2024 IPL Inauguration Ceremony: 2024 ఐపీఎల్ మార్చి 22న ప్రారంభం కానుంది. అయితే ప్రతి ఏడాది లాగే ఈ సీజన్‌ను కూడా ఘనంగా ప్రారంభించాలని ఐపీఎల్ బోర్డు భావిస్తోంది. అందుకోసం సీజన్ ప్రారంభం రోజున చెన్నై చిదంబరం స్టేడియంలో గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీ (Opening Ceremony) నిర్వహించనున్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు అంటే మార్చి 22న సాయంత్రం 6.30 గంటలకు ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్లో భారీ లైటింగ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది.
ఈ ఈవెంట్‌కు ప్రముఖ సింగర్, ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్, సింగర్ సోనూ నిగమ్ పాల్గొననున్నారు. ఇక వీరితోపాటు బాలీవుడ్ స్టార్లు అక్షయ్ కుమార్, టైగర్ జాకీఫ్రాఫ్ కూడా ఓపెనింగ్ ఈవెంట్లో పాల్గొని సందడి చేయనున్నారు. ప్రోగ్రామ్‌లో సింగర్ సోనూ నిగమ్ ముందుగా ఆటాపాటలతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఆ తర్వాత సింగర్ రెహమాన్ గ్రూప్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఉండనుంది.
ఇక చివరి 30 నిమిషాల్లో బాలీవుడ్ హీరోలు అక్షయ్- టైగర్ కలిసి సూపర్ హిట్ పాటలకు డాన్స్ చేయనున్నారు. చివర్లో రెహమాన్, సోనూ వీరితో కలిసి స్టేజ్‌పై స్టెప్పులేయనున్నారని తెలుస్తోంది. అసలే హై వోల్టేజ్ (చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) మ్యాచ్. మామూలుగానే సీఎస్కే- ఆర్సీబీ మ్యాచ్‌కు ఫ్యాన్ ఫీవర్ ఎక్కువ. అందులో సోనూ నిగమ్, రెహమాన్, అక్షయ్ కుమార్, టైగర్ పెర్ఫార్మెన్స్ అంటే సీజన్‌కు ఈవెంట్‌కు ప్రత్యేకం కానున్నట్లే. దీంతో మ్యాచ్ చూసేందుకు గ్రౌండ్‌కు వెళ్లే ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ పక్కా! అని చెప్పవచ్చు.
ఈవెంట్ గురించి మరిన్ని వివరాలు
- తేది: 2024 మార్చి 22
- సమయం: సాయంత్రం 6.30 గంటలకు
- వేదిక: ఎం ఏ చిదంబరం స్టేడియం
- లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ? జియో సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్లో లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు.
- బ్రాడ్‌కాస్టింగ్ లైవ్: స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ టెలివిజన్ ఛానెల్
ఈవెంట్ అనంతరం చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌తో 17వ సీజన్ ప్రారంభం కానుంది. అయితే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ బోర్డు తొలుత 21 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మాత్రమే విడుదల చేసింది. రెండో విడత షెడ్యూల్ త్వరలోనే రిలీజ్ కానుంది.