ETV Bharat / spiritual

వినాయక చవితి పూజకు రెడీనా? ఈ 7 విషయాలు మస్ట్​గా తెలుసుకోవాల్సిందే! - Vinayaka Chavithi 2024 - VINAYAKA CHAVITHI 2024

Vinayaka Chavithi 2024 Complete Details : వినాయక చవితి పండుగను అందరూ ఎంతో ఇష్టంగా చేసుకుంటారు. ఇంట్లోనే బుజ్జి గణపయ్యను ప్రతిష్ఠించి పూజిస్తారు. మరి మీరు కూడా చేసుకుంటున్నారా? పూజకు ఏఏ వస్తువులు కావాలో తెలుసా? శాస్త్రోక్తంగా ఎలా జరుపుకోవాలో ఐడియా ఉందా? పత్రిపూజ ఎందుకు చేసుకోవాలి? ఏ రాశి వారు ఏ ప్రసాదం పెట్టాలి? వ్రతకథ ఎందుకు చదువుకోవాలి? వంటి పలు ప్రశ్నలకు సమాధానాలు మీకోసం.

Vinayaka Chavithi 2024
Vinayaka Chavithi 2024 (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 6, 2024, 10:27 AM IST

Vinayaka Chavithi 2024 Complete Details : వినాయక చవితి వస్తుందంటే చాలు- చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఉత్సాహంగా విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు చేస్తారు. పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా విఘ్నేశ్వరుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తారు. కోరిన కోర్కెలు నెరవేరాలని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ పార్వతీ తనయుడికి మొక్కుతారు. కేవలం వీధుల్లోనే కాకుండా ఇళ్లల్లో కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో గణపయ్యకు పూజలు చేస్తారు. మరి మీరు కూడా ఇంట్లో పూజ చేసుకుంటున్నారా? అయితే ఈ విషయాలన్నీ తెలుసుకోవాల్సిందే!

  • వినాయక చవితి పర్యావరణ హితంగా ఎలా జరుపుకోవాలి?
    వినాయక చవితి పండుగకు ప్రతి ఒక్కరు చిన్నదో పెద్దదో గణనాథుడి ప్రతిమను ఇంటికి తెచ్చుకుని పూజించి అనంతరం నిమజ్జనం చేస్తారు. మరి వినాయక చవితి పర్యావరణ హితంగా ఎలా జరుపుకోవాలో ఈ లింక్​పై క్లిక్ చేసి తెలుసుకుందాం.
  • గణపయ్య పూజకు ఏఏ వస్తువులు కావాలి?
    వినాయక చవితి పూజ చాలా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాల్సిన పండుగ. ఏ ఒక్క వస్తువు కూడా లోటు లేకుండా అన్నీ ముందుగా సమకూర్చుకోవాలి. ఇలాంటప్పుడే అనిపిస్తుంది కదా ముందుగా లిస్ట్ రాసుకుంటే మంచిదని! అందుకే మీ కోసమే ఈ పూజా సామగ్రి పట్టిక! ఆ సామగ్రి లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేస్తే చాలు.
  • పూజ శాస్త్రోక్తంగా ఎలా జరుపుకోవాలి?
    వినాయక చవితి పండుగను కుల, మత, జాతులకు అతీతంగా జరుపుకోవడం మరో విశేషం. గణనాథుడి పూజకు భక్తిశ్రద్ధలు ఎంత ప్రధానమో పూజలో పొరపాట్లు చేయకుండా ఉండడం కూడా అంతే ప్రధానం. మరి వినాయక చవితి పూజ శాస్త్రోక్తంగా ఎలా చేయాలో ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.
  • వినాయకునికి పత్రి పూజ ఎందుకు చేస్తాం?
    వినాయక చవితి సందర్భంగా గణనాథుడికి 21 రకాల పత్రితో పూజించడం వెనుక ఎంతో శాస్త్రీయత దాగి ఉంది. మరి ఆ పూజలో వాడే పత్రి రకాలు ఏమిటి? వాటిలో ఔషధ గుణాలు ఏమిటో తెలియాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఏ రాశి వారు ఏ ప్రసాదం పెట్టాలి?
    గణపతిని పూలతో అలకరించి రకరకాల పండ్లు, ఆహార పదార్థాలను నైవేద్యంగా పెడతాం. అయితే చవితి రోజు ఒక్కో రాశి వారు ఒక్కో ప్రసాదాన్నిపెడితే అఖండ విజయ ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ లింక్​పై క్లిక్ చేసి తెలుసుకోండి.
  • వినాయక చవితి వ్రతకథ చదివితే/వింటే ప్రతిఫలం పక్కా!
    హిందూ సంప్రదాయం ప్రకారం ఏ వ్రతమైనా, పూజ అయినా పూర్తి అయిన తర్వాత వ్రత కథను చదువుకుని అక్షింతలు వేసుకుంటేనే పూజ సంపూర్ణం అయినట్లు లెక్క. ముఖ్యంగా వినాయక చవితి పూజలో కథకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. వినాయక చవితి కథ చదువుకుని పూజాక్షితలను శిరస్సున వేసుకుంటే చవితి చంద్రుని చూసిన దోషం పోతుందని శాస్త్ర వచనం. అంతటి మహత్యం ఉన్న వినాయక చవితి కథను ఈ లింక్​పై క్లిక్ చేసి చదవండి.
  • గణపయ్య ఏ రోజు ఏ వాహనంపై ఊరేగనున్నారు?
    ఇప్పటి వరకు పూజ గురించి తెలుసుకున్నాం కదా! మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన వినాయక క్షేత్రం కాణిపాకం వెళ్లారా ఎప్పుడైనా? స్వయంభువుగా గణపయ్య వెలసిన కాణిపాకం క్షేత్రంలో వినాయక చవితి నుంచి పది రోజుల పాటు ఘనంగా బ్రహోత్సవాలు జరుగుతాయి. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే ఆ కాణిపాకం బ్రహ్మోత్సవాల వివరాలను ఇక్కడ క్లిక్ చేసే తెలుసుకోండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.