ETV Bharat / sports

ధోనీ వల్లే ఆ మ్యాచులో దారుణంగా​ ఓడిపోయాం! : గంగూలీ - DHONI GANGULY

Teamindia VS Newzealand Semifinal : గతంలో ఓ మ్యాచ్​లో ధోనీ ఆడిన బ్యాటింగ్​ను గంగూలీ తీవ్రంగా విమర్శించాడు! పూర్తి వివరాలు స్టోరీలో.

source Getty Images
dhoni ganguly (source Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 15, 2024, 7:38 PM IST

Teamindia VS Newzealand Semifinal : భారత క్రికెట్‌లోని మోస్ట్​ హార్ట్ ​బ్రేకింగ్​ మూమెంట్స్​లో 2019 వన్డే వరల్డ్​ కప్ సెమీఫైనల్ ఓటమి కూడా ఒకటి. టోర్నీ మొత్తం ఆద్యంతం మంచి ప్రదర్శనతో సెమీస్​కు వెళ్లి న్యూజిలాండ్‌ చేతిలో 18 పరుగుల తేడాతో ఓడింది.

వర్షం కారణంగా రెండు రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్​కు దిగిన న్యూజిలాండ్​ నిర్ణీత 50 ఓవర్లలో 239/8 స్కోర్ చేసింది(2029 ODI World Cup). అనంతరం లక్ష్య చేధనలో టీమ్​ఇండియా మ్యాట్ హెన్రీ ధాటికి 24 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోకి వెళ్లింది.

ఈ క్రమంలోనే రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. దీంతో భారత్ 92 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో రవీంద్ర జడేజా, ధోనీ క్రీజులోకి దిగారు. జడేజా అసాధారణ బ్యాటింగ్‌తో రెచ్చిపోయి టీమ్​ఇండియా శిబిరంలో ఆశలు రేకెత్తించాడు. మరోవైపు ధోనీ స్లోగా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలోనే విజయానికి 18 బంతుల్లో 35 పరుగులు అవసరమయ్యాయి. అయితే ఓవైపు చేయాల్సిన రన్ రేట్ పెరిగిపోతున్నా ధోనీ మాత్రం సింగిల్స్‌కే పరిమితమయ్యాడు. దీంతో జడేజాపై ఒత్తిడి తీవ్రంగా పెరిగిపోయింది. సరిగ్గా అదే సమయంలో ఊపులో ఉన్న జడ్డూను న్యూజిలాండ్ 47వ ఓవర్​లో దెబ్బకొట్టింది. గేమ్​ను పూర్తిగా కంట్రోల్​లోకి తీసుకుపోయింది.

Dhoni Ganguly : దీంతో ధోనీ వ్యూహం అర్థం కాక అందరూ షాక్ అయిపోయారు.​ చివరికి మహీ కూడా రనౌట్​ అయిపోయాడు. దీంతో భారత జట్టు 221 పరుగులకే కుప్పకూలిపోయింది. ఫలితంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే ఆ మ్యాచ్‌కు అప్పుడు కామెంటేటర్‌గా వ్యవహరించిన గంగూలీ ధోనీ వ్యూహాన్ని తప్పుబట్టాడు. అసలు నాకు మాటలు రావట్లేదు అంటూ వ్యాఖ్యానించాడు. మహీ జిడ్డు బ్యాటింగ్ వల్ల ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఓటమిని అందుకుందని చెప్పకనే చెప్పాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్​ మరోసారి క్రికెట్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

వార్నర్​కు షాకిచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా! - ఏం జరిగిందంటే? - Warner Champions Trophy 2025

టీమ్​ఇండియాను మా దగ్గరికి పంపకపోతే బీసీసీఐ అలా చేయాలి : పీసీబీ డిమాండ్​! - Champions Trophy 2025

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.