ETV Bharat / spiritual

'వివాహ పంచమి' వ్రత కథ- ఆ ఘట్టాన్ని చదివితే అన్యోన్య దాంపత్యం పక్కా! - VIVAHA PANCHAMI 2024

వివాహ పంచమి వ్రత కథ- ఆచరించిన ఫలం దక్కేది అప్పుడే!

Vivaha Panchami
Vivaha Panchami (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 6, 2024, 7:00 AM IST

Vivaha Panchami Vratha Katha : మార్గశిర మాస శుద్ధ పంచమిని వివాహ పంచమిగా జరుపుకుంటాం. వ్రతం పూర్తయిన తర్వాత వ్రత కథను చదువుకుని శిరస్సున అక్షింతలు తప్పకుండా వేసుకోవాలి. అప్పుడే వ్రతం ఆచరించిన ఫలం సంపూర్ణంగా దక్కుతుంది. వివాహ పంచమి పూజా విధానాన్ని సవివరంగా తెలుసుకున్నాం కదా! ఇప్పుడు వ్రత కథను కూడా తెలుసుకుందాం.

శ్రీ వాల్మీకి రామాయణంలో వివాహ పంచమి వ్రత కథను గురించి వివరించారు. పెద్దలు, గురువులు సూచించిన ప్రకారం సీతారాముల స్వయంవరం, సీతారాముల కల్యాణమే వివాహ పంచమి వ్రత కథగా చదువుకోవాలని తెలుస్తోంది.

వివాహ పంచమి కథ
ఒకానొక సమయంలో మహర్షి విశ్వామిత్రుడు అయోధ్య రాజు దశరథుడి వద్దకు వెళ్లి తన యజ్ఞానికి రాక్షసుల నుంచి ఆటంకాలు కలుగుతున్నాయని, తన యజ్ఞాలు నిరాటంకంగా కొనసాగడానికి, రాక్షసుల బారి నుంచి యజ్ఞాన్ని కాపాడేందుకు యువరాజు శ్రీరాముని తనతో పంపమని అడుగుతాడు. ముందు సందేహించినా కులగురువు వశిష్టుని సలహా మేరకు దశరథుడు విశ్వామిత్రుని వెంట రాముని పంపేందుకు అంగీకరిస్తాడు. విశ్వామిత్రుడితో పాటు రాముడు, లక్ష్మణుడు కూడా యాగరక్షణకు బయల్దేరి వెళ్తారు. వీరి సహాయంతో యజ్ఞాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న విశ్వామిత్రుడు యువరాజులతో కలిసి మిథిలా నగరానికి వెళతాడు.

సీతా స్వయంవరం
ఆ సమయంలో మిథిలా నగరంలో మిథిలాధిపతి జనక మహారాజు కుమార్తె సీతాదేవి స్వయంవరం జరుగుతుంటుంది. శివధనస్సును ఎక్కుపెట్టిన వారికి సీతా దేవితో కల్యాణం జరిపిస్తానని మిథిల రాజు ప్రకటిస్తాడు. అయితే శివధనుస్సును ఎక్కు పెట్టడానికి ఎందరో రాజులు ప్రయత్నించినప్పటికీ ఎవరికీ విజయం దక్కదు. చివరికి శ్రీరాముని శివధనుర్బంగం చేయమని విశ్వామిత్రుడు ఆదేశిస్తాడు.

విశ్వామిత్రుని ఆజ్ఞతో శ్రీ రాముడు శివధనుస్సును సునాయాసంగా ఎక్కు పెట్టడమే కాకుండా ఆ ధనుస్సును రెండుగా విరిచి అందరినీ ఆశ్చర్యపరుస్తాడు. జనక మహారాజు సంతోషించి దశరధ మహారాజును పిలిపించి అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం జరిపిస్తాడు. పురాణాల ప్రకారం సీతారాముల వివాహం మార్గశిర మాసం శుక్లపక్షం ఐదవ రోజున జరుగుతుంది. కాబట్టి అప్పటి నుంచి ప్రతియేటా వారి వివాహం జరిగిన రోజును వివాహ పంచమిగా జరుపుకోవడం సంప్రదాయంగా మారింది.

వివాహ పంచమి పూజను చేసుకున్న వారు శ్రీ రామాయణంలోని సీతారాముల కల్యాణ ఘట్టాన్ని చదువుకుంటే భార్యాభర్తల మధ్యన ఉన్న అపార్ధాలు తొలగిపోయి అన్యోన్య దాంపత్యం సిద్ధిస్తుందని పురాణ వచనం.

శుభం భూయాత్!

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.