2024 WPL Eliminator: 2024 డబ్ల్యూపీఎల్‌లో ఎలిమినేటర్ పోరుకు రంగం సిద్ధమైంది. ఫైనల్ మ్యాచ్‌కు అర్హత సాధించేందుకు శుక్రవారం ముంబయి ఇండియన్స్- రాయల్ ఛాలెంజర్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. సీజన్లో నిలకడగా రాణిస్తూ ఇక్కడిదాకా చేరుకున్న ముంబయి మరోసారి ఫైనల్ చేరి రెండో టైటిల్‌ను ముద్దాడాలని ఆశిస్తే, తొలిసారి ఛాంపియన్‌గా నిలవాలని బెంగళూరు తహతహలాడుతోంది.
ముంబయి: కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ముంబయి జట్టు అతిపెద్ద బలం. హర్మన్ బ్యాటింగ్‌తో పాటు, కెప్టెన్‌గానూ జట్టుకు అత్యంత కీలకం. బ్యాటింగ్‌లో నాట్ సీవర్, యస్తికా భాటియా, హేలీ మాథ్యూస్, అమెలియా కేర్ మరోసారి రాణిస్తే ముంబయికి భారీ స్కోర్ ఖాయం. మరోవైపు ఇషాక్, షబ్నిమ్, అమెలియా చెలరేగితే ప్రత్యర్థిని ఓడించడం డిఫెండింగ్ ఛాంపియన్‌కు పెద్ద కష్టమేమీ కాదు.
బెంగళూరు: ఈ సీజన్లో బెంగళూరు ప్రదర్శనను తీసిపారేయలేం. గెలుపు, ఓటములతో పడిలేచి ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఈ పట్టుదలతోనే తొలిసారి టైటిల్ ముద్దాడాలని ఆశిస్తోంది. కెప్టెన్ స్మృతి మంధానా, ఎలిస్ పెర్రీ, సోఫి డివైన్, రిచా ఘోష్‌తో బెంగళూరు కూడా పటిష్ఠంగానే కనిపిస్తోంది. లీగ్ ఆఖరి మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ పెర్రీ ముంబయిని ఘోరంగా దెబ్బతీసింది. ఈ మ్యాచ్‌లోనూ పెర్రీ అలాంటి ప్రదర్శన చేస్తే బెంగళూరుకు తిరుగుండదు.
ఇక ఎలిమినేటర్‌లో ముంబయి నెగ్గితే, మరోసారి దిల్లీ- ముంబయి పోరు చూడవచ్చు. గత సీజన్ ఫైనల్లోనూ ఈ రెండు జట్ల మధ్యే టైటిల్ ఫైట్ జరిగింది. అదే బెంగళూరు విజయం సాధిస్తే, ఈసారి కొత్త ఛాంపియన్‌ను చూడడం ఖాయం. ఓ వైపు ముంబయి డిఫెండింగ్ ఛాంప్ హోదాకు తగ్గట్లు ఆడుతుంటే, మరోవైపు బెంగళూరు కూడా టాప్ క్లాస్ ఆటతో అందర్నీ ఆకట్టుకుంటోంది. చూడాలి మరి శుక్రవారం నాటి మ్యాచ్‌లో నెగ్గి ఫైనల్లో దిల్లీని ఢీకొట్టేదెవరో?
తుది జట్లు అంచనా
ముంబయి: హర్మన్‌ప్రీత్ కౌర్, యాస్తికా భాటియా, హేలీ మాథ్యూస్, అమేలియా కెర్, నాట్ సీవర్, సైకా ఇషాక్, షబ్నిమ్ ఇస్మాయిల్, అమన్‌దీప్ కౌర్, పూజా వస్త్రాకర్, ప్రియాంక బాలా, హుమైరా కాజీ.
బెంగళూరు: స్మృతి మంధాన, సోఫీ మోలినెక్స్, ఎల్లీస్ పెర్రీ, సోఫీ డివైన్, రిచా ఘోష్, జార్జియా వేర్‌హామ్, దిశా కసత్, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, శ్రద్ధా పోఖార్కర్, రేణుకా ఠాకూర్ సింగ్.
2024 WPL ప్లే ఆఫ్స్: రెండోసారి ఫైనల్‌కు దిల్లీ- లాస్ట్ బెర్త్ కోసం ముంబయి, ఆర్సీబీ ఫైట్