ETV Bharat / spiritual

గ్యాస్​ స్టవ్​ కు సింక్​ దూరంగానే ఉందా? అలా జరగాలంటే దానిమ్మ మొక్క పెంచితే చాలు! - Vastu Tips For House Construction

Vastu Tips For House Construction : సాధారణంగా వాస్తును చాలా మంది నమ్ముతారు. మరి ఇంటి నిర్మాణ సమయంలో వాస్తు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇక్కడ తెలుసుకుందాం.

Vastu Tips For House Construction
Vastu Tips For House Construction
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 11, 2024, 7:00 AM IST

Updated : Mar 11, 2024, 7:10 AM IST

Vastu Tips For House Construction : ప్రతిఒక్కరికీ వారి అభిరుచికి తగ్గట్లుగా సొంత ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది. దాని కోసం ఎంతో కష్టపడి డబ్బులు దాచుకుని లేకుంటే బ్యాంకు లోన్​ తీసుకుని సొంతంటి కలను నెరవేర్చుకుంటారు. అయితే వాస్తు శాస్త్రం మీద నమ్మకం ఉన్నవారు దానికి అనుగుణంగా ఇంటి నిర్మాణం చేసినట్లయితే ఆ ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం వెళ్లి విరుస్తోందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతటి విశిష్టత కలిగిన వాస్తును ఇంటి నిర్మాణంలో ఏ విధంగా పాటించాలో తెలుసుకుందాం.

ప్రవేశ ద్వారం, గ్యాస్ స్టవ్ విషయంలో!
వాస్తు శాస్త్రంలో చిన్న చిన్న విషయాలకు సైతం చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇంటి ప్రవేశ ద్వారం విషయంలో నిక్కచ్చిగా వాస్తు పాటించాల్సిందే. ప్రవేశ ద్వారం మూలల్లో ఉండకూడదు. అలా పెట్టడం ద్వారా వాస్తు దోషం వస్తుంది. ఇంట్లో గ్యాస్ స్టవ్​ దక్షిణ, తూర్పు, ఆగ్నేయ దిశల్లో పెట్టుకోవాలి. గ్యాస్ స్టవ్ గోడకు కనీసం మూడు అంగుళాల దూరంలో ఉండాలి. గుమ్మంలో నుంచి బయటకు కనిపిస్తూ అస్సలు ఉండకూడదు. గ్యాస్ స్టవ్​కు ఎప్పుడూ సింక్ ఆనుకుని ఉండకూడదు. కొద్ది దూరంలో ఉండడమే మంచిది.

దానిమ్మ మొక్క పెంచితే!
ఇంటి కోసం స్థలం కొనుగోలు చేసిన తర్వాత నిర్మాణానికి డబ్బులు సర్దుబాటు అవ్వకపోతే ఆ ప్లేస్​లో దానిమ్మ మొక్కను పెంచమని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మీకు ఇంటి నిర్మాణం పూర్తవడానికి కావాల్సిన డబ్బులు ఏదో ఒక విధంగా సమకూరుతాయని చెబుతున్నారు. దానిమ్మ చెట్టుకు అంతటి గొప్ప విశిష్టత ఉందని, అందుకే ప్రతి ఇంట్లో తప్పనిసరిగా దానిమ్మ చెట్టు పెంచాలని అంటున్నారు.

రోజూ పూజగదిలో!
ఏ వృత్తిలో ఉన్న కూడా పనిలో అభివృద్ధి, ధన లాభం, సుఖశాంతులు లభించాలంటే పూజ గదిలోని ఇష్ట దైవానికి నిత్యం పూలదండ వేసి మనస్ఫూర్తిగా నమస్కరించమని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల వ్యాపారం, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి సాధించడమే కాక మీ కీర్తి ప్రతిష్ఠలు సైతం పెరుగుతాయని అంటున్నారు. ఇంటి ముఖ ద్వారానికి అశోక వృక్షం, మామిడి ఆకులు, గన్నేరు ఆకులు తోరణంగా కడితే శాంతి నెలకొంటుందని సలహా ఇస్తున్నారు.

ఉప్పుతో అలా చేస్తే!
నిద్రలేమితో బాధ పడేవారికి ఉప్పు ఉన్న పాత్రను పడుకునే చోటు దగ్గర పెడితే హాయిగా నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు. పిల్లల్లో ఎక్కువ అల్లరి చేయడం, చెప్పిన మాట వినకపోవడం, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం, వాళ్ల మనస్సు స్థిరంగా లేకపోవడం వంటివి ఉంటే, రాగి చెంబులో నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు వేసి వారు నిద్రించే చోట పెట్టినట్లయితే కచ్చితంగా మార్పు వస్తుందని అంటున్నారు. నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసి స్నానం చేసినట్లయితే నరదృష్టి ప్రభావం తొలగిపోతుందని, ఉప్పు కలిపిన నీళ్లతో ఇల్లు తుడిస్తే చెడుశక్తిని నాశనం చేస్తుందని సలహా ఇస్తున్నారు.
ఈ వాస్తు సూత్రాలను పాటించి ఇంటి నిర్మాణం, ఇంట్లో మార్పులు చేసుకున్నట్లయితే కుటుంబమంతా ఎల్లపుడూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉంటారని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు

ఇంట్లో పరికరాలకు వాస్తు? కంప్యూటర్​ స్క్రీన్​ ఆ వైపు ఉంటే ఎక్కువ రిపేర్లు వస్తాయ్!

ఇంట్లో వాటర్ ట్యాంక్ ఎక్కడ ఉండాలి? ఆగ్నేయంలో బావి ఉంటే అరిష్టమా?

Last Updated : Mar 11, 2024, 7:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.