ETV Bharat / spiritual

దీపావళి ఒక్కరోజు కాదు ఐదు రోజుల పండగని మీకు తెలుసా? - ఆ విశేషాలు మీకోసం!

-దేశవ్యాప్తంగా మొదలైన దీపావళి సందడి -దీపావళి ఏ రోజు జరుపుకోవాలి?

Why Diwali Celebrated Five Days in India
Why Diwali Celebrated Five Days in India (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Why Diwali Celebrated Five Days in India : దీపావళి.. అమావాస్య చీకట్లను పారదోలి తమ జీవితంలో వెలుగులు నింపే సంతోషాల సంబరం. చిన్నాపెద్దా తేడా లేకుండా ఇంటిల్లిపాదీ ఎంతో ఆనందంగా ఈ పండగ చేసుకుంటారు. అయితే దీపావళి అంటే ఒక్కరోజు పండగే అని.. లక్ష్మీ పూజ చేసి టపాసులు కాల్చడంతో పండగ పూర్తయిందని అనుకుంటారు. నిజానికి ఈ దీపాల పండగ ఐదు రోజుల పాటు జరుపుకుంటారని మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

దీపావళి ఐదు రోజుల పండగలో ఒక్కోరోజుకు ఒక్కో విశిష్టత, గుర్తింపు ఉంది. ఈ వేడుకల్లో భాగంగా లక్ష్మీ దేవి, రాముడు, కృష్ణుడు, నాగేంద్రుడుని ఆరాధిస్తారు. ఈ ఐదు రోజుల పండగ ధనత్రయోదశి షాపింగ్​తో మొదలై.. నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, బలి పాడ్యమి, భాయిదూజ్​తో పూర్తవతుంది. మరి ఈ సంవత్సరం అవి ఎప్పుడెప్పుడు జరుపుకోవాలంటే.

ధన త్రయోదశి: హిందూ సంప్రదాయంలో దక్షిణాయనానికి అందులోనూ ఆశ్వయుజ, కార్తీక మాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దక్షిణాయనంలో ఆశ్వయుజ మాసం బహుళ పక్ష త్రయోదశి నుంచి కార్తీకమాసం శుక్ల పక్ష ద్వితీయ వరకు ఈ 5 రోజులూ దీపాల పండగను ప్రత్యేకంగా జరుపుకొంటారు. ఇందులో తొలి రోజు ధన త్రయోదశి/ధంతేరాస్​​గా జరుపుకుంటాం. ఆశ్వయుజ మాసంలోని త్రయోదశి తిథి నాడు సముద్ర మథన సమయంలో ధన్వంతరి ఉద్భవించాడు. అప్పటి నుంచి ఈ ధనత్రయోదశి మొదలైందని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు కొత్త వస్తువులు(ముఖ్యంగా బంగారం) కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావడం ఒక సంప్రదాయం. అలాగే దీపాలను దానం చేసినా మంచిదని.. ఫలితంగా యమరాజు సంతోషించి.. ఆశీర్వాదాన్ని ఇస్తాడని నమ్ముతారు. ఈ ఏడాది ధంతేరాస్​​ను అక్టోబర్​ 29, 2024న జరుపుకోనున్నారు.

నరక చతుర్దశి: ద్వాపర యుగంలో ఈ ఆశ్వయుజ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి తిథిలో శ్రీ కృష్ణుడు, సత్యభామతో కలిసి లోక కంటకుడైన నరకాసురుడిని సంహరించాడు. అప్పటి నుంచి ఈరోజున నరక చతుర్దశి పండగను జరుపుకుంటారు. అలాగే ఈ నరక చతుర్దశి రోజున ఐదు లేదా ఏడు దీపాలు వెలిగించే సంప్రదాయం కూడా ఉంది. ఈసారి అక్టోబర్​ 31వ తేదీ ఉదయం పూట ఈ పండగను జరుపుకోవాలని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్​ కుమార్​ చెబుతున్నారు.

ఇత్తడి కుందులు నల్లగా మారాయా? - ఈ టిప్స్ పాటిస్తే దీపావళి వేళ బంగారంలా మెరుస్తాయి!

దీపావళి అమావాస్య: సత్యయుగంలో ఆశ్వయుజ మాసం అమావాస్యనాడు సముద్ర మథనం నుంచి తొలిసారిగా లక్ష్మీదేవి ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున శ్రీ మహా విష్ణువు, లక్ష్మి దేవి వివాహం కూడా జరిగినట్లు పురాణ కథనం. తర్వాత త్రేతాయుగంలో ఈ రోజున, రాముడు వనవాసం నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ రోజున దరిద్ర దేవతను వెళ్లగొట్టేందుకు మహాలక్ష్మిని పూజిస్తారు. ఈ ఏడాది అక్టోబర్​ 31వ తేదీన సాయంత్రం దీపావళి పండగను జరుపుకోవాలని చెబుతున్నారు.

బలి పాడ్యమి/గోవర్ధన పూజ: దీపావళి మర్నాడు బలిపాడ్యమి. చతుర్దశి నాడు విష్ణుమూర్తి పాతాళానికి అణిచేసిన బలిచక్రవర్తి మళ్లీ భూమ్మీదకి తిరిగివచ్చిన రోజు ఇదేనని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో బలికి పూజలు చేస్తారు. మహారాష్ట్ర వాసులు ఈ రోజును ‘నవ దివస్‌’గా భావిస్తారు. గుజరాతీయులకు ఇది ఉగాది. నందగోపాలుడు గోవర్ధన గిరిని ఎత్తి రేపల్లె వాసులను కాపాడిన రోజు కూడా ఇదే. దాంతో ఈ రోజు అప్పటి నుంచి ఐదు రోజులు జరుపుకునే పండుగలో గోవర్ధన పూజ ఒక భాగంగా మారింది. ఈ పండగను ఈ ఏడాది నవంబర్ 2, 2024 రోజు జరుపుకోనున్నారు.

భగిని హస్త భోజనం..: ఇక చివరగా అన్నాచెల్లెళ్ల పండగను జరుపుకుంటారు. దీనినే భగిని హస్త భోజనం, యమ ద్వితీయ, భాయిదూజ్​గా కూడా పిలుస్తారు. ద్వాపర యుగంలో కృష్ణుడు.. నరకాసురుడిని ఓడించిన తర్వాత ఈ రోజున తన సోదరి సుభద్రను కలవడానికి వెళ్లాడు. అలాగే సత్యయుగంలో యమ ధర్మరాజు ఈ రోజున తన సోదరి యమున ఆహ్వానంపై ఆమె ఇంటికి వెళ్లాడు. అప్పుడు యమునా దేవి తన అన్నకు కుంకుమ దిద్ది ఇష్టమైన ఆహారం కొసరి కొసరి వడ్డించింది. అప్పటి నుంచి ఈ రోజును అన్నా చెల్లెల పండగగా జరుపుకుంటారు. ఈ పర్వదినం అన్నాచెల్లెళ్ల మధ్య అప్యాయతకు ఆదర్శంగా నిలుస్తోంది. పండగ ఈ ఏడాది నవంబర్ 3, 2024న జరుపుకోనున్నారు.

దీపావళి నాడు పెరుగుతో ఇలా చేశారంటే - మీకున్న అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయట!

దీపావళి రోజు ఏ ప్రమిదలో దీపం వెలిగించాలి? - ఈ విషయాలు మీకు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.