Vastu Tips For Home Decor : ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఇంటి నిర్మాణం నుంచి మొదలు పెడితే ఇంట్లోని వస్తువుల అమరిక వరకు వాస్తును ఫాలో అవుతుంటారు. అదే విధంగా, ఇంటి అలంకరణ కోసం ఉపయోగించే ఫొటో ఫ్రేమ్స్ విషయంలో కూడా వాస్తు(Vastu Tips) నియమాలను పాటించడం చాలా అవసరమంటున్నారు వాస్తు పండితులు. అందులో ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ఈ ఫొటో ఫ్రేమ్స్.. ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీని తీసుకురావడమే కాకుండా ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ఇబ్బందులను కలిగించవచ్చంటున్నారు. మరి వాస్తుప్రకారం.. ఇంట్లో ఉండకూడని ఆ ఫొటో ఫ్రేమ్స్(Photo Frames) ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అగ్రేసివ్ ఫొటో ఫ్రేమ్స్ : వాస్తు ప్రకారం.. ఇంట్లో అలంకరణ కోసం హింసను ప్రేరేపించే చిత్రాలు, యుద్ధ సన్నివేశాలు, పులులు లేదా తోడేళ్ల వంటి దూకుడు జంతువులు కలిగిన ఫొటో ఫ్రేమ్స్‌ను పెట్టకూడదని అంటున్నారు. ఎందుకంటే.. ఇలాంటి చిత్రపటాలు ఇంట్లో గొడవలకు దారితీస్తాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
బాధలను తెలిపే చిత్రపటాలు : ఇంట్లో అలంకరణ కోసం ఉపయోగించే ఫొటో ఫ్రేమ్స్‌లో విచారం, ఏడుస్తున్న లేదా బాధలను చిత్రీకరించే ఫొటో ఫ్రేమ్స్ ఉండకుండా చూసుకోవాలంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. వాస్తుప్రకారం.. ఇలాంటి చిత్రాలు ఇంట్లో ప్రతికూల వాతావరణాన్ని సృష్టించి మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయట.
శిథిలమైన నిర్మాణాల ఫొటో ఫ్రేమ్స్ : ఇంట్లో డెకరేషన్ కోసం యూజ్ చేసే చిత్రపటాలలో శిథిలమైన నిర్మాణాలకు సంబంధించినవి ఉండకుండా చూసుకోమని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి చిత్రపటాలు ఇంట్లో ఆర్థిక అస్థిరతను కలిగిస్తాయంటున్నారు వాస్తు పండితులు.
అప్పులతో అవస్థలు పడుతున్నారా? - వాస్తు ప్రకారం ఇలా చేస్తే అన్నీ తీరిపోతాయట!
ప్రకృతి వైపరీత్యాల దృశ్యాలు : ఇంటి అలంకరణలో భాగంగా మీరు గోడలకు వేలాడదీసే ఫొటో ఫ్రేమ్స్‌లో వరదలు, భూకంపాలు లేదా మంటలు వంటి ప్రకృతి వైపరీత్యాలను చూపించే చిత్రపటాలు లేకుండా చూసుకోమంటున్నారు. ఎందుకంటే వాస్తు ప్రకారం ఇలాంటి చిత్రపటాలు అశుభకరమైనవిగా భావిస్తారు. అలాగే.. ఈ ఫ్రేమ్స్ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీని ఆహ్వానించడమే కాకుండా భయం లేదా అనిశ్చితి భావాలను సృష్టించగలవంటున్నారు వాస్తు పండితులు.
డార్క్ కలర్ ఫొటో ఫ్రేమ్స్ : వాస్తుప్రకారం.. డార్క్ కలర్ ఫొటో ఫ్రేమ్స్, నలుపు రంగు ఎక్కువగా ఉండే పెయింటింగ్స్ ఇంటి అలంకరణ కోసం యూజ్ చేయకపోవడం మంచిదట. అటువంటి ఫొటో ఫ్రేమ్స్ ఇంటి పరిసరాల నుంచి పాజిటివిటీని తొలగించి నెగటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తాయంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు.
ప్రతికూలశక్తులను సూచించే ఫొటో ఫ్రేమ్స్ : వాస్తుప్రకారం.. పగిలిన అద్దాలు, కాకులు లేదా గుడ్లగూబలు వంటి ఫొటో ఫ్రేమ్స్ ఇంట్లో ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇవి అశుభకరమైనవిగా పరిగణిస్తారంటున్నారు వాస్తు నిపుణులు.
అదేవిధంగా వాస్తుప్రకారం.. ఇంటి అలంకరణ కోసం ఉపయోగించే చిత్రపటాలలో సమాధి లేదా దర్గా వంటి ఫొటో ఫ్రేమ్స్ ఉండకుండా చూసుకోవాలంటున్నారు వాస్తు పండితులు. ఎందుకంటే ఇవి.. మరణానంతర ప్రదేశాలు. రోజూ వీటిని చూడటం కుటుంబ సభ్యులకు హానికరమంటున్నారు. కాబట్టి వాస్తుప్రకారం.. పైన పేర్కొన్న చిత్రపటాలకు బదులుగా హౌస్ డేకరేషన్ కోసం సానుకూలత, శాంతి, సామరస్యాన్ని ప్రోత్సహించే చిత్రపటాలను ఎంచుకోవడం మంచిదని వాస్తుపండితులు సిఫార్సు చేస్తున్నారు.
Note : పైన తెలిపిన వివరాలు కొందరు వాస్తు నిపుణులు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
వాస్తు - పూజ గదిలో ఈ వస్తువులు అస్సలు పెట్టకండి! - లేకపోతే కష్టాలు తప్పవు! - vastu tips for home