ETV Bharat / sports

కోహ్లీని కలిసిన రాధిక శరత్​ కుమార్​ - ఎందుకంటే? - Radikaa Sarathkumar Kohli - RADIKAA SARATHKUMAR KOHLI

Kohli Radikaa Sarathkumar : లండన్‌ నుంచి విరాట్‌ కోహ్లీ స్వదేశానికి తిరిగొచ్చాడు. ఈ క్రమంలోనే సీనియర్ నటి రాధిక శరత్‌ కుమార్‌ విరాట్ కోహ్లీ కలుసుకున్నారు. ఎందుకంటే?

source Getty Images and ETV Bharat
Kohli Radikaa Sarathkumar (source Getty Images and ETV Bharat)
author img

By ETV Bharat Sports Team

Published : Sep 13, 2024, 6:33 PM IST

Kohli Radikaa Sarathkumar : టీమ్‌ ఇండియా స్టార్‌ క్రికెటర్‌ కోహ్లిని తమిళ నటి రాధికా శరత్‌కుమార్ కలిశారు. ఈ సందర్భంగా ఆమె విరాట్‌తో తీసుకొన్న సెల్ఫీని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకొన్నారు. కోహ్లీకి క్రికెట్‌పై ఉన్న డెడికేషన్‌ను ఆమె ప్రశంసించారు. సెప్టెంబర్ 12న గురువారం లండన్ నుంచి చెన్నైకు వస్తున్న విమానంలో వీరిద్దరు కలుసుకొన్నారు.

మూడేళ్ల తర్వాత కోహ్లీ తొలిసారి చెన్నైలో టెస్టు మ్యాచ్ ఆడనున్నాడు. చెన్నైలో భారత క్రికెట్ జట్టుతో చేరేందుకు లండన్‌ నుంచి విరాట్​ తిరిగొచ్చాడు. అదే ఫ్లైట్‌లో వస్తున్న రాధిక కోహ్లీని కలిశారు. దీనికి సంబంధించిన ఫొటోను షేర్​ చేసి క్యాప్షన్‌లో, 'విరాట్ కోహ్లీ మిలియన్ల మంది హృదయాలను గెలుచుకున్న వ్యక్తి, ఆటపై తనకుంటే కమిట్‌మెంట్‌తో మనల్ని గర్వపడేలా చేస్తాడు. అతనితో కలిసి ప్రయాణించడం చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు." అని పేర్కొన్నారు.

కాగా, రాధిక తెలుగు, తమిళ సినిమాల్లో పాపులర్‌ హీరోయిన్‌ అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె తమిళ సీరియళ్లు, తెలుగు, తమిళ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆమె హిమ్మత్‌వాలా, లాల్ బాద్‌షా, నసీబ్ అప్నా అప్నా, మేరా పతి సిర్ఫ్ మేరా హై వంటి హిందీ సినిమాల్లో కూడా నటించారు.

మళ్లీ బరిలో దిగుతున్న విరాట్‌ - శ్రీలంకతో ఇటీవల వన్డే సిరీస్‌ పూర్తయిన తర్వాత, చాలా రోజులకు విరాట్‌ టీమ్‌ ఇండియాతో కలిశాడు. శ్రీలంకలో భారత్‌ వన్డే సిరీస్‌ కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో కోహ్లీ మూడు ఇన్నింగ్స్‌లలో 58 పరుగులు చేశాడు. నెలన్నర విరామం తర్వాత బంగ్లాదేశ్‌తో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం విరాట్ కోహ్లీ ప్రస్తుతం సిద్ధమవుతున్నాడు.

ఆరు నెలల తర్వాత - కోహ్లీ ఆరు నెలల తర్వాత టెస్ట్‌ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. విరాట్ తన రెగ్యులర్‌ నంబర్‌ 4 పొజిషన్‌లో ఆడే అవకాశం ఉంది. ఓపెనర్లుగా రోహిత్‌ శర్మ, యశస్వి జైస్వాల్ రావచ్చు. ఫస్ట్‌ డౌన్‌లో శుభ్‌మన్‌ గిల్‌కు అవకాశం ఉంటుంది. సెప్టెంబరు 19న గురువారం చెన్నైలోని M.A.చిదంబరం స్టేడియంలో బంగ్లాదేశ్‌తో భారత్ తొలి టెస్ట్‌ ఆడుతుంది. రెండో టెస్టు సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్‌లో జరగనుంది.

OTTలోకి వచ్చేసిన కీర్తి సురేశ్​ 'రఘుతాత' - సినిమా ఎలా ఉందంటే? - Raghu Thatha OTT Movie Review

పంత్ టు కరుణ్ నాయర్- యాక్సిడెంట్​ తర్వాత రీ ఎంట్రీలో అదరగొట్టిన క్రికెటర్లు! - Cricketers Re Entry After Accident

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.