ETV Bharat / sports

ఆసీస్​పై 'అఫ్గాన్​' సంచలన విజయం- ఈసారి గురి తప్పలేదు! - T20 World Cup 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 23, 2024, 9:30 AM IST

Updated : Jun 23, 2024, 10:37 AM IST

Aus vs Afg T20 World Cup: 2024 టీ20 వరల్డ్​కప్​ అఫ్గానిస్థాన్ సంచలన విజయం నమోదు చేసింది. సూపర్-8లో ఆసీస్​పై పరుగుల తేడాతో నెగ్గింది. ఈ విజయంతో అఫ్గాన్ సెమీస్ రేస్​లో నిలిచింది.

Aus vs Afg T20 World Cup
Aus vs Afg T20 World Cup (Source: Associated Press)

Aus vs Afg T20 World Cup: 2024 టీ20 వరల్డ్​కప్​ అఫ్గానిస్థాన్ సంచలన విజయం నమోదు చేసింది. సూపర్- 8లో ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్​లో 21 పరుగుల తేడాతో నెగ్గి సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. అఫ్గాన్ నిర్దేశించిన 149 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో 19.2 ఆసీస్ 127 పరుగులకే ఆలౌటైంది. గ్లెన్ మ్యాక్స్​వెల్ (59 పరుగులు) ఒక్కడే రాణించాడు. అఫ్గాన్ బౌలర్లలో గుల్బాదిన్ నబీ 4 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించాడు. నవీన్ ఉల్ హక్ 3, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, అజ్మతుల్లా తలో వికెట్ దక్కించుకున్నారు.

స్వల్ప లక్ష్య ఛేదనలో ఆసీస్ తొలి ఓవర్​లోనే ట్రావిస్ హెడ్ (0) వికెట్ కోల్పోయింది. వన్​డౌన్​లో వచ్చిన కెప్టెన్ మిచెల్ మార్ష్ (12) నవీన్ ఉల్ హక్ బౌలింగ్​లో పెవిలియన్ చేరాడు. ఇక కాసేపటికే మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (3) కూడా స్పల్ప స్కోర్​కే వెనుదిరిగాడు. ఈ సమయంలో గ్లెన్ మ్యాక్స్​వెల్ నిలబడ్డాడు. కానీ, మరో ఎండ్​లో అతడికి సహకారం అందిచే బ్యాటర్ల కరవయ్యారు. మార్కస్ స్టోయినిస్ (11), టిమ్ డేవిడ్ (2) కూడా త్వరగానే ఔటయ్యారు. ఇక 14.4 వద్ద మ్యాక్స్​వెల్ ఔటవడం వల్ల అఫ్గాన్​కు ఆశలు చిగురించాయి. పట్టువదలకుండా బౌలింగ్ చేస్తూ మ్యాథ్యూ వేడ్ (5), కమిన్స్ (3), ఆస్టన్ ఏగర్ (2), ఆజమ్ జంపా (9) వరుసగా పెలివియన్​కు పంపారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 148-6 స్కోర్ చేసింది. ఓపెనర్లు గుర్భాజ్ (60 పరుగులు), ఇబ్రహిమ్ జర్దాన్ (51 పరుగులు) హాఫ్ సెంచరీలతో రాణించారు. వీరిద్దరూ తొలి వికెట్​కు 15.5 ఓవర్లలో 118 పరుగులు జోడించారు. ఈ లెక్కన అఫ్గాన్ స్కోర్ 170 దాటాల్సింది. కానీ, ఆఖర్లో ఆసీస్ బౌలర్లు పుంజుకున్నారు. కమిన్స్ హ్యాట్రిక్​తో అఫ్గాన్​ను దెబ్బకొట్టాడు. దీంతో 148 పరుగులకే పరిమితమైంది.

ఇంకా సెమీస్ రేసులోనే: సూపర్- 8 తొలి మ్యాచ్​లో భారత్​తో ఓడిన అఫ్గాన్ ఈ మ్యాచ్​తో సెమీ ఫైనల్ రేసులో నిలిచింది. రెండు మ్యాచ్​ల్లో 1 ఓటమి, 1 గెలుపుతో అఫ్గాన్ 2 పాయింట్లతో ఉంది. ఇక బంగ్లాదేశ్​తో మ్యాచ్​లో భారీ తేడాతో విజయం సాధించినా, భారత్​పై ఆసీస్​ ఓడినా అఫ్గాన్ సెమీస్​కు దూసుకొస్తుంది. తాజా ఓటమితో ఆసీస్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది.

ఈసారి గురి తప్పలేదు!
కాగా, గతేడాది జరిగిన వన్డే వరల్డ్​కప్​లో లీగ్​ మ్యాచ్​లోనూ ఆసీస్​కు అఫ్గాన్ గట్టిపోటీనిచ్చింది. ఆ మ్యాచ్​లో అఫ్గాన్ దాదాపు గెలుపు అంచులదాకా వెళ్లింది. అయితే ఆల్​రౌండర్ మ్యాక్స్​వెల్ అద్భుత పోరాటంతో ఆ మ్యాచ్​లో ఆసీస్​ను గట్టెక్కించాడు. కానీ, ఈసారి అఫ్గాన్ పట్టువదలకుండా పోరాడింది. బలమైన ఆస్ట్రేలియాకు షాకిచ్చి అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

కమిన్స్​ 'డబుల్ హ్యాట్రిక్'- వరల్డ్​కప్​లో ఫస్ట్ ప్లేయర్​గా

విరాట్ అరుదైన ఘనత- ఒక్క ఇన్నింగ్స్​తో వరల్డ్ రికార్డ్

Last Updated : Jun 23, 2024, 10:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.