ETV Bharat / spiritual

బెడ్ మీద నుంచి కాలు కిందపెట్టగానే ఈ పని చేయండి - మీ జీవితం అద్భుతంగా సాగుతుంది! - Wake Up Time DOs And DONTs

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 9, 2024, 2:04 PM IST

Wake Up Time Astrology Tips : మీరు ఆ దేవదేవుళ్లకు ఎన్ని పూజలు, వత్రాలు, ఉపవాసాలు చేసినా.. చేసే ప్రతి పనిలో ఏదో ఒక దగ్గర అడ్డంకులు ఎదురవుతున్నాయా? అయితే, అందుకు కారణం.. డైలీ నిద్రలేచే ముందు ఈ పనులు చేయకపోవడమే అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Wake Up Time DOs And DONTs
Wake Up Time Astrology Tips (ETV Bharat)

Wake Up Time DOs And DONTs : మనలో చాలా మంది జ్యోతిష్యశాస్త్రాన్ని బలంగా నమ్ముతారు. అంతేకాదు.. జ్యోతిష్యశాస్త్రంలో పేర్కొన్న నియమాలను నిబద్దతతో పాటిస్తుంటారు. అయినా కూడా జీవితంలో అనేక కష్టనష్టాలు ఎదుర్కొంటుంటారు. అందుకు ముఖ్య కారణం.. రోజూ ఉదయం నిద్ర లేవగానే(Wake Up) మీరు చేసే కొన్ని పారపాట్లే అంటున్నారు నిపుణులు. అంతేకాదు.. జీవితంలో విజయం సాధించాలంటే ప్రతిఒక్కరూ లేవగానే చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయని సూచిస్తున్నారు ప్రముఖ జ్యోతిష్యశాస్త్ర నిపుణులు నందూరి శ్రీనివాస్. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

  • జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. డైలీ ప్రతి ఒక్కరూ చేయాల్సిన ముఖ్యమైన పనులలో ఒకటి.. సూర్యోదయానికి ముందు నిద్రలేవడం. అది కూడా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తే చాలా అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయంటున్నారు జ్యోతిష్య నిపుణులు శ్రీనివాస్. బ్రహ్మ ముహూర్తం అంటే.. సూర్యోదయానికి గంట నుంచి గంటన్నర ముందు ఉండే కాలం. కాబట్టి ఎవరైనా వీలైనంత వరకు ఉదయం త్వరగా నిద్రలేవడం మంచిదంటున్నారు.
  • నిద్రలేవగానే మీరు చేయాల్సిన మరో పని.. కరావలోకనం. అంటే.. నిద్ర మేల్కొగానే చేతులు ముందుకు చాచి ఏదైనా ఒక శ్లోకం చదవాలని చెబుతోంది జ్యోతిష్య శాస్త్రం. ఒక వేళ మీకు శ్లోకాలు రాకపోతే లక్ష్మీ, సరస్వతి, గౌరీ దేవిని ఒకసారి స్మరించుకుంటే సరిపోతుంది. కానీ, చాలా మంది లేవగానే మొబైల్ చూస్తారు. ఇకపై ఆ అలవాటు మానుకోని ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుందంటున్నారు జ్యోతిష్య నిపుణులు.
  • ప్రతి ఒక్కరూ మార్నింగ్ నిద్రలేచే ముందు అంటే.. కాలు మంచం మీద నుంచి కింద పెట్టేటప్పుడు ఓసారి భూదేవిని తలచుకోవాలట. ఎందుకంటే.. లేచిన దగ్గర నుంచి మనల్ని అమ్మలా భూదేవి రక్షిస్తుంది. కాబట్టి, నిద్రలేచే ముందు ఓసారి భూదేవి స్మరించుకుంటే ఆ రోజంతా మంచే జరుగుతుందంటున్నారు జ్యోతిష్యులు శ్రీనివాస్.
  • జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. మార్నింగ్ లేవగానే మీరు చేయాల్సిన మరో ముఖ్యమైన పని.. మంగళద్రవ్య దర్శనం చేసుకోవడం. అంటే.. చందనం, బంగారం, అద్దం, అగ్ని, మృదంగం, డబ్బును చూసి నమస్కారం చేసుకోవాలి. అయితే, పైన తెలిపిన వస్తువులను బెడ్​రూమ్​లో పెట్టుకోలేం కాబట్టి.. మీ ఇష్ట దేవతా విగ్రహాన్ని పడకగదిలో పెట్టుకొని లేవగానే ఆ పఠం చూసి రోజును ప్రారంభిస్తే అంతా మంచే జరగుతుందంటున్నారు.
  • మార్నింగ్ లేవగానే మీరు చేయాల్సిన ఇంకో పని.. మాతాపితృ గురు జన వందనం. అంటే.. తల్లిదండ్రులు జీవించి ఉంటే లేవగానే వారి పాదాలను నమస్కరించడం అలవాటు చేసుకోవాలి. అలాగే పిల్లలకు చిన్నప్పటి నుంచే ఈ అలవాటును నేర్పించాలి. ఎందుకంటే.. ఈ లోకంలో స్వార్థం లేని ప్రేమ పేరెంట్స్​ది మాత్రమే. అందుకే.. వారి ఆశీర్వచనం తీసుకుంటే ఆరోజు అద్భుతంగా సాగుతుందని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు.
  • ఇక చివరగా.. మీరు డైలీ లేవగానే ఈ పనులన్నీ చేశాక.. ముఖం, కాళ్లు, చేతులు కడుక్కొని ఒక చోట కూర్చొని కొద్దిసేపు ధ్యానం చేయడం. రోజును పాజిటివిటీతో ప్రారంభించడానికి ఇది చాలా బాగా తోడ్పడుతుందని చెబుతున్నారు. అలాగే జీవింతం కూడా పాజిటివిటీగా మారడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు నందూరి శ్రీనివాస్ చెబుతున్నారు.

Note : పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్య నిపుణులు, జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ఇవీ చదవండి :

జాతకంలో నాగ దోషాలా? శుక్రవారం ఈ పూజ చేస్తే అంతా సెట్!

దీర్ఘ సుమంగళిగా ఉండటం కోసం శ్రావణ 'మంగళ గౌరీ వ్రతం'- పూజ ఎలా చేయాలో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.