Amit Mishra IPL 2024 : ప్రస్తుత ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ ఊహించని మలుపులతో ఉత్కంఠగా సాగుతోంది. టీమ్‌లు 250కి పైగా స్కోర్ చేసినా, 150 సమీపంలోనే ఆగిపోయినా మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతూ క్రికెట్ అభిమానులకు బోలెడు ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్నాయి.
అంతే కాదు ప్రీ, పోస్ట్ మ్యాచ్ చాట్‌లలో రోహిత్ శర్మ లాంటి ప్లేయర్‌ల స్పెషల్ చాట్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఏప్రిల్ 30న లఖ్‌నవూ, ముంబయి మ్యాచ్ అనంతరం అమిత్ మిశ్రా, రోహిత్ మధ్య కన్వర్జేషన్ వైరల్‌గా మారింది.
మంగళవారం వాంఖడేలో జరిగిన కీలక మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ చేతిలో ముంబయి ఇండియన్స్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. బర్త్‌డే బాయ్ రోహిత్ శర్మ 5 బంతుల్లో 4 పరుగులు చేసి అవుట్ అవ్వడంతో ముంబయి ఫ్యాన్స్ నిరాశలో కనిపించారు. అయితే పోస్ట్ మ్యాచ్ చాట్‌లో లఖ్‌నవూ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రాతో రోహిత్ మాట్లాడిన వీడియోని తాజాగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఆ వీడియోలో రోహిత్ శర్మ, అమిత్ మిశ్రాతో తన విలక్షణమైన ముంబయి యాసలో మాట్లాడుతూ కనిపించాడు. గ్రౌండ్‌లో భారత మాజీ స్పిన్నర్ మురళీ కార్తీక్, అమిత్ మిశ్ర, రోహిత్ శర్మ మధ్య మిశ్రా వయసు గురించి కన్వర్జేషన్ జరుగుతోంది.
'ఏంటి 40 ఏనా? మేరే సే తీన్ సాల్ బడే హో ఆప్ (నువ్వు నాకంటే మూడేళ్లు మాత్రమే పెద్దవాడివా),' అని రోహిత్ మిశ్రాతో అంటాడు. దీనికి సమాధానంగా అమిత్ మిశ్రా, 'నాకు 41 ఏళ్లే' అని చెబుతాడు. దీనికి రోహిత్ శర్మ నవ్వుతూ, 'మేము మా న్యాపీస్‌లో ఉన్నప్పుడు మీర అరంగేట్రం చేశారు? నేను ఏ వయసులో ఉన్నప్పుడు అరంగేట్రం చేశారు? 20 ఏళ్లు ఉన్నప్పుడా?' అని మిశ్రాని రోహిత్ ప్రశ్నించాడు. దీనికి మిశ్రా స్పందిస్తూ,'అతి నా తప్పా. నీకు 20, 21 ఉన్నప్పుడు అరంగేట్రం చేశాను.' అని చెప్పాడు. ఈ ఫన్నీ కన్వర్జేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
-
That ”Arre yaar” felt personal 😂 pic.twitter.com/oZ9nsYZao7
— Lucknow Super Giants (@LucknowIPL) May 1, 2024
ఇంతకీ మిశ్రా ఎప్పుడు అరంగేట్రం చేశాడంటే?
రోహిత్ అంతర్జాతీయ అరంగేట్రం చేయడానికి నాలుగు సంవత్సరాల ముందు 2003లో మిశ్రా భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. 2000లో డొమెస్టిక్ క్రికెట్‌లో హర్యానా లెగ్ స్పిన్నర్‌గా అడుగుపెట్టాడు.
ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో మిశ్రా ఐదో స్థానంలో ఉన్నాడు. 162 మ్యాచ్‌లలో 174 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2023లో లఖ్‌నవూ తరఫున ఏడు వికెట్లు పడగొట్టి, ఇంపాక్ట్ ప్లేయర్‌గా ప్రభావం చూపాడు. ఈ సీజన్‌లో రాజస్థాన్‌పై ఒక వికెట్‌ను తీశాడు.
మంగళవారం ముంబయి ఓటమితో పాయింట్స్ టేబుల్‌లో తొమ్మిదో స్థానంలో ఉంది. 10 మ్యాచ్‌లలో కేవలం 3 గెలిచింది. 10 మ్యాచ్‌లలో 6 విజయాలు అందుకుంది.
'8 ఏళ్ల వయసు నుంచే నా ఇన్స్పిరేషన్ - ఆయన్ను ఎప్పుడూ ఫాలో అవుతుంటాను' - Rohit Sharma Inspiration
'అదంతా ఫేక్- నేను అలా అనలేదు'- రోహిత్‌పై వ్యాఖ్యలపై ప్రీతీ క్లారిటీ - IPL 2024