Akash Deep On Bumrah : టీమ్ఇండియా యార్కర్ స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రాపై యువ పేసర్ ఆకాశ్ దీప్ ప్రశంసలు కురిపించాడు. బుమ్రా నుంచి తాను చాలా చిట్కాలు నేర్చుకున్నానని వెల్లడించాడు. మ్యాచ్ జరిగేటప్పుడు బుమ్రాతో తరచుగా మాట్లాడుతుంటానని, అలాగే అతడి బౌలింగ్‌ను గమనిస్తుంటానని చెప్పుకొచ్చాడు. అలాగే బౌలింగ్ చేసేటప్పుడు బ్యాటర్ల మైండ్ సైట్ గుర్తించడం ఎలాగో బుమ్రా నుంచి నేర్చుకున్నానని పేర్కొన్నాడు.
'బుమ్రా గాడ్ గిఫ్ట్!'
'బుమ్రా బౌలర్లందరి కంటే భిన్నమైనవాడు. దేవుడు అతడిని భిన్నంగా తీర్చిదిద్దాడు. నేను బౌలింగ్ చేస్తున్నప్పుడు బ్యాటర్ మనస్తత్వాన్ని తెలుసుకోవడం ఎలా అని బుమ్రాను ప్రశ్నించాను. అప్పుడు బుమ్రా తన విలువైన సలహాలు, చిట్కాలు ఇచ్చారు. టీమ్ఇండియాకు బుమ్రా ఒక గిఫ్ట్ బౌలర్. అతడిని అనుసరించడం చాలా కష్టమైన పని' అని ఆకాశ్ దీప్ ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలో తెలిపాడు.
గాయం తర్వాత అదుర్స్
కాగా, వెన్ను గాయం కారణంగా కొన్నాళ్లపాటు క్రికెట్‌కు దూరమైన బుమ్రా 2023 ఆగస్టులో మైదానంలోకి అడుగుపెట్టాడు. 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా తరఫున 20 వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా నిలిచాడు. ఆ తర్వాత 2024 ఫిబ్రవరిలో టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ ర్యాంక్ సాధించాడు.
ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో ఎనిమిది మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును అందుకున్నాడు. అలాగే బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లోనూ బుమ్రా అదరగొడుతున్నాడు. మొదటి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో అరుదైన ఫీట్ అందుకున్నాడు. అన్ని అంతర్జాతీయ ఫార్మాట్లలో 400 వికెట్లు తీసిన ఆరో పేసర్‌గా నిలిచాడు.
ఫర్వాలేదనిపించిన ఆకాశ్
ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమ్ఇండియా యువ పేసర్ ఆర్షదీప్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి రెండు వికెట్లు పడగొట్టి ఫర్వాలేదనిపించాడు. వేసినవి తక్కువ ఓవర్లే అయినా మంచి మార్కులు కొట్టేశాడు.
బుమ్రా @ 400 వికెట్లు - అరుదైన ఫీట్ అందుకున్న స్టార్ బౌలర్ - Ind vs Ban Test Series 2024