ETV Bharat / sports

స్టార్ షట్లర్​ పీవీ సింధుకు షాక్ - రెండో రౌండ్​లోనే ఇంటికి - All England Championship PV Sindhu

All England Championship PV Sindhu : ఆల్‌ ఇంగ్లాండ్​ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్ షట్లర్ల పీవీ సింధుకు షాక్ తగిలింది.

స్టార్ షట్లర్​ పీవీ సింధుకు షాక్ - రెండో రౌండ్​లోనే ఇంటికి

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 14, 2024, 4:55 PM IST

Updated : Mar 14, 2024, 9:49 PM IST

All England Championship PV Sindhu : ఆల్‌ ఇంగ్లాండ్​ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్ షట్లర్ల పీవీ సింధుకు గట్టి షాక్ తగిలింది. ఈమె మహిళల సింగిల్స్​ రెండో రౌండ్​లోనే వెనుదిరిగింది. ప్రపంచ 11వ ర్యాంకర్‌గా ఉన్న సింధు ఈ రెండో రౌండ్​లో దక్షిణ కొరియాకు చెందిన వరల్డ్‌ నెంబర్‌ వన్‌ ప్లేయర్‌ అన్‌ సె యంగ్‌ చేతిలో 19-21, 11-21 తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ కేవలం 42 నిమిషాల్లోనే ముగిసింది. కాగా, అన్‌ సె యంగ్‌తో ఇప్పటివరకు సింధు ఆరుసార్లు తలపడగా అన్నిసార్లు ఆమెకు ఓటమే ఎదురైంది. తాజాగా ఏడో సారి కూడా ఓడింది. ఇకపోతే రీసెంట్​గా పారిస్‌ వేదికగా ముగిసిన ఫ్రెంచ్‌ ఓపెన్‌లోనూ క్వార్టర్స్‌లోనే నిష్క్రమించింది సింధు.

ఈ పోరులో సింధును పూర్తిగా డామినేట్ చేసింది అన్ సె యంగ్. తొలి గేమ్​లో సింధు కాస్త పోటీ ఇచ్చినా రెండో గేమ్​లో మాత్రం పూర్తిగా చేతులెత్తేసింది. తొలి గేమ్​లో యంగ్​పై అనుసరించాల్సిన వ్యూహం కోసం మధ్యలో కాసేపు కోర్టు పక్కనే ఉన్న తన మెంటార్, బ్యాడ్మింటన్ లెజెండ్ ప్రకాశ్ పదుకొణెతో సింధు చర్చించింది. అయినా కూడా సింధు మొదటి గేమ్​లో ఓటమిని అందుకుంది. ఫస్ట్ గేమ్​లో డిఫెన్స్​ను సడెన్​గా అటాకింగ్​గా మార్చేసి సింధుపై యంగ్​ పైచేయి సాధించింది. అలా సింధు గేమ్​ను 19-21తో కోల్పోయింది.

రెండో గేమ్​లోనూ యంగ్ ఆధిపత్యం చెలాయించింది. అటాకింగ్, డిఫెన్స్​తో సింధుపై విరుచుకుపడింది. అలా 21-11తో గేమ్ తో పాటు మ్యాచ్ గెలిచి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది యంగ్​. అలా సింధు పరాజయంతో ఆల్ ఇంగ్లాండ్​ ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ కేటగిరీలో భారత్ పోరాటం ముగిసింది. అంతకుముందు తొలి రౌండ్​లోనే ఆకర్షి కశ్యప్ ఓటమి పాలైంది.

Indian Winners Of England Badminton Championship : కాగా, ఇప్పటి వరకూ ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఇద్దరు భారతీయులు మాత్రమే విజయం సాధించారు. 1981లో ప్రకాశ్ పదుకొణె, 2001లో పుల్లెల గోపీచంద్ గెలుపొందారు.

IPL 2024 - టాప్ ప్లేస్​లో కోహ్లీ - మెగా లీగ్​ అత్యధిక శతక వీరులు వీరే!

IPL 2024 - సీఎస్కే టాప్​ - అత్యధికసార్లు ప్లేఆఫ్స్‌ చేరిన జట్లు ఇవే

Last Updated : Mar 14, 2024, 9:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.