Angela Carini Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో తాజాగా జరిగిన ఓ ఘటనపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళల బాక్సింగ్ 66 కేజీల ప్రిక్వార్టర్స్ ఈవెంట్లో ఇటలీకి చెందిన ఏంజెలా కెరాని, అల్జీరియాకు చెందిన ఇమానె ఖెలిఫ్ బరిలోకి దిగారు. అయితే ఈ మ్యాచ్‌లో ఖెలిఫ్‌కు ఇదే తొలి బౌట్. కేవలం 46 సెకన్లలోనే ఆమె తన బౌట్‌ను ముగించింది. అలా అని ఓడిపోయిన ఏంజెలా నాకౌట్ కాలేదు. తనంతట తానుగా బౌట్ నుంచి తప్పుకుంది.
Today, Angela Carini had her Olympics dreams shattered by Imane Khelif, a male boxer.
— Hazel Appleyard (@HazelAppleyard_) August 1, 2024
It is suspected that he BROKE HER NOSE.
Don’t let this pass quietly. MEN SHOULD NOT BE ALLOWED TO BEAT WOMEN FOR SPORT.
SAVE WOMEN’S SPORTS. pic.twitter.com/i5GMdgWrwb
ఖెలిఫ్ పంచ్ పవర్‌కు భయపడి ఏంజెలా బౌట్ నుంచి నిష్క్రమించింది. ఆమె రెండు సార్లు ఏంజెలా తల భాగంపై అటాక్ చేయగా, అప్పుడు ఆమె హెడ్ సేఫ్టీ తొలిగిపోయింది. అంతే కాకుండా ముక్కులో తీవ్ర నొప్పి రావడంతోనే బౌట్ నుంచి వైదొలిగినట్లు ఏంజెలా పేర్కొంది.
"ఖెలిఫ్ పంచ్ ఒకటి నా ముఖంపై బలంగా తాకింది. రక్తం కూడా వచ్చింది. నా కెరీర్‌లో ఇంతటి బలమైన పంచ్‌లు ఎదుర్కొలేదు. ముక్కు చాలా నొప్పిగా ఉంది. ఓ పరిణతి చెందిన బాక్సర్‌గా బౌట్‌ను ఆపేద్దామని అనుకున్నా. ఎవరు ఏమిటి అని చెప్పేందుకు నేనిక్కడికి అస్సలు రాలేదు. నేను మా నాన్న కోసం ఈ గేమ్‌లో ఎలాగైనా గెలవాలనుకున్నాను. కానీ అది జరగలేదు" అంటూ ఏంజెలా కన్నీరు మున్నీరైంది.
Try not to cry… Angela Carini talks about competing in the Olympics for her late father.
— Libs of TikTok (@libsoftiktok) August 1, 2024
She just quit her boxing match after being forced to compete against a man.
Allowing men in women’s competitions is evil. Democrats support it.pic.twitter.com/djpbkNhq63
ఇదిలా ఉండగా, ఖెలిఫ్‌లో పురుష లక్షణాలు అధికంగా ఉన్నాయన్న కారణం చేత ఏంజెలా పోటీ నుంచి వైదొలిగిందనే చర్చలు కూడా ఊపందుకున్నాయి. గతేడాది దిల్లీలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో ఫైనల్‌కు ముందు ఖెలిఫ్‌పై అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య నుంచి వేటు పడింది. ఆమెలో XY క్రొమోజోమ్స్, టెస్టోస్టిరాన్‌లు పురుషుల స్థాయిలో ఉన్నాయంటూ DNA పరీక్షల్లో తేలడమే దీనికి కారణం.
అయితే భిన్న నిబంధనలు కలిగిన ఐఓసీ మాత్రం ఖెలిఫ్‌కు ఈసారి ఒలింపిక్స్‌లో పోటీపడే అవకాశాన్ని కల్పించింది.అయితే ఈ చర్యపై ఇప్పుడు సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. "అమ్మాయిల బాక్సింగ్‌లో పురుషులను ఎలా ఆడనిస్తారు"అంటూ పలువురు దిగ్గజాలు ప్రశ్నిస్తున్నారు.
Absolutely https://t.co/twccUEOW9e
— Elon Musk (@elonmusk) August 1, 2024
పతకాల వేటలో బాక్సింగ్ స్టార్స్ - ఆ ఆరుగురిపై భారత్ ఫోకస్! - Paris Olympics 2024
క్వార్టర్ ఫైనల్‌కు లక్ష్యసేన్ - సాత్విక్, చిరాగ్ జోడీ, నిఖత్‌కు షాక్! - PARIS OLYMPICS 2024