టెస్టు చరిత్రలో 5 వికెట్లు ప్రదర్శన చేసిన బౌలర్లలో బుమ్రా రెండో స్థానంలో నిలిచాడు. కపిల్‌దేవ్ 23 సార్లు ఈ ఘనత సాధించగా, బుమ్రా ఇప్పటివరకు 12 సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేశాడు.

కాగా, ఈ మ్యాచ్​లో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 445 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌ నైట్ 405/7 స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్‌ మరో 40 పరుగులు జోడించింది. అలెక్స్‌ కేరీ (70) దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా 6, సిరాజ్‌ 2, నితీశ్‌ రెడ్డి, ఆకాశ్ దీప్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

గబ్బా టెస్టు : బుమ్రా పాంచ్ పటాకా- అయినా రెండో రోజు ఆసీస్​దే!

మిస్​ టు మిసెస్​ - స్పెషల్ ఈవెంట్​లో రింగ్స్ మార్చుకున్న పీవీ సింధు జంట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.