India vs Pakistan Hockey: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. శనివారం పాకిస్థాన్‌తో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో టీమ్ఇండియాదే పైచేయి అయ్యింది. దాయాది జట్టు పాకిస్థాన్‌పై భారత్ 2 - 1తేడాతో విజయం సాధించింది. పెనాల్టీ కార్నర్స్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ 2 గోల్స్ (13వ నిమిషం, 19వ నిమిషం) చేసి జట్ట విజయంలో కీలక పాత్ర పోషించాడు. పాకిస్థాన్ పోరాడినప్పటికీ ఓటమి తప్పలేదు. పాకిస్థాన్ తరఫున అహ్మద్ నదీమ్ ఒక్కడే 1 గోల్ (8న నిమిషం) సాధించాడు. కాగా, ఈ టోర్నీలో భారత్‌కు ఇది వరుసగా 5వ విజయం.
తొలి గోల్ వాళ్లదే
ఈ మ్యాచ్‌ను ఇరుజట్లు దూకుడుగా ప్రారంభించాయి. స్టార్ ప్లేయర్ అహ్మద్ నదీమ్ 8వ నిమిషంలో గోల్ చేసి పాక్‌ను ముందుంచాడు. దీంతో టీమ్ఇండియా ఫ్యాన్స్‌లో కాస్త ఆందోళన మొదలైంది. కానీ అంతలోనే కెప్టెన్ హర్మన్‌ప్రీత్ పెనాల్టీ కార్నర్లో తొలి గోల్ సాధించి ఫస్ట్ హాఫ్‌లో స్కోర్ సమం చేశాడు. సెకండ్ హాఫ్‌లో మరో గోల్ చేసి జట్టును లీడ్‌లోకి తీసుకెళ్లాడు.
17వ విజయం
అయితే హాకీలో పాకిస్థాన్‌పై భారత్ విజయ పరంపర కొనసాగుతోంది. పాక్‌పై టీమ్ఇండియాకు ఇది వరుసగా 17వ విజయం. గత 8ఏళ్లుగా దాయాది దేశంపై ఏ టోర్నీయైనా భారత్‌దే పైచేయిగా నిలుస్తోంది. 2016 తర్వాత ఆ జట్టు భారత్‌పై ఒక్కసారి కూడా నెగ్గలేదు.
పాకిస్థాన్ ఫైట్‌తో టోర్నీలో భారత్ లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో టీమ్ఇండియా ఓటమి లేకుండా దూసుకెళ్తోంది. తొలి మ్యాచ్‌లో చైనా (3-0), రెండో మ్యాచ్‌లో జపాన్ (5- 1), మూడో మ్యాచ్‌లో మలేసియ (1- 8), నాలుగో మ్యాచ్‌లో కొరియా (1-3)పై వరుస విజయాలు నమోదు చేసింది. ఇక టోర్నీలో మొత్తం ఆరు జట్లలో టాప్-4లో ఉన్న టీమ్స్ సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఈ క్రమంలో భారత్ ఇప్పటికే సెమీస్‌కు అర్హత సాధించింది. టోర్నీలో సెప్టెంబర్ 16న సెమీస్, సెప్టెంబర్ 17న ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
What a game! 🇮🇳💥 India vs Pakistan lived up to the hype with non-stop action and intense rivalry! Which moment was your favorite? Comment down below and let’s relive the action together!#IndVsPak #MenInBlue #PrideOfIndia #GameOn #IndiaKaGame #HockeyIndia #ACT24
— Hockey India (@TheHockeyIndia) September 14, 2024
.
.
.… pic.twitter.com/MuKefEDdDl
తిరుగులేని భారత్- నాలుగో విజయంతో సెమీస్‌కు - Asian Championship 2024
ఛాంపియన్స్ ట్రోఫీ: భారత్ రెండో విజయం- 5-1తో జపాన్ చిత్తు - Asian Champions Trophy