ETV Bharat / spiritual

ఆ రెండు రాశుల వారింట వివాహ శుభకార్యాలు- ఉద్యోగులకు ప్రమోషన్లు! - Weekly Horoscope March 2024 - WEEKLY HOROSCOPE MARCH 2024

Weekly Horoscope From 24th March To 30th March 2024 : 2024 మార్చి 24 నుంచి మార్చి 30వ తేదీ వరకు మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

WEEKLY HOROSCOPE MARCH 2024
WEEKLY HOROSCOPE MARCH 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 24, 2024, 5:00 AM IST

Weekly Horoscope From 24th March To 30th March 2024 : 2024 మార్చి 24 నుంచి మార్చి 30వ తేదీ వరకు మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. ఈ రాశి వారు ఈ వారమంతా తమ ఉద్యోగావ్యాపారాల కోసం పూర్తి సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది. నూతన ఉద్యోగావకాశాలు వచ్చినప్పటికిని పాత ఉద్యోగానికి మొగ్గు చూపితే మేలు. భాగస్వామ్య వ్యాపారాలు లభిస్తాయి. విద్యార్థులు చదువు పట్ల ఏకాగ్రత, శ్రద్ధను చూపిస్తారు. ప్రేమికులకు అనువైన సమయం. వివాహితులు విహారయాత్రలకు వెళతారు. కుటుంబం సహకారం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది, వ్యసనాలకు దూరంగా ఉంటే మంచిది. పెట్టుబడులు లాభాలను తెచ్చుపెడతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఖర్చులను నియత్రించుకుంటారు. నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహా తీసుకుంటే మేలు.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. విద్యార్థులు మిశ్రమ ఫలితాలను పొందుతారు. మిమ్మల్ని తప్పుదారి పట్టించే స్నేహితుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఉన్నత విద్యకు అనుకూలమైన సమయం. ప్రేమికులకు కలిసివచ్చే కాలం. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వ్యాపారస్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు తమ సహోద్యోగుల సహకారం ఉంటుంది. ఉద్యోగంలో పురోగతిఉంటుంది. కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది. విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరప్రాంతాల నుంచి శుభవార్త అందుకుంటారు. నూతనమార్గాల ద్వారా ధనలాభం.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ వారం చాలా సంతోషంగా ఉంటుంది. వివాహితుల వైవాహిక జీవితం ఆనందప్రదంగా ఉంటుంది. వృత్తిపరంగా నూతన ప్రణాళికలతో ముందుకు పోతారు. ప్రేమ వ్యవహారాలు కలిసివస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. స్నేహితులతో కాలం గడుపుతారు. ఇంటికి అతిథుల రాకతో సందడి వాతావరణం నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. స్థిరాస్తి వ్యాపారం చేసే వారు మంచి లాభాలు అందుకుంటారు. వ్యాపారులకు కలిసి వచ్చే కాలం. ఆరోగ్యం బాగుంటుంది. ఉన్నత విద్య చేయాలనుకునే వారికి అనుకూలమైన సమయం. విద్యార్థులు క్రీడా పోటీలలో పాల్గొని విజయం సాధిస్తారు.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారు ఈ వారమంతా సరదాగా గడుపుతారు. ప్రేమికులు ఏకాంతంలో భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. కుటుంబ జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామి సహకారం ఉంటుంది. పొదుపుసూత్రాలు నేర్చుకుంటారు. పిల్లలతో మంచి సమయం గడుపుతారు. రాజకీయనాయకులు విజయం సాధిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు కృషితో విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. నూతన వస్తువులు కొంటారు. ఉద్యోగులు కొంత సమస్యలు ఉన్నప్పటికినీ చివరకు విజయం సాధిస్తారు. వ్యాపారులు లాభాల బాటలో పయనిస్తారు. ఆర్థికంగా ఈ వారం పూర్తిగా లాభిస్తుంది.

.

సింహం (Leo) : ఈ వారం సింహరాశి వారికి సాధారణంగా ఉంటుంది. స్వయంకృషితో మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవచ్చు. కష్టపడి పని చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. వివాహితులకు కుటుంబంలో ఒకింత ఒత్తిడి ఉంటుంది కాబట్టి వాదనలకు దూరంగా ఉంటే మేలు. జీవిత భాగస్వామి ఆరోగ్యం ఆందోళన కలిగించవచ్చు. భార్యాభర్తల మధ్య అనుబంధం దృఢపడుతుంది.

.

కన్య (Virgo) : కన్య రాశి వారికి ఈ వారం కష్టే ఫలి అన్నట్లుగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడితే మంచి ఫలితాలు సాధిస్తారు. కుటుంబం సహకారం ఉంటుంది. మిత్రుల ద్వారా నూతన ఆదాయవనరులు లభిస్తాయి. ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో మార్పు సూచితం. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. కొన్ని ఖర్చులు ఉన్నప్పటికినీ ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. మానసిక ప్రశాంతత కోసం ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటే ప్రశాంతత కలుగుతుంది. రాజకీయనాయకులు విజయం సాధిస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. నడక, యోగా, ధ్యానం ద్వారా ఆరోగ్యం ఆనందం కలుగుతుంది.

.

తుల (Libra) : తుల రాశి వారికి ఈ వారం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. వ్యాపారస్తులు వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి చేసే ప్రయత్నంలో విజయం సాధిస్తారు. విద్యార్థులు విజయాలను అందుకుంటారు. గృహంలో శాంతి, సంతోషాలు ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో గొప్ప సమయాన్ని గడుపుతారు. విద్యార్థులు చదువు పట్ల ఏకాగ్రత కనబరుస్తారు. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. నూతన వాహన ప్రాప్తి. పాత బకాయిలను వసూలు చేస్తారు. అప్పులు తీర్చివేస్తారు. కుటుంబ సహకారం ఉంటుంది. దైవసంబంధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దల ఆశీస్సులు మేలు చేస్తాయి.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాలలో రాణిస్తారు. విద్యార్థులకు పరీక్షలో జయం కలుగుతుంది. విదేశాలలో విద్యను అభ్యసించాలనుకునే వారికి ఇది అనుకూలమైన సమయం. ప్రేమికులకు సమస్యలు దూరమవుతాయి. వివాహితులకు కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. కుటుంబ సంక్షేమం కోసం కలిసికట్టుగా పని చేస్తారు. నూతన బాధ్యతలను చక్కగా నిర్వహిస్తారు. మీ తోబుట్టువుల ఉన్నత చదువుల కోసం పాటుపడతారు. ఉద్యోగులకు ఉద్యోగంలో పురోగతికి ఉంటుంది. వ్యాపారులకు ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇంట్లో పూజలు, వ్రతాలు నిర్వహిస్తారు. బంధుమిత్రుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. పూర్వీకుల ఆస్తుల ద్వారా ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి. నూతనవాహన ప్రాప్తి. సంతానం అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ కనరుస్తారు. ఉన్నత విద్యకు అనుకూలమైన సమయం. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారులు వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు పని ప్రదేశంలో అనుకూలతలు ఉంటాయి.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ వారం చాలా బాగుంటుంది ఆర్ధికంగా అనుకూలం. ఇతరులకు సహాయం చేయటంలో ముందుంటారు. ఉద్యోగులకు నూతన అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారస్తులు కొంతకాలంగా ఆగిపోయిన వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించడానికి అనువైన సమయం. కుటుంబం సహకారం ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి ప్రారంభించే నూతన కార్యక్రమాలు ఆదాయాన్ని తెచ్చి పెడతాయి. విద్యార్థులు విజయం సాధిస్తారు. స్నేహితుల సహకారం ఉంటుంది. ఉన్నత విద్యకు అనుకూలమైన సమయం. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. సామాజిక సేవ చేసే వారికి గౌరవమర్యాదలు దక్కుతాయి. ఇంటి మరమ్మత్తుల కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. అవివాహితులకు వివాహం కుదిరే అవకాశం. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రేమ వ్యహారాలలో అనుకూలత అంతంత మాత్రం గానే ఉంటుంది. వివాహితులకు కుటుంబ వాతావరణంలో ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పూర్వీకుల ఆస్తి కలిసివస్తుంది. మీ జీవిత భాగస్వామి ప్రారంభించే నూతన పని మీ ఆదాయాన్ని పెంచుతుంది. విద్యార్థులు విద్యలో రాణిస్తారు. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు తమ అభిరుచి మేరకు చదివే అవకాశం ఉంటుంది. గృహంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. వ్యాపారస్తులు పురోగతిని సాధిస్తారు. ఉద్యోగులు పనులను సకాలంలో పూర్తి చేస్తారు. పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. తల్లిదండ్రులతో సమాలోచనలు చేస్తారు.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ వారం కలిసివస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం పొందుతారు. వారితో కలిసి తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి సహాయసహకారాలు ఉంటాయి. ప్రేమికులకు కలిసివచ్చే కాలం. విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ కనబరుస్తారు. ఉన్నత విద్యకు అనుకూలమైన సమయం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతి కలుగుతుంది. వ్యాపారులు నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. పెద్దల ఆశీస్సులు మేలు చేస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. బంధుమిత్రులతో ఇల్లు కళకళలాడుతుంటుంది. వ్యాపారులకు ప్రయాణాలు కలిసివస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.