Gautam Gambhir Targets: టీమ్ఇండియా కొత్త కోచ్‌గా ఎంపికైన మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ 2027 వరకు ఆ బాధ్యతల్లో కొనసాగనున్నాడు. ఈ మూడేళ్ల కాలంలో గంభీర్ నేతృత్వంలో టీమ్ఇండియా పలు ద్వైపాక్షిక సిరీస్‌లతోపాటు కీలకమైన ఐసీసీ ఈవెంట్లలో పాల్గొననుంది. ఈ నేపథ్యంలో గంభీర్ పదవీకాలంలో తన ముందు 5 మేజర్ టార్గెట్లు ఉన్నాయి. అవేంటంటే?
మిషన్ 2025: కోచ్‌గా ఎంపికైన గంభీర్‌పై టీమ్ఇండియా ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ బాధ్యతలు తీసుకోనున్న గంభీర్ మరో 10 నెలల్లోపే రెండు ఐసీసీ మేజర్ ఈవెంట్లు ఎదుర్కోనున్నాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీ ఈవెంట్లు ప్రస్తుతం గంభీర్ ముందున్న లక్ష్యాలు. అయితే ప్రస్తుతం పటిష్ఠంగా ఉన్న టీమ్ఇండియాకు ఈరెండిట్లో కోచ్‌గా వ్యవహరించడం గంభీర్‌కు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.
పైగా టీ20 వరల్డ్‌కప్ విజయంతో సీనియర్ జట్టు కూడా మంచి జోష్‌లో ఉంది. ఇదే ఊపులో వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీ టైటిళ్లూ పట్టేయాలని తహతహలాడుతోంది. కాగా, ఈ రెండు టోర్నమెంట్లలో టీమ్ఇండియాకు రోహిత్ శర్మే సారథ్యం వహించనున్నట్లు రీసెంట్గా కన్ఫార్మ్ అయిపోయింది. ఇక రోహిత్- గంభీర్ ఈ మేజర్ ఈవెంట్లపై ఫోకప్ పెట్టాల్సి ఉంది.
కుర్రాళ్లతో 2026 ఛాలెంజింగ్: స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఇప్పటికే పొట్ట ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పేశారు. దీంతో 2026 టీ20 వరల్డ్‌కప్‌లో టీమ్ఇండియా కుర్రాళ్లతోనే నిండి ఉంటుంది. బుమ్రా, హార్దిక్ పాండ్య మినహా జట్టులో పెద్దగా అనుభవం ఉన్న ప్లేయర్లు ఉండరు. దీంతో అంత పెద్ద ఐసీసీ ఈవెంట్లో కుర్రాళ్లతో జట్టును నడిపించడం గంభీర్‌కు ఛాలెంజింగ్ అనే చెప్పవచ్చు. అయితే ఇప్పట్నుంచే యంగ్ ప్లేయర్లను ఒత్తిడి ఎదుర్కొనే విధంగా తయారు చేస్తే మంచి ఫలితం అందుకోవచ్చు.
2027లో ఫేర్‌వెల్!: గంభీర్‌కు కోచ్‌గా 2027 ఆఖరి ఏడాది. ఈ ఏడాదే గంభీర్‌కు అసలైన పరీక్ష ఉండనుంది. వన్డే వరల్డ్‌కప్ 2027లోనే ఉంటుంది. వన్డే ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా సుదీర్ఘ ఎదురుచూపులకు ఈ ఎడిషన్‌లోనైనా తెరపడాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 2011 వరల్డ్‌కప్ నెగ్గడంలో ప్లేయర్‌గా కీలక పాత్ర పోషించిన గంభీర్‌కు, 2027లో కోచ్‌గా టీమ్ఇండియాను విజేతగా నిలిపేందుకు మంచి అవకాశం దక్కింది. మరి ఈ టోర్నీ నాటికి సీనియర్లు రోహిత్, కోహ్లీ ఉంటారా? అనేది సందేహమే!
Many thanks for your extremely kind words and constant support @JayShah bhai. Elated to be a part of this journey! The entire team together will strive for excellence and newer heights. https://t.co/BgAbTwN59u
— Gautam Gambhir (@GautamGambhir) July 9, 2024
టీమ్‌ఇండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ - అఫీషియల్ అనౌన్స్మెంట్ - Teamindia Head Coach Gambhir
ఈడెన్ గార్డెన్స్‌లో ఫేర్‌వెల్ - భారత కోచ్‌గా గంభీర్ ఫిక్స్! - Gautam Gambhir Farewell