ETV Bharat / spiritual

హోలీ రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు - వాస్తు నష్టాలు గ్యారెంటీ! - Holi 2024 Vastu Tips - HOLI 2024 VASTU TIPS

Holi 2024 Vastu Tips : రంగుల కేళీ.. ఆనందాల హోలీ వచ్చేస్తోంది. మనసంతా సంతోషాలు తెచ్చేస్తోంది. అయితే, ఈ పండగ సంతోషం ఏడాది అంతా ఉండాలంటే, అష్టఐశ్వర్యాలు సిద్ధించాలంటే వాస్తుశాస్త్రం పరంగా హోలీ రోజు చేయాల్సినవి, చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Holi 2024 Vastu Tips
Holi 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 22, 2024, 1:44 PM IST

Vastu Tips for Holi 2024 : వసంత రుతువుకు స్వాగతం చెబుతూ ఉత్సాహంగా జరుపుకొనే రంగుల పండగ హోలీ. ఈ కలర్​ఫుల్​ ఫెస్టివల్​ను తెలుగు సంవత్సరాది ప్రకారం.. ప్రతి ఏటా ఫాల్గుణ మాసం చివరి పౌర్ణమి రోజు జరుపుకుంటాం. జీవితంలో ఉన్న చీకట్లు తొలగిపోయి, బతుకు రంగుల మయం కావాలని జనం కోరుకుంటారు. అయితే, ఈ ఏడాది హోలీ(Holi 2024) చాలా ప్రత్యేకమని చెబుతున్నారు వాస్తు పండితులు.

ఎందుకంటే.. అదే రోజు చంద్ర గ్రహణం, మూడు శుభ యోగాలు ఏర్పడుతున్నాయట. కాబట్టి, ఈ హోలీ నాడు కొన్ని వాస్తు నియమాలను పాటించడం ద్వారా జీవితంలో సానుకూల ఫలితాలు పొందడంతోపాటు లక్ష్మీ కటాక్షం లభిస్తుందని సూచిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

హోలీ నాడు చేయాల్సిన పనులు :

  • ఈ హోలీ మీ జీవితంలో అష్టైశ్వర్యాలు నింపాలంటే వాస్తు ప్రకారం మీరు చేయాల్సిన మొదటి పని.. ఆ రోజు ఇంటిని శుభ్రం చేసుకుని విష్ణువును ఆరాధించాలి.
  • అలాగే ఇంట్లో చెత్త, చెదారం లేకుండా ఇల్లంతా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
  • ఈ రంగుల పండగ రోజున పొరపాటున కూడా ఎవరినీ అవమానించకూడదనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి.
  • ఇంటి ఆవరణలోనే హోలీని సెలబ్రేట్ చేసుకోవాలి. అంతేకాదు పగటి పూటనే హోలీని జరుపుకోవాలట. చీకటి పడిన తర్వాత హోలీ ఆడితే దరిద్రం చుట్టుకునే అవకాశం ఉంటుందట.
  • హోలీ నాడు ఇంట్లో వండిన ఆహారాన్ని ముందుగా దేవుడికి సమర్పించి ఆ తర్వాత తింటే మంచి ఫలితాలు చేకూరుతాయంటున్నారు.
  • హోలీకి ముందు నాడు కాముని దహనం చేసిన బూడిదను ఇంటికి తెచ్చుకొని ఇంట్లోని నాలుగు మూలల్లోనూ వేస్తే వాస్తు దోషాల నివారణ జరుగుతుందంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు.

అలర్ట్ : హోలీ వేడుకల్లో ఏ రంగులు వాడబోతున్నారు? - ఇవి చల్లుకుంటే ఖతమే! - Side Effects of Holi Colours

చేయకూడని పనులు :

  • రంగుల కేళీ హోలీ రోజు.. మద్యపానానికి దూరంగా ఉండాలి.
  • సంతోషాలను నింపే ఈ కలర్​ఫుల్ ఫెస్టివల్ నాడు ఎవరికీ డబ్బులు ఇవ్వకూడదు. అదేవిధంగా తెల్లని బట్టలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు.
  • విష్ణువు, రాధాకృష్ణులను పూజించే ఈ పండుగను చాలా పవిత్రంగా, భక్తి, శ్రద్ధలతో జరుపుకోవడం అత్యంత శ్రేయస్కరమని సూచిస్తున్నారు.
  • చేయకూడని పనులకు దూరంగా ఉంటూ.. శ్రద్ధగా చేయాల్సిన పనులను చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభించి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, సుఖ సంతోషాలతో జీవిస్తారని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

నోట్ : పైన తెలిపిన వివరాలు కొందరు వాస్తు నిపుణులు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

హోలీ స్పెషల్‌ స్వీట్‌ - "గుజియా" ట్రై చేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.