ETV Bharat / spiritual

కొత్తగా ఇల్లు కొనాలనుకుంటున్నారా? - అయితే, వాస్తు ప్రకారం ఈ నియమాలు పాటించాల్సిందే! - Vastu Tips for Buying Home - VASTU TIPS FOR BUYING HOME

Vastu Tips for Buying Home : మీరు కొత్తగా ఏదైనా ఇల్లు కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే, మీరు కొనే ఇల్లు వాస్తుప్రకారం ఉందో లేదో ఓసారి చూసుకోండి. లేదంటే.. జీవితంలో వివిధ సమస్యలను ఎదుర్కొవాల్సి ఉంటుందని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ, ఇల్లు కొనే ముందు చూడాల్సిన వాస్తు నియమాలేంటో ఇప్పుడు చూద్దాం.

Vastu Tips
Vastu Tips for Buying Home
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 26, 2024, 5:11 PM IST

Vastu Rules for Buying Home : ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఏ చిన్న నిర్మాణం చేపట్టాలన్నా వాస్తుశాస్త్రాన్ని ఫాలో అవుతున్నారు. ఇక అదే నివాసం ఉండే ఇల్లు విషయానికొస్తారా.. దాని నిర్మాణం మొదలు వస్తువుల అమరిక వరకు వాస్తును పాటిస్తుంటారు మెజార్టీ పీపుల్. ఇదిలా ఉంటే.. మీరు ఏదైనా కొత్తగా ఇల్లు కొనాలనే ఆలోచనలో ఉన్నా వాస్తు ప్రకారం.. కొన్ని నియమాలు పాటించడం మంచిది అంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. లేదంటే.. మీరు కొనే ఇల్లు ఎంత పెద్దదైనా ఆ ఇంట్లో ఏదైనా వాస్తు దోషాలు ఉంటే సంతోషం, ప్రశాంతత ఉండదని, జీవితంలో నిత్యం ఏదో ఒక సమస్య ఇబ్బంది పెట్టవచ్చంటున్నారు వాస్తు పండితులు. ఇంతకీ, ఇల్లు(House) కొనే ముందు చూడాల్సిన ఆ వాస్తు నియమాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఈశాన్య దిశ : మీరు ఏదైనా ఇల్లు కొనుగోలు చేసే ముందు మొదట పరిశీలించాల్సిన వాస్తు నియమం.. ఆ ఇంటి ఈశాన్య దిశ. ఇది ఇంటికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన, సున్నితమైన దిశలలో ఒకటి. ప్రార్థన గది, దేవాలయం లేదా ధ్యాన స్థలం కలిగి ఉండటానికి ఇది అత్యంత అనువైన దిశ అని చెబుతున్నారు వాస్తు పండితులు. ముఖ్యంగా వాస్తుప్రకారం.. టాయిలెట్, కిచెన్, స్టోర్ రూమ్​, సెప్టిక్ ట్యాంక్ వంటివి ఈశాన్య దిశలో లేకుండా చూసుకోవడం మంచిది అంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు.

ఇంటి ప్రవేశ ద్వారం : వాస్తుశాస్త్రం ప్రకారం.. మీరు ఇల్లు కొనే ముందు చూడాల్సిన మరో ముఖ్యమైన అంశం ఇంటి ప్రవేశ ద్వారం(మెయిన్ డోర్/గేట్). ఎందుకంటే ఇది కేవలం అందరూ వచ్చి పోయే మార్గం మాత్రమే కాదు.. సానుకూల శక్తిని లేదా ప్రకంపనలను మోసుకొచ్చే మార్గం కూడా అని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి వాస్తుప్రకారం ఇంటి ప్రవేశం ద్వారం ఉందో లేదో చూసుకోవాలి. ముఖ్యంగా వాస్తు ప్రకారం మీరు కొనే ఇంటి ప్రవేశ ద్వారం.. ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్య దిశలో ఉండేలా చూసుకోవడం మంచిది అంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. అలాగే ప్రవేశద్వారం తలుపులు నలుపు రంగులో ఉండకుండా చూసుకోవాలంటున్నారు.

కిచెన్ ప్లేస్మెంట్ : వాస్తుప్రకారం ఇల్లు కొనుగోలు చేసే ముందు చూడాల్సిన మరో అంశం ఏమిటంటే.. వంటగది ప్లేస్మెంట్. అయితే వాస్తుప్రకారం.. మీరు కొనే ఇంట్లో ఆగ్నేయం నుంచి దక్షిణం దిశలో వంటగది ఉన్న దానిని కొనుగోలు చేయడం మంచిది అంటున్నారు వాస్తు పండితులు. అలాకాకుండా కిచెన్.. ఇంటికి ఉత్తరం, ఈశాన్యం లేదా నైరుతి దిశలో ఉంటే సమస్యలు తప్పవంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. అలాగే వంటగదిలోని మంట పుట్టించే ఉపకరణాలు ఆగ్నేయ దిశలో ఉండడం శుభప్రదమని సూచిస్తున్నారు వాస్తు పండితులు. వీటితో పాటు వంటగది కలర్స్ కూడా వాస్తుప్రకారం ఉండేలా చూసుకోవాలంటున్నారు. ముఖ్యంగా నలుపు, నీలం లేదా బూడిద రంగులు ఉండకుండా చూసుకోవాలని చెబుతున్నారు.

అద్దె ఇంట్లో వాస్తు చూసుకోవాల్సిందే! - లేదంటే ఆ సమస్యలు తప్పవట! - Vastu Tips for Rented Home

లివింగ్ రూమ్ : మీరు ఇల్లు కొనే ముందు వాస్తుప్రకారం చూడాల్సిన మరో అంశం.. లివింగ్ రూమ్. ఎందుకంటే ఇది ఎవరి ఇంట్లోనైనా ఎక్కువ సేపు గడిపే ప్రదేశం. కాబట్టి ఇది వాస్తుప్రకారం.. ప్రవేశ ద్వారానికి తగినట్లు తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉండేలా చూసుకోవాలి. అదేవిధంగా ఆ గదిలో ఫర్నిచర్ పడమర లేదా నైరుతి దిశలో సెట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి వాస్తు దోషం ఉండదని సూచిస్తున్నారు వాస్తుశాస్త్ర పండితులు.

వెంటిలేషన్ : వాస్తు ప్రకారం.. మీరు కొనుగోలు చేసే ఇంటిలో చూడాల్సిన మరో ముఖ్యమైన అంశం వెంటిలేషన్. ఇది ఇంటిలోని ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల శక్తిని ప్రవేశపెట్టడంలో చాలా బాగా ఉపయోగపడుతుందంటున్నారు వాస్తు పండితులు. ఇది ఇంటిని ప్రకాశవంతంగా, ఆహ్లాదకరంగా చేస్తుంది. ఇవేకాకుండా వాస్తుప్రకారం.. మీరు కొనే ఇంట్లోని గదులు చతురస్రాకారంలో లేదా దీర్ఘచతురస్రాకారంలో ఉండేలా చూసుకోవాలి. అలాగే పరిసరాలు శుభ్రంగా ఉన్న ఇంటిని కొనుగోలు చేయడం ఉత్తమమని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

నోట్ : పైన తెలిపిన వివరాలు కొందరు వాస్తు నిపుణులు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

వాస్తులో ఈశాన్యానికి ఎందుకంత ప్రాధాన్యం? ఆ దిశలో టాయిలెట్​ ఉండొచ్చా? - Significance Of Northeast In Vastu

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.