Which Color Dress to Wear on Maha shivaratri : హిందూ మతంలో మహా శివరాత్రికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో భక్తులందరికీ తెలుసు. ఈ రోజున మహాశివుడిని ఆరాధిస్తే.. కోరిన కోర్కెలన్నీ తీరుతాయని విశ్వసిస్తారు. అందుకే.. ఆ భగవంతుడి కృపకు పాత్రులయ్యేందుకు శివరాత్రి వేళ ఎంతో నిష్టగా పూజలు చేస్తారు. అయితే.. ఈ రోజున ఏ రంగు దుస్తులు ధరించాలో చాలా మందికి తెలియదు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఈ ప్రత్యేకమైన రోజున భక్తులు శివుడి కరుణ కోసం రోజంతా ఉపవాసం ఉంటారు. కొందరు సాధారణ ఉపవాసం ఉంటే.. మరికొందరు మంచినీళ్లు కూడా తాగకుండా కఠిన ఉపవాసం చేస్తారు. ఇంకా.. భగవంతుని అనుగ్రహం కోసం శివలింగానికి జలాభిషేకం చేస్తారు. రుద్రాభిషేకం వంటివి నిర్వహిస్తారు. అయితే.. వీటితోపాటుగా పరమేశ్వరుడికి ఇష్టమైన రంగు దుస్తులు ధరించాలని పండితులు సూచిస్తున్నారు. ఇలా చేయడం భగవంతుడికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు.
మహా శివరాత్రి వేళ ఏ రంగు దుస్తులు ధరించాలి?: పవిత్రమైన మహా శివరాత్రి రోజున శివయ్య పూజ కోసం ఏ రంగు దుస్తులు ధరించాలని అడిగితే.. ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. శివుడికి ఆకుపచ్చ రంగు చాలా ఇష్టమని చెబుతున్నారు. కాబట్టి.. ఈ రోజున గ్రీన్ కలర్ డ్రెస్సులు వేసుకోవడం చాలా మంచిదని అంటున్నారు. ఆకుపచ్చ చీర ధరించడం పర్యావరణంతో శివునికి ఉన్న అనుబంధాన్ని కూడా సూచిస్తుందట.
శివుడికి బిల్వపత్రం సమర్పణ - ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసా?
ఆ రంగు దుస్తులు లేకుంటే..?: శివుడికి ఆకుపచ్చ రంగు చాలా ఇష్టమైనప్పటికీ.. చాలా మంది భక్తుల వద్ద ఆ రంగు దుస్తులు ఉండకపోవచ్చు. మరి.. అలాంటి వారు ఏం చేయాలి? ఏ రంగు దుస్తులు ధరించాలి? అంటే.. ప్రత్యామ్నాయంగా కొన్ని రంగులు సూచిస్తున్నారు. ఎరుపు, పసుపు, గులాబీ, నారింజ ఇంకా తెలుపు రంగు దుస్తుల్లో ఏదో ఒకటి సెలక్ట్ చేసుకోవచ్చని చెబుతున్నారు. ఈ దుస్తుల్లో శివుడిని ఆరాధించవచ్చని సూచిస్తున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం.. పురుషులు ధోతీ-కుర్తాను ధరించాలని.. స్త్రీలు చీరలు ధరించాలని సూచిస్తున్నారు.
మహాశివరాత్రి నాడు ఏ రంగు దుస్తులు ధరించకూడదు?: శివరాత్రి వేళ కొన్ని ప్రత్యేక రంగుల దుస్తులు ధరించడంతోపాటు.. కొన్ని రంగుల దుస్తులు అస్సలే ధరించకూడదని చెబుతున్నారు. మహా శివరాత్రి నాడు నలుపు, ఇంకా నీలం రంగు దుస్తులు ధరించడం మానుకోవాలని సూచిస్తున్నారు. ఈ రంగులు ప్రతికూల శక్తిని తెస్తాయని చెబుతున్నారు. ఈ రంగు దుస్తులతో శివుడిని ఆరాధిస్తే.. సరైన ప్రతిఫలం దక్కకపోవచ్చని సూచిస్తున్నారు.
మహా శివరాత్రి రోజున ఇవి చేయకండి..
- పూజ సమయంలో, సాయంత్రం వేళ నిద్రించకపోవడం మంచిదట
- మాంసాహారం తీసుకోవడం మానుకోవాలి
- ఇతరులతో వాదనల్లో పాల్గొనడం మానుకోండి
- తామసిక్ ఆహారాన్ని తీసుకోవడం మానేయండి
శివరాత్రి ఉపవాసం చేస్తున్నారా? - ఈ జాగ్రత్తలు పాటిస్తే నీరసం అస్సలే రాదు!