ETV Bharat / sports

అశ్విన్ 100వ టెస్టు: స్పెషల్ క్యాప్ అందించిన ద్రవిడ్- ఫ్యామిలీతో స్టేడియానికి స్టార్ స్పిన్నర్

Ashwin 100th Test: టీమ్ఇండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 100వ టెస్టు సందర్భంగా అతడికి రాహుల్ ద్రవిడ్ స్పెషల్ క్యాప్ అందించారు.

Ashwin 100th test
Ashwin 100th test
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 7, 2024, 10:40 AM IST

Updated : Mar 7, 2024, 12:07 PM IST

Ashwin 100th Test: టీమ్ఇండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన 100వ టెస్టు మ్యాచ్ సందర్భంగా హెచ్​కోచ్​ రాహుల్ ద్రవిడ్ చేతులమీదుగా స్పెషల్ క్యాప్ అందుకున్నాడు. టాస్​కు ముందు నిర్వహించిన ఈ కార్యక్రమానికి టీమ్ఇండియా ప్లేయర్లు అశ్విన్​కు గ్రాండ్ వెల్​కమ్ చెప్పారు. గ్రౌండ్​లో ఇరువైపులా నిలబడి అతడికి చప్పట్లతో స్వాగతం పలికారు.

అనంతరం టీమ్​మేట్స్​, తన సతీమణి ప్రీతీ నారాయణ్​ పిల్లల సమక్షంలో అశ్విన్ క్యాప్ అందుకున్నాడు. దీంతో, అశ్విన్ భారత్​ తరఫున 100 టెస్టులు ఆడిన 14వ ప్లేయర్​గా నిలిచాడు. ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్ అశ్విన్​ను ప్రశంసించాడు.'భారత క్రికెట్​కు అశ్విన్ ఓ స్ట్రాంగ్ ప్లేయర్. 100వ టెస్టు ఆడటం అతడికి, తన ఫ్యామిలీకే కాదు దేశానికీ గర్వకారణం' అని రోహిత్ అన్నాడు.

ఇప్పటివరకు 100 టెస్టు మ్యాచ్​లు ఆడిన అశ్విన్ 507 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 35 ఐదు వికెట్ల ప్రదర్శన, 8సార్లు 10 వికెట్ల ప్రదర్శన చేశాడు. అటు బ్యాటింగ్​లోనూ జట్టుకు అవసరమైనప్పుడు అనేక సార్లు కీలకమైన ఇన్నింగ్స్​ ఆడాడు. ఇప్పటిదాకా 3309 పరుగులు చేశాడు. అందులో 5 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ఇక ఇదే మ్యాచ్​లో ఇంగ్లాండ్ ప్లేయర్ జాని బెయిర్​ స్టో కూడా 100వ మ్యాచ్ ఆడుతున్నాడు. బెయిస్టో ఫ్యామిలీ కూడా ధర్మశాల టెస్టుకు హాజరయ్యారు. దీనిపై క్రికెట్ గాడ్ సచిన్ తెందూల్కర్ ట్వీట్ చేశారు.'ధర్మశాలలో ఇది చరిత్రాత్మక రోజు. అశ్విన్, బెయిర్ స్టో 100వ టెస్టు మ్యాచ్​ ఆడుతున్నారు. ఇద్దరికీ ఆల్ ది బెస్ట్' అని రాశారు. ఈ మ్యాచ్​లో టీమ్ఇండియా యంగ్ ప్లేయర్ దేవదత్ పడిక్కల్ టెస్టు అరంగేట్రం చేశాడు. దీంతో భారత్​కు టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించిన 314వ ప్లేయర్​గా నిలిచాడు. ఇక టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్​ స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

భారత్ తుది జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్​మన్ గిల్, దేవదత్ పడిక్కల్, రవీంద్ర జడేజా, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

ఇంగ్లండ్ తుది జట్టు: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్

ఒకేసారి నలుగురు స్టార్ ప్లేయర్స్​ సెంచరీ టెస్ట్​ - క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి!

100వ టెస్ట్ : అతడు ఉంటే కెప్టెన్‌కు భరోసా - ప్రత్యర్థులకు హెచ్చరిక!

Last Updated : Mar 7, 2024, 12:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.