ETV Bharat / spiritual

ఈ వారం ఆ రాశి వారింట్లో శుభకార్యాలు- కానీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త! - Weekly Horoscope this week

Weekly Horoscope From 17th March To 23th March 2024 : 2024 మార్చి 17 నుంచి మార్చి 23వ తేదీ వరకు మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Weekly Horoscope From 17th March To 23th March 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 17, 2024, 5:08 AM IST

Weekly Horoscope From 17th March To 23th March 2024 : 2024 మార్చి 17 నుంచి మార్చి 23వ తేదీ వరకు మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : ఈ వారం మేష రాశి వారు వారి వృత్తి వ్యవహారాలలో ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తుంది. ఉద్యోగస్తులు కొత్త ఉద్యోగ అవకాశాలను పొందుతారు. అయితే పాత ఉద్యోగం పట్ల మొగ్గు చూపడమే మంచిది. భాగస్వామ్య వ్యాపారాలు లభిస్తాయి. విద్యార్థులు పూర్తి ఏకాగ్రతతో చదువుకుంటే మంచి ఫలితాలను సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలకు మంచి సమయం. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశాలున్నాయి. కుటుంబం నుండి సహకారం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది, చెడు అలవాట్లకు దూరంగా ఉంటే సమస్యలుండవు. పెట్టిన పెట్టుబడికి పూర్తి ప్రయోజనం ఉంటుంది. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీ ఖర్చులను నియంత్రించడంలో విజయం సాధిస్తారు. ఏదైనా కొత్త పెట్టుబడి పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుంది.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ వారం ఆరోగ్యం చాలా బాగుంటుంది, వాతావరణం మార్పుల కారణంగా అనారోగ్యం రాకుండా ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. మీ జీవిత భాగస్వామి సంపూర్ణ సహకారం ఉంటుంది. జీవిత భాగస్వామి ఎక్కువ సమయం గడపడానికి ప్రాధాన్యత నివ్వండి. ఇది మీ బంధాన్ని బలపరుస్తుంది. వ్యాపారస్తులకు కలిసి వచ్చే కాలం. ఉద్యోగస్తులు యజమాని నుండి ప్రశంసలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. అలాగే ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం కాదు. ఇంట్లో శుభ కార్యాల కారణంగా విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టలేరు, కానీ వారి స్నేహితుల సహాయంతో మంచి ప్రతిభను చూపగలరు. వృత్తి పనివారికి, ఉద్యోగస్తులకు లాభదాయకమైన కాలం. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. పితృవర్గంతో సమాలోచనలు జరుపుతారు.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారి గురించి చెప్పాలంటే, వివాహితులు కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ప్రేమ వ్యవహారాలకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అవివాహితులైన వారికి మంచి జీవిత భాగస్వామి లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుండి మంచి సహకారం గృహంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. శ్రామికులకు వారి ఉద్యోగాలలో పురోగతికి కనిపిస్తుంది. వ్యాపారస్తులు వ్యాపారాన్ని విస్తరించడంలో విజయం సాధిస్తారు. విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ కనపరుస్తారు. మీచదువుకు ఆటంకం కలిగించే వారి పట్ల జాగ్రత్త గా ఉండండి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఖర్చులు అధికంగానే ఉంటాయి. ఇంటి మరమ్మతుల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. పిల్లల చదువుల కోసం ఎక్కువ ఖర్చు అవుతుంది. ఉన్నత విద్యకు అనుకూలమైన సమయం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులు కొత్త కాంట్రాక్టులు పొందుతారు. ఉద్యోగస్తులు పనులను సకాలంలో పూర్తి చేయడం వలన ఉన్నతాధికారుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. కుటుంబ జీవితంలో ప్రశాంతత, ఆనందం నెలకొంటుంది. మీ ఆంతరంగిక వ్యవహారాలలో ఇతర వ్యక్తులు జోక్యం చేసుకోనివ్వవద్దు. ప్రేమికులకు అనుకూలమైన సమయం. మీ కుటుంబ సభ్యులకు మీరు ప్రేమించిన వ్యక్తిని పరిచయం చేస్తారు. విద్యార్థులు విజయాలను అందుకుంటారు. ఉన్నత విద్యకు కూడా ఈ వారం అనుకూలమైన సమయం. విద్యార్థులు తమకు ఇష్టమైన సబ్జెక్టును అభ్యసించే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. ఇంటి అవసరాల నిమిత్తం ఖర్చులు ఉండవచ్చు. మీ తోడబుట్టిన వారి ఉన్నత విద్య కోసం డబ్బును పెట్టుబడి పెడతారు. తల్లితో సంతోషంగా గడుపుతారు.

.

సింహం (Leo) : సింహ రాశి వారు ఈ వారం ప్రారంభంలో కుటుంబ సభ్యులతో సమయాన్ని ఆనందంగా గడుపుతారు. డబ్బు ఆదా చేయడం తెలుసుకుంటారు. తద్వారా భవిష్యత్తులో మీకు ఎటువంటి సమస్యలు ఎదురుకావు. మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు పొందుతారు. ప్రేమికులకు కాలం ఆనందంగా, అనుకూలంగా గడిచిపోతుంది. విద్యార్థులు చదువుపై పూర్తి ఏకాగ్రత కనబరుస్తారు. కొత్త ప్రాజెక్ట్‌లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు తమ యజమానితో ఆచి తూచి మాట్లాడితే మంచిది. వ్యాపారస్తులు వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో విజయం సాధిస్తారు. ఇతరుల సలహా మేరకు పెట్టుబడి పెడితే నష్టపోవచ్చు. ఆరోగ్యం మునుపటి కంటే మెరుగుపడుతుంది.

.

కన్య (Virgo) : కన్య రాశి వారికి ఈ వారం ఎంతో అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం పూర్తిగా ఉంటుంది. కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లే అవకాశాలున్నాయి. మీ బంధువులలో ఒకరి సహాయం మీకు ఆర్ధికంగా లాభిస్తుంది. కుటుంబ సభ్యులతో విందువినోదాలలో పాల్గొంటారు. పరిచయాలు పెరుగుతాయి. సామాజిక సేవా రంగంలో ఉండే వారికి గౌరవం పెరుగుతుంది. విద్యార్థులు విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామి సహకారం ఉంటుంది.ప్రేమికులకు మంచి కాలం. అవివాహితులు తమ జీవిత భాగస్వామిని కలిసే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు వ్యాపార పనుల నిమిత్తం దూరప్రాంతాల వెళ్లాల్సి రావచ్చు. ఈ ప్రయాణం వారికి లాభదాయకంగా ఉంటుంది. సోదరుల సహకారం ఉంటుంది. ఆరోగ్యం మునుపటి మెరుగ్గా ఉంటుంది. తల్లిదండ్రులతో సమాలోచనలు చేస్తారు.

.

తుల (Libra) : ఈ వారం తుల రాశిలో జన్మించిన విద్యార్థులకుఅనుకూలమైన సమయం. విద్యార్థులు తమ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులు తమ సహోద్యోగుల సహకారం పొందుతారు. వ్యాపారస్తులు వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో విజయం సాధిస్తారు. కొత్త అవకాశాలు మీ కోసం ఎదురుచూస్తున్నాయి. ఆదాయం పెరగడంతో ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే వారు నిపుణుల సలహా తీసుకుంటే మంచిది. కుటుంబ సభ్యల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. అవివాహితులకు వివాహం నిశ్చమయే దిశగా నిర్ణయాలు ఉంటాయి. వివాహితులకు జీవిత భాగస్వామి సహకారం ఉంటుంది. కోపతాపాలకు తావివ్వకండి. ప్రేమికులకు మంచి కాలం. ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. పిల్లల చదువుల కోసం ధనవ్యయం ఉంటుంది. కుటుంబంతో విహరయాత్రల నిమిత్తం డబ్బు ఖర్చు అవుతుంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ వారం కీలకమైనది. కుటుంబం సభ్యుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. పొదుపుకు ప్రాధాన్యత ఇస్తారు. తద్వారా భవిష్యత్తులో ఆర్ధిక సమస్య ఉండదు. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకోవడం ద్వారా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకుంటారు. ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు లభించి ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. అధిక పనిభారం వల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది. విశ్రాంతి అవసరం. బంధుమిత్రులను ఇంటికి ఆహ్వానించి సరదాగా గడుపుతారు. ఇంట్లో దైవ సంబంధమైన కార్యక్రమాలు చోటు చేసుకుంటాయి. రాజకీయాల్లో విజయం సాధిస్తారు. మీ జీవిత భాగస్వామి సహకారం పొందుతారు. ప్రేమికులకు అనుకూలమైన కాలం. ఇంటి మరమ్మతుల నిమిత్తం ధనవ్యయం ఉంటుంది.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారు ఈ వారం అంతా ఆనందంగా ఆహ్లాదంగా కాలం గడుపుతారు. జీవిత భాగస్వామితో కలిసి కొన్ని కొత్త పనులను ప్రారంభిస్తారు. కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది. ప్రేమికులకు అనుకూలమైన కాలం. మీ ఆంతరంగిక విషయాలలో ఇతర వ్యక్తులు జోక్యం అనవసరం. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. విద్యార్థులు విజయం సాధిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న విద్యార్థులు కష్ట పడితే మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగస్తులు యజమాని నుండి ప్రశంసలు పొందుతారు. వ్యాపారస్తులు వ్యాపార నిమిత్తం దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఈ ప్రయాణం వారికి లాభిస్తుంది. ఇంట్లో శుభకార్యక్రమాలు నిర్వహిస్తారు.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ వారం ఎంతో అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం ఉంటుంది. . కుటుంబ బాధ్యతలను శ్రద్ధగా నిర్వహిస్తారు. ప్రేమికులకు అనుకూలమైన కాలం. అవివాహితులకు వివాహం కుదరవచ్చు. భాగస్వామ్యం వ్యాపారం చేయాలనుకునే వారు కుటుంబ సభ్యులతో చర్చించి చేస్తే మంచిది. ఇంటికి దూరంగా ఉండేవారికి ఇంటిపై బెంగ పెరుగుతుంది. విద్యార్థులకు విదేశాలలో విద్యావకాశాలు రావచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ వారం చాలా బాగుంటుంది. వివాహితుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. మీ భాగస్వామి ప్రతిభ పట్ల మీరు గర్వపడుతారు.ప్రేమికులకు అనుకూలమైన కాలం. వ్యాపారస్తులు వ్యాపారంలో నూతన మార్పులను తీసుకువస్తారు, ఇందుకోసం కొంత ధనం ఖర్చు అవుతుంది. ఉద్యోగస్తులు తమ పనులను సకాలంలో పూర్తి చేయవలసి ఉంటుంది. విద్యార్థులు కష్టపడితే విజయం సాధిస్తారు. ఉన్నత విద్యకు అనుకూలమైన సమయం. ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా కూడదు. ఇంట్లో ఖర్చులు పెరుగుతాయి. మీ సోదర వర్గం వారి వివాహానికి వచ్చిన అడ్డంకులు తొలగిపోతాయి. శుభకార్యక్రమాలు నిర్వహిస్తారు. సామాజిక సేవ చేసే వారికి తగిన గౌరవం లభిస్తుంది.

.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ వారం ఆనందదాయకంగా ఉంటుంది. వివాహితులకు సంతోష సమయం. మీ జీవిత భాగస్వామి పేరుతో కొన్ని కొత్త పనులను ప్రారంభించవచ్చు. ప్రేమికులకు అనుకూలమైన కాలం మరియు వివాహం సూచన. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. విదేశాల నుంచి దిగుమతి-ఎగుమతి పనులు చేసే వ్యాపారస్తులు శుభవార్తలు వింటారు. రాజకీయాల్లోకి వెళ్లాలనుకునే వారికి మంచి సమయం. పిల్లలు శ్రద్ధగా చదువుకోవడం కనిపిస్తుంది. ఉన్నత విద్యకు అనుకూలమైన సమయం. ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. ఉద్యోగం మారడానికి ఇది మంచి సమయం. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఖర్చులు తగ్గుతాయి. ఇంట్లో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మీ తల్లిదండ్రులతో సమాలోచనలు చేస్తారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.