ETV Bharat / sports

'హార్దిక్​కు కూడా ఎమోషన్స్ ఉంటాయి'- కృనాల్ ఇన్​స్టా పోస్ట్ వైరల్ - Hardik Pandya World Cup 2024

Krunal Pandya Emotional Post: టీమ్ఇండియా ఆల్​రౌండర్ కృనాల్ పాండ్య తన సోదరుడి పట్ల భావోద్వేగానికి గురయ్యాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు.

Krunal Pandya Emotional
Krunal Pandya Emotional (Source: Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 6, 2024, 7:53 AM IST

Updated : Jul 6, 2024, 8:36 AM IST

Krunal Pandya Emotional Post: టీమ్ఇండియా స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య టీ20 వరల్డ్​కప్​ విజయంలో కీలక పాత్ర పోషించడం పట్ల అతడి సోదరుడు కృనాల్ పాండ్య ఎమోషనలయ్యాడు. 2024 ఐపీఎల్ సందర్భంగా హార్దిక్​పై ఎదురైన వ్యతిరేకత పట్ల అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. హార్దిక్ కూడా మనిషే అని అతడికి కూడా ఎమోషన్స్ ఉంటాయని అందరూ మర్చిపోయారని కృనాల్ అన్నాడు.

'నేను, హార్దిక్‌ 10ఏళ్లుగా ప్రొఫెషనల్‌ క్రికెట్‌ ఆడుతున్నాం. గత కొన్ని రోజుల్లో జరిగింది చూస్తే మా కలలు నెరవేరినట్లయింది. నా సోదరుడు సాధించిందిన దాన్ని చూసి నేను చాలా ఎమోషనల్ అయ్యాను. గత 6 నెలలు అతడికి చాలా కష్టంగా గడిచాయి. జనాలు అతడిని ఎగతాళి చేయడంమే కాకుండా తిట్టారు కూడా. అతడు కూడా అందరిలాగే భావోద్వేగాలు కలిగిన మనిషే అనే విషయాన్ని అందరు మరిచిపోయారు. హార్దిక్ ఎప్పుడూ జాతీయ జట్టుకే ప్రాధాన్యం ఇస్తాడు. బరోడా నుంచి వచ్చిన ప్లేయర్​కు టీమ్ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించడం కంటే పెద్ద విషయం మరొకటి లేదు. ఇప్పుడు సాధించిన దానికి హార్దిక్‌ పూర్తిగా అర్హుడు' అని వరల్డ్​కప్ ఫైనల్​ మ్యాచ్ చూస్తూ కంటతడిపెట్టుకున్న వీడియో ఒకటి షేర్ చేశాడు.

ఇక వరల్డ్​కప్ విన్నింగ్ ప్లేయర్​ హార్దిక్​కు ఇంటివద్ద ఘన స్వాగతం లభించింది. కుటుంబ సభ్యులు అతడికి గ్రాండ్ వెల్​కమ్ చెప్పారు. చాలా రోజులుగా దూరంగా ఉన్న కుమారుడు అగస్త్యను ప్రేమతో దగ్గరకు తీసుకొని మురిసిపోయాడు. తాను సాధించిన ఛాంపినన్ మెడల్ కుమారుడి మెడలో వేశాడు. కొడుకుతో సరదాగా గడిపిన మధుర క్షణాలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 'నా ప్రపంచం నువ్వే, నీ కోసం ఏదైనా చేస్తా' అని క్యాప్షన్ రాసుకొచ్చాడు.

ఇషాన్​ హగ్: కాగా, యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య ఇంటికెళ్లి అతడికి సర్​ప్రైజ్ ఇచ్చాడు. సోఫాలో కూర్చున్న హార్దిక్​ను హగ్ చేసుకొని శుభాకాంక్షలు తెలిపాడు. ఈ వీడియోను ఇషాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

'ఐయామ్‌ సారీ' - హార్దిక్‌కు క్షమాపణలు చెబుతున్న ముంబయి ఫ్యాన్స్​ - Mumbai Fans Sorry To Hardik

హార్దిక్​తో విడాకుల రూమర్స్‌ - నటాషా ఆసక్తికరమైన పోస్ట్​

Last Updated : Jul 6, 2024, 8:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.