ETV Bharat / spiritual

లక్ష్మీ కటాక్షం పొందాలా? శుక్రవారం పొరపాటున కూడా ఈ పనులు చేయకండి! - What Not To Do On Friday Hindu

What Not To Do On Friday Hindu : హిందూ సంప్రదాయం ప్రకారం శుక్రవారానికి విశిష్ఠ స్థానముంది. శుక్రవారం శ్రీమహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైన రోజు. మరి అలాంటి రోజున కొన్ని చేయరాని పనులు చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహించి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి ఇంట్లో శాశ్వతంగా ఉండాలంటే మరి శుక్రవారం ఏయే పనులు చేయకూడదో చూద్దాం.

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 12, 2024, 4:34 AM IST

What Not To Do On Friday Hindu
What Not To Do On Friday Hindu

What Not To Do On Friday Hindu : శుక్రవారం ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇస్తే ఇక తిరిగి రావంట! అందుకే శుక్రవారం ఎవరికీ అప్పులు ఇవ్వకుండా ఉంటేనే మేలని పండితులు సూచిస్తున్నారు. అలాగే ఈ రోజు ఎవరి దగ్గర నుంచి డబ్బులు అప్పుగా తీసుకోరాదు. అలా తీసుకుంటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని జ్యోతిష శాస్త్ర పండితులు చెబుతున్నారు.

మహిళల జోలికి వెళ్తే ముప్పే!
మహిళలు, బాలికలను లక్ష్మీదేవి స్వరూపంగా భావించడం మన సంప్రదాయంలో భాగం. అందుకే శుక్రవారం నాడు మీ ఇంట్లో కానీ, బయట కానీ స్త్రీలను, బాలికలను కారణం లేకుండా దుర్భాషలాడటం, అవమానించడం వంటివి చేయరాదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక స్త్రీ కూడా మరో స్త్రీని కించపరచకూడదు. ఇలా చేసినట్లయితే శ్రీలక్ష్మీదేవి ఆగ్రహించి ఇంట్లో నుంచి వెళ్లిపోతుందంట. నిజానికి ఒక్క శుక్రవారమే కాదండీ ఎప్పుడు కూడా స్త్రీలను గౌరవించాల్సిందే!

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః! అని పెద్దలు అన్నారు కదా! అంటే ఎక్కడైతే స్త్రీలను పూజిస్తారో అక్కడ శ్రీలక్ష్మీతో సహా సకల దేవతలు కొలువై ఉంటారని శాస్త్ర వచనం. అందుకే స్త్రీలను కించపరిస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికాక తప్పదు.

శుక్రవారం ఇవి ఎవరికైనా ఇస్తే దరిద్రమే!
శుక్రవారం పాత బట్టలు, వాడని గాజులు వంటివి ఎవరికీ ఇవ్వరాదు. ఒకవేళ మీకు అవసరం లేకపోతే వారంలో మరో రోజు ఎప్పుడైనా ఇవ్వండి కానీ శుక్రవారం మాత్రం అసలు ఇవ్వొద్దు. అలా ఇస్తే దారిద్ర దేవతను ఆహ్వానించినట్లే!

శుక్రవారం ఇవి బయట పడేస్తే సంపద కూడా బయట పడేసినట్లే!
శుక్రవారం దేవుని పటాలకు ఉన్న వాడిన పూలు తీసి కొత్త పూలు పెడుతూ ఉంటాం. కానీ ఆ వాడిన పూలను కానీ, గుమ్మాలకు వాడిన మామిడి తోరణాలను కానీ శుక్రవారం బయట పడేస్తే ఇంట్లోని సంపద కూడా ఆవిరై పోతుంది.

స్త్రీల కంట నీరు తెచ్చే అరిష్టం
శుక్రవారం ఇంట్లోని స్త్రీలు ఎలాంటి పరిస్థితుల్లోనూ కంట తడి పెట్టకూడదు. స్త్రీలు కంట తడి పెడితే అది ఆ ఇంటికే అరిష్టం. కాబట్టి ఇంట్లోని వారు ఈ విషయంలో జాగ్రత్త వహించాలి.

శుక్రవారం కుండలు కొనొచ్చా!
వేసవి కాలంలో ప్రతి ఒక్కరు కుండలోని నీరు తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే శుక్రవారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కుండలను కొనరాదు. శుక్రవారం ఇంటి ఆడపడుచుకు క్షీరభాండం అంటే పాలతో నిండిన పాత్రను ఇస్తే ఎన్నటికీ తరగని సంపద కలుగుతుంది. అలాగే ఆడపడుచుకు ఒడి బియ్యం, పసుపు కుంకుమలతో ఒడి నింపితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.

శుభం భూయాత్

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.