Vastu Tips For Painting House : ఇంట్లో ఆహ్లాదకరమైన రంగులు వేయిస్తే మంచిది. ఇంటికి వచ్చినవారు ఈశాన్యంలో కాళ్లు కడుక్కొనే ఏర్పాటు చేసుకోవడం ఇంటికి సదా శ్రేయస్కరం. ఇంటికి ప్రధానమైన హాలును ఆహ్లాదభరితంగా, సువాసన భరితంగా అమర్చుకోవాలి. ఇంటి అభివృద్ధికి పరిశుభ్రతే మూలం. సూర్యకాంతి ఇంట్లో ప్రసరించేలా చూసుకోవాలి. పాజిటివ్ ఎనర్జీ కోసం ఇంట్లో నిత్య దైవారాధన, నాద స్వరంతో సకల శుభాలు, మనఃశాంతి.
ఇంట్లో ఎలాంటి రంగులు వేస్తే మంచిది?
ఇంట్లో లక్ష్మీ కళ ఉట్టి పడాలంటే ఆకు పచ్చ, పసుపు రంగులు వేయాలి. అప్పుడే ఇల్లు లక్ష్మీ కళతో కళకళలాడుతుంది.
ఈశాన్యంలో కాళ్లు కడుక్కుంటే ఆరోగ్యం
బయట నుంచి ఇంటికి వచ్చే వారు ఈశాన్యంలో కాళ్లు కడుక్కొని వచ్చేలా ప్రతి ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేయడం వలన బయట నుంచి వచ్చే వ్యాధికారక సూక్ష్మ క్రిములను ఇంట్లోకి రాకుండా నిరోధించవచ్చు. తద్వారా ఇంట్లోని వారికి ఆరోగ్యం ఆనందం.
హాలు అమరిక ఐశ్వర్య కారకం
ఇంట్లో హాలు అమర్చుకునే విధానం లక్ష్మీ కళ ఉట్టి పడేలా ఉండాలి. హాలు విశాలంగా ఉండాలి. హాల్లో వస్తువులు చిందరవందరగా లేకుండా క్రమపద్ధతిలో సర్దుకోవాలి. అలాగే హాలులో ప్రకృతి సుందర దృశ్యాలు ఉండే చిత్రపటాలు అమర్చుకోవాలి. అంతేకాకుండా చిన్నపాటి దేవుని విగ్రహాలను కూడా ఏర్పాటు చేసుకోవడం వలన ఇంట్లో ఐశ్వర్యం, మానసిక ప్రశాంతత, పాజిటివ్ ఎనర్జీ ఉంటాయి.
దృష్టి దోషాలు పోగొట్టే సుగంధం
ఇంట్లో సుగంధభరితమైన ధూపం వేయడం వలన దృష్టి దోషాలు, నర దోషాలు పోతాయి. ఇలా చేయడం వలన ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే ఆ ఇంటి యజమాని అంత అభివృద్ధిలోకి వస్తాడు.
గడప పూజతో అఖండ ఐశ్వర్యం
ఇంటి ఇల్లాలు ప్రతి శుక్రవారం ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గడపకు రెండువైపులా రెండు ఆవు పాల చుక్కలు వేసినట్లయితే ఆ ఇంట లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది.
సూర్య తేజంతో గృహ వైభోగం
ఇంట్లో సూర్యరశ్మి చక్కగా ప్రసరించేలా ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా ఉదయం సూర్య కాంతి కిరణాలు ఇంట్లోకి ప్రసరించడం వలన ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతాయి. ఏ ఇంట్లో అయితే సూర్యకిరణాలు ప్రసరించవో ఆ ఇంట్లో వారు ఎప్పుడు అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటారు. అందుకే ఉదయం పూట సూర్యకాంతి ఇంట్లో ప్రసరించేలా కిటికీలు, తలుపులు తెరచి ఉంచుకోవాలి. ఏ ఇంట్లో అయితే ప్రభాత సూర్య తేజం ప్రసరిస్తుందో ఆ ఇంట్లో అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతుంది.
ఆధ్యాత్మికతతో ప్రశాంతత
ప్రశాంతమైన ఎలాంటి ఒత్తిడి లేని జీవనం కావాలంటే ప్రతి రోజు కనీసం ఒక అరగంట పాటు దేవుని మందిరంలో ధ్యానం చేయాలి. ఇది ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఆచరించాల్సిన విధి విధానం. ఏ స్తోత్రాలు చదవకపోయినా, ఏ పూజలు చేయక పోయినా కళ్లు మూసుకొని భగవంతుని పాదాలపై ధ్యాస పెట్టి ఏకాగ్రతతో ధ్యానం చేస్తే ఎలాంటి ఒత్తిడి అయినా పోతుంది. ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కోగల మనో నిబ్బరం అలవడుతుంది. ముఖంలో మంచి వర్చస్సు కూడా వస్తుంది.
నాద స్వరంతో సర్వ శుభాలు
ఏ ఇంట్లో అయితే ప్రతి నిత్యం కనీసం పది నిముషాల పాటు నాద స్వరం వినిపిస్తుందో ఆ ఇంట్లో శుభకార్యాలకు కొరతే ఉండదు. ప్రతిరోజూ ఉదయం 5 :50 నిముషాల నుంచి 6 గంటల వరకు ఏ ఇంట్లో అయితే నాదస్వరం వినపడుతుందో ఆ ఇల్లు శుభకార్యాలతో, శుభవార్తలల్తో నిత్య కల్యాణం పచ్చ తోరణం లాగా విలసిల్లుతుంది. శుభం భూయాత్!
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇల్లు కట్టేందుకు రెడీ అవుతున్నారా? ఈ 4నెలల్లో స్టార్ట్ చేస్తే చాలా మంచిది!