Vastu Tips For Home : ఇంట్లో పెయింటింగ్స్ వల్ల ఇంటికి అందం వస్తుంది. అయితే.. వాస్తు ప్రకారం కొన్ని రకాల పెయింటింగ్స్ వల్ల ఇంట్లో మంచి జరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అందుకే.. ఇంట్లో కచ్చితంగా కొన్ని పెయింటింగ్స్ ఉండాలని సూచిస్తున్నారు. మరి.. అవి ఏంటి? అలాగే వాటిని ఏ దిశలో పెట్టాలి? అనేది ఇప్పుడు చూద్దాం.
పరుగెడుతున్న ఏడు గుర్రాల చిత్రం :
వాస్తు ప్రకారం.. ప్రతి ఇంట్లో పరుగెడుతున్న ఏడు గుర్రాల ఫొటో ఉండాలట. ఇది ఉండటం వల్ల ఆర్థికంగా చితికిపోకుండా ఉండవచ్చని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఏడు గుర్రాల ఫొటో మాత్రమే ఎందుకు పెట్టుకోవాలి అనే డౌట్ రావచ్చు. హిందూ ధర్మం ప్రకారం.. 7 అంకెను శుభప్రదంగా పరిగణిస్తారు. 7 అంకెతో ప్రతి ఒక్కరి జీవితం ముడిపడి ఉంటుందట. అది ఎలా అంటే.. దంపతులు పెళ్లిలో ఏడు అడుగులు వేస్తారు. అలాగే భూమిపై ఏడు మహాసముద్రాలు ఉన్నాయి. ఖండాలు కూడా ఏడే ఉన్నాయి. ఇంకా సంగీతంలో సప్త స్వరాలు ఉంటాయి. ఇలా.. ఏడు అంకె ఎంతో విలువైనదని.. అందుకే దీనిని హాల్‌లో ఏర్పాటు చేసుకోవాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు.
వాస్తు ప్రకారం రోజూ ఈ పనులు చేస్తే - ఇంట్లో సుఖసంతోషాలు 10 రెట్లు పెరగడం పక్కా!
కోయి చేప పెయింటింగ్ :
ఇంట్లో కోయి చేప పెయింటింగ్ పెట్టుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుందట. అలాగే వీటిని చూసిన ప్రతిసారీ.. నూతన శక్తి, కొత్త ఉత్సహం కలుగుతాయని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు. ఈ పెయింటింగ్‌ను హాలుకు పశ్చిమ దిశలో ఏర్పాటు చేయడం మంచిదని సూచిస్తున్నారు. దీనివల్ల ఇంట్లో ప్రతికూల ప్రభావాలు తొలగిపోయి మంచి జరుగుతుందని తెలియజేస్తున్నారు.
రాధాకృష్ణ పెయింటింగ్ :
వాస్తు ప్రకారం ఇంట్లో రాధాకృష్ణ పెయింటింగ్ ఉండటం వల్ల శాంతి, శ్రేయస్సు కలుగుతాయట. ఈ పెయింటింగ్స్ ఇంట్లో ఏ గదిలోనైనా పెట్టుకోవచ్చని చెబుతున్నారు. అయితే.. అది ఉత్తర గోడకు ఉండటం ఇంకా మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. దీనిని బెడ్‌రూమ్‌లో ఏర్పాటు చేసుకోవడం వల్ల దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుందని చెబుతున్నారు.
జలపాతం పెయింటింగ్ :
ఇంట్లో అందమైన జలపాతం పెయింటిగ్‌ను పెట్టుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుందట. అలాగే ఇంట్లోని కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, కలహాలు అన్నీ తొలగిపోయి శాంతి కలుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలాగే.. ఈ పెయింటింగ్ ఉండటం వల్ల సంపద కూడా పెరుగుతుందట. అందుకే దీనిని హాల్‌లో ఉత్తర గోడపై వేలాడదీయాలని సూచిస్తున్నారు.
నోట్ : పైన తెలిపిన వివరాలు కొందరు వాస్తు నిపుణులు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ఇల్లు కట్టేందుకు రెడీ అవుతున్నారా? ఈ 4నెలల్లో స్టార్ట్ చేస్తే చాలా మంచిది!
వెస్ట్ ఫేస్ ఇంట్లో ఈ వాస్తు టిప్స్ తప్పక పాటించాలట! - అవేంటో మీకు తెలుసా?