ETV Bharat / sports

డివిలియర్స్ యూటర్న్​- విరాట్ విషయంలో అదంతా అబద్ధమేనట! - Virat Anushka Marriage

AB De Villiers Virat Kohli: విరాట్- అనుష్క శర్మ రెండోసారి పేరెంట్స్ కానున్నారని తాను చేసిన వ్యాఖ్యలపై డివిలియర్స్ యూటర్న్ తీసుకున్నాడు.

AB De Villiers Virat Kohli
AB De Villiers Virat Kohli
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 9, 2024, 11:47 AM IST

Updated : Feb 9, 2024, 12:33 PM IST

AB De Villiers Virat Kohli: టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రెండోసారి తండ్రి కాబోతున్నాడంటూ తాను చేసిన వ్యాఖ్యలపై సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ యూటర్న్‌ తీసుకున్నాడు. విరాట్- అనుష్క జంట రెండో బిడ్డను స్వాగతించేందుకు ఎదురు చూస్తున్నారని రీసెంట్​గా తన యూట్యూబ్​ ఛానెల్​లో ఓ సందర్భంలో డివిలియర్స్ చెప్పాడు. అయితే తాజాగా అది అబద్ధం అని డివిలిర్స్ అన్నాడు.

'నేను పెద్ద పొరపాటు చేశాను. తప్పుడు సమాచారాన్ని షేర్ చేశాను. అదంతా అబద్ధం. విరాట్- అనుష్క విషయంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఆట నుంచి విరామం తీసుకోవడానికి కారణమేదైనా, అతడు తొందరగా జట్టులోకి రావాలని కోరుకుంటున్నా' అని డివిలియర్స్ పేర్కొన్నాడు.

డివిలియర్స్ ఏం అన్నాడంటే?
ఇటీవల డివిలియర్స్ ఫ్యాన్స్​తో ఆన్​లైన్​లో చిట్​చాట్ నిర్వహించాడు. ఆ సమయంలో ఓ అభిమాని విరాట్ గురిచి అడగ్గా, 'కోహ్లీతో టచ్​లోనే ఉన్నా. రీసెంట్​గా మాట్లాడాను. అతడు తన కుటుంబంతో టైమ్ సమయం గడుపుతున్నాడు. కోహ్లీ- అనుష్క రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. అందుకే విరాట్ ఫ్యామిలీతో గడుపుతున్నాడు' అని అన్నాడు. దీంతో ఈ విషయం వైరలైంది.

విరాట్​కు ఏమైంది? ఇంగ్లాండ్​తో జరుగుతున్న టెస్టు సిరీస్ నుంచి విరాట్ తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల అతడు ప్రస్తుతం ఆటకు దూరం ఉంటున్నాడు. ఇక దీనిపై పలువురి నుంచి అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. విరాట్ దంపతులు రెండోసారి తల్లిదండ్రు కాబోతున్నారని కొందరు అంటే, అతడి తల్లి అరోగ్యం కారణంగానే సిరీస్​ను నుంచి తప్పుకున్నాడంటూ పలు కథనాలు వచ్చాయి. కానీ, విరాట్ సోదరుడు ఈ వార్తలను కొట్టిపారేశాడు. తమ తల్లి పూర్తి ఆరోగ్యంగానే ఉన్నట్లు చెప్పాడు.

Virat Anushka Marriage: విరాట్- అనుష్క 2017 డిసెంబర్​లో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇటలీలోని టూస్కానీలో 800 ఏళ్ల నాటి వారసత్వ విల్లా వేదికగా అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇక 2021లో ఈ జంట వామికా అనే చిన్నారికి తల్లిదండ్రులయ్యారు.

విరాట్ కటౌట్​కు మొక్కిన క్రికెటర్- పీక్స్​లో కోహ్లీ క్రేజ్

మూడో టెస్ట్​కు కోహ్లీ - రాహుల్ ద్రవిడ్​​ ఇలా అన్నాడేంటి?

Last Updated : Feb 9, 2024, 12:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.