Pace Spin Bowling In Same Match: క్రికెట్‌లో బ్యాటింగ్‌తో పోలిస్తే బౌలింగ్ కాస్త కష్టమని చెప్పాలి. సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో బంతి వేయకపోతే బ్యాటర్ బౌండరీలు బాదేస్తాడు. ఇలా సరైన స్పీడ్, లెంగ్త్‌తో బాల్ వేయడం కోసం బౌలర్లు ఏళ్ల కొద్ది సాధన చేస్తారు. అప్పుడే వారు క్రికెట్‌లో కొన్నేళ్లపాటు రాణించగలుగుతారు. స్పిన్నర్లు కూడా అంతే. ఈ క్రమంలో ఒకే మ్యాచ్‌లో స్పీడ్, స్పిన్ బౌలింగ్ వేసిన ఐదుగురు ప్లేయర్ల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మార్నస్ లబుషేన్
పాకిస్థాన్‌తో కొన్నాళ్ల క్రితం కరాచీలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో స్పిన్, మీడియం పేస్ బౌలింగ్ వేశాడు ఆస్ట్రేలియా ప్లేయర్ మార్నస్ లబుషేన్. పార్ట్ టైమ్ లెగ్ స్పిన్నర్ అయిన లబుషేన్, పిచ్ పేస్‌కు అనుకూలించడం వల్ల టెస్టు మ్యాచ్ తొలి ఇన్సింగ్స్‌లో మీడియం పేస్ వేశాడు. అదే మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ పై బాల్ టర్న్ అవ్వడం, స్నిన్నర్లకు అనుకూలించడం వల్ల స్పిన్ కూడా వేశాడు.
కోలిన్ మిల్లర్
ఆస్ట్రేలియాకు చెందిన పేసర్ కోలిన్ మిల్లర్. అతడు తన కెరీర్ చివరి అంకంలో పేసర్ నుంచి ఆఫ్ స్పిన్నర్‌గా మారాడు. అందుకు కారణం చీలమండ గాయమే. ఈ క్రమంలో 2000లో న్యూజిలాండ్‌తో జరిగిన వెల్లింగ్టన్ టెస్టు మ్యాచ్‌లో మిల్లర్ కివీస్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌కు ఆఫ్ స్పిన్ వేశాడు. రైడ్ హ్యాండ్ బ్యాటర్ మాథ్యూ సింక్లెయిర్ కు పేస్ వేశాడు. కాగా, సింక్లెయిర్ను మిల్లరే అవుట్ చేశాడు.
మనోజ్ ప్రభాకర్
టీమ్ఇండియాకు పేసర్ మనోజ్ ప్రభాకర్. అతడు 1996 ప్రపంచకప్‌లో దిల్లీ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో మీడియం పేస్, స్పిన్ రెండింటినీ బౌలింగ్ చేశాడు. కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేయమని కోరడానికి ముందు ప్రభాకర్ తన మొదటి రెండు ఓవర్లలో 33 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత ప్రభాకర్ ఆఫ్ స్పిన్ వేశాడు.
సోహైల్ తన్వీర్
పాకిస్థాన్‌కు మాజీ సీమర్ సొహైల్ తన్వీర్ తన కెరీర్లో కేవలం 2 టెస్టులు మాత్రమే ఆడాడు. 2007లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో తన్వీర్ స్పీడ్‌తో పాటు స్పిన్ బౌలింగ్ చేశాడు. ఈడెన్ గార్డెన్ పేసర్లకు అంతగా అనుకూలించకపోవడం వల్ల తన్వీర్ స్పిన్ వేశాడు.
సచిన్ తెందూల్కర్
క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ టీమ్ఇండియాకు పార్ట్ టైమ్ స్పిన్నర్‌గా ఉండేవాడు. సచిన్‌కు ఆఫ్ స్పిన్, లెగ్ స్పిన్, సీమ్ అప్, మీడియం పేస్ బౌలింగ్ చేయడం వచ్చు. అందుకే కొన్ని మ్యాచుల్లో సచిన్ స్పిన్, మీడియం పేస్ బౌలింగ్ చేశాడు.
విరాట్ UK పౌరసత్వం!- మరి టీమ్ఇండియాకు ఆడగలడా?- రూల్స్ ఎలా ఉన్నాయంటే? - Virat Kohli UK Citizenship
ఇంపాక్ట్ రూల్‌పై BCCI రివ్యూ- ఆ టోర్నీలోపే క్లారిటీ! - BCCI Rules