ETV Bharat / spiritual

ఆ రాశివారికి ఈవారం పెళ్లి కుదిరే ఛాన్స్​! శ్రీ సుబ్రమణ్య స్వామి ఆరాధన శుభకరం! - Weekly Horoscope - WEEKLY HOROSCOPE

Weekly Horoscope From 8th Sep to 14th Sep 2024 Horoscope : 2024 సెప్టెంబర్ 8వ తేదీ నుంచి సెప్టెంబర్ 14వ తేదీ వరకు మీ రాశిఫలం ఎలా ఉందంటే ?

Weekly Horoscope
Weekly Horoscope (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 8, 2024, 5:05 AM IST

Weekly Horoscope From 8th Sep to 14th Sep 2024 Horoscope : 2024 సెప్టెంబర్ 8వ తేదీ నుంచి సెప్టెంబర్ 14వ తేదీ వరకు మీ రాశిఫలం ఎలా ఉందంటే ?

.

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి వారం ప్రథమార్ధంలో అదృష్ట యోగం, లక్ష్మీకటాక్షం ఉంటాయి. ఉద్యోగులకు తోటి ఉద్యోగుల సహకారం ఉంటుంది. వ్యాపారులు వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి. ముఖ్యంగా ఈ రాశి వారు పని పట్ల ఏకాగ్రత, చిత్తశుద్ధితో ఉండడం అవసరం. నిర్లక్ష్య వైఖరిని వీడితే మంచిది. కళాకారులకు, సినీరంగం వారికి సంఘంలో గౌరవం, కీర్తి పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకోని సవాళ్లు ఎదురవుంటాయి. మీ ప్రతిభతో సవాళ్ళను అధిగమిస్తారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. శ్రీలక్ష్మి గణపతి ఆలయ సందర్శన శుభప్రదం.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. ఈ వారం సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. సన్నిహితులు, స్నేహితుల సహకారంతో వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఒత్తిడికి లోనవుతారు. నూతన ఆదాయ వనరుల కోసం చేసే ప్రయత్నాలు ఫలించవు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయి. త్వరలో శుభవార్తలు అందుకుంటారు. భూమి లేదా ఇంటి కొనుగోలుకు సంబంధించిన ప్రయత్నాలు అనుకూలించవు. కోపాన్ని అదుపులో ఉంచుకోకుంటే కలహాలు తప్పవు. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారికి పనిలో పురోగతి, ఆర్థిక వృద్ధి ఉంటాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు అదనపు ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. నిరుద్యోగులకు, ఉద్యోగంలో మార్పు కోరుకునేవారికి ఈ వారం మెరుగైన అవకాశాలు ఉంటాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో తీర్పు మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలలో అందరి అభిప్రాయం మేరకు నడుచుకుంటే మంచిది. తొందరపాటు నిర్ణయాలు చేటు తెస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి శుభ సమయం నడుస్తోంది. ఉద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. కొత్తగా చేపట్టిన ప్రాజెక్ట్‌ విజయవంతమవుతుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వ్యాపారులు గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా విపరీతమైన లాభాలను పొందుతారు. వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు మంచి ప్రయోజనకరంగా ఉంటాయి. విదేశాలలో వృత్తిని కొనసాగించాలని ప్రయత్నించే వారు శుభవార్తలు అందుకుంటారు. పోటీ పరీక్షల కోసం సిద్ధమయ్యే వారు విజయం సాధిస్తారు. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. కుటుంబంలో శాంతి, సౌఖ్యం ఉంటాయి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి పనిలో పురోగతి, ఆర్థికవృద్ధి ఉంటుంది. ఉద్యోగులు మొదలు పెట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి అందరి ప్రశంసలు అందుకుంటారు. కోరుకున్న ప్రమోషన్, బదిలీ కోసం చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వృత్తిపరంగా మరియు వాణిజ్యపరంగా ఎదగడానికి నూతన అవకాశాలు అందుకుంటారు. స్నేహితులు, కుటుంబ సభ్యుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాలలో ఉన్నవారు శుభవార్తలు అందుకుంటారు. కల్యాణ యోగం ఉంది. ఆరోగ్య బ్రహ్మాండంగా ఉంటుంది. శ్రీ సుబ్రమణ్య స్వామి ఆరాధన శుభకరం.

.

కన్య (Virgo) : కన్య రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉంటాయి. అన్ని రంగాల వారికి వారం ప్రథమార్ధంలో అదృష్ట యోగం, లక్ష్మీకటాక్షం ఉంటాయి. ఉద్యోగులకు తోటి ఉద్యోగుల సహకారం ఉంటుంది. వ్యాపారులు వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు విజయవంతమవుతాయి. సంఘంలో గౌరవం, కీర్తి పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకోని సవాళ్లు ఎదురవుంటాయి. మీ ప్రతిభతో సవాళ్ళను అధిగమిస్తారు. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢపడుతుంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు. పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. శ్రీలక్ష్మి గణపతి ఆలయ సందర్శన శుభప్రదం.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉండకపోవచ్చు. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు లేక నిరాశకు గురవుతారు. సన్నిహితులు, స్నేహితుల సహకారంతో నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. అనారోగ్య సమస్యలు పనులకు ఆటంకాలుగా మారుతాయి. శత్రు భయం ఉంది. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. భూమి లేదా ఇంటి కొనుగోలుకు సంబంధించిన ప్రయత్నాలు ముందుకుసాగవు. కోపాన్ని అదుపులో ఉంచుకోకుంటే కలహాలు తప్పవు. ఆంజనేయస్వామి ఆరాధన వలన అనుకూల ఫలితాలు ఉంటాయి.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ వారం అదృష్టదాయకంగా ఉంటుంది.అన్ని రంగాల వారిని ఈ వారం అదృష్టం వరిస్తుంది. ఆత్మవిశ్వాసంతో, దైవబలంతో జీవితంలోని సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటారు. ఎలాంటి సమస్యలనైనా చిటికెలో పరిష్కరిస్తారు. పోటీ పరీక్షల కోసం చదువుతున్న వారికి, వారం ప్రథమార్ధం అత్యంత అదృష్ట యోగం ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో గణనీయమైన విజయం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మీ నిర్ణయమే కీలకం అవుతుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, అవివాహితులకు కల్యాణ యోగం ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. మొత్తం మీద ఈ వారం మీకు పూర్తి అదృష్టకరంగా ఉంటుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈ వారం తమ తమ రంగాలలో నూతన అవకాశాలను అందుకుంటారు. బుద్ధిబలంతో వ్యవహరించి కీలక విషయంలో విజయం సాధిస్తారు. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ పరంగా కొన్ని సమస్యలు ఉండవచ్చు. కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. మీ సహనంతో పరిస్థితులను మీకు అనుగుణంగా మలచుకుంటారు. విద్యార్థులు శుభవార్తలను వింటారు. కుటుంబంలో శాంతి, సౌఖ్యం ఉంటాయి. అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సంబంధాల పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. భూతగాదాలు, ఆస్తి వ్యహారాలు కోర్టు బయట పరస్పర అంగీకారంతో పరిష్కరించుకుంటే మేలు. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం లోపిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు ఆర్థిక లావాదేవీలు నిర్వహించేటప్పుడు జాగ్రత్త వహించాలి. పనిలో ఎదురయ్యే సవాళ్ళను సమర్ధవంతంగా ఎదుర్కొంటారు. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో విహార యాత్రలకు వెళతారు. రాజకీయ నాయకులకు సంఘంలో పరపతి పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త వహించాలి. శని స్తోత్రం పఠిస్తే శుభ ఫలితాలు ఉంటాయి.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ వారం ప్రభావవంతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ రంగాల వారు పనులన్నీ సకాలంలో పూర్తిచేసి ప్రశంసలు పొందుతారు. ఉన్నతాధికారుల నుంచి ప్రమోషన్ కాగితాలు అందుకుంటారు. క్రమశిక్షణతో పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. సహోద్యోగుల సహకారం ఉంటుంది. ప్రభుత్వరంగంలో ఉన్న అధికారులు కీలకమైన బాధ్యతలు చేపడతారు. నిరుద్యోగుల కల ఫలించి మంచి జీతంతో ఉద్యోగం దొరుకుతుంది. వ్యాపారవేత్తలకు ఆర్థిక పరంగా గొప్ప ప్రయోజనాలు ఉంటాయి. అనేక ఆర్థిక లాభాలను పొందుతారు. మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేసే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. గృహోపకరణాల కోసం, విలాస వస్తువుల కోసం ధనవ్యయం ఉండవచ్చు. ఆరోగ్యం సహకరిస్తుంది. సంతానం అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. శ్రీలక్ష్మి గణపతి ఆలయ సందర్శన శుభప్రదం.

.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ వారం యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారికి విదేశాలలో అవకాశం లభిస్తుంది. వ్యాపారులు కష్టించి పనిచేసి తిరుగులేని విజయాలను సాధిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి విపరీతమైన లాభాలను అందుకుంటారు. వృత్తి నిపుణులు, రచయితలు సన్మాన సత్కారాలను అందుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. బంధువులతో గతంలో ఏర్పడిన అపార్ధాలు తొలగిపోతాయి. సరైన సమయంలో తీసుకునే నిర్ణయాలు వృత్తిలో పురోగతి, ఆర్థిక విజయానికి దోహదపడుతుంది. కళలు, సంగీతం మరియు మీడియా రంగాలలో పని చేసే వారికి ఈ వారం అదృష్టయోగం పడుతుంది. స్థిరాస్తికి సంబంధించి కోర్టు వ్యవహారాలలో తీర్పు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. శ్రీలక్ష్మీ ధ్యానం శుభప్రదం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.