Where To Plant Curry Leaves Tree as Per Vastu : ఈరోజుల్లో ఎక్కువ మంది ఇళ్లల్లో రకరకాల మొక్కలు పెంచేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా వంటింటి అవసరాలకు ఉపయోగపడుతుందని, ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా.. చాలా మంది ఇంటి పెరట్లో ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ కరివేపాకు మొక్కలు నాటుతుంటారు. అయితే కరివేపాకు(Curry Leaves) చెట్టును.. వాస్తుప్రకారం సరైన దిశలో నాటుకోవడం చాలా అవసరమని చెబుతున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. లేదంటే.. దాని కారణంగా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ చేరి ఆర్థిక సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉంటుందంటున్నారు. అంతేకాదు.. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య కలహాలకు దారితీస్తుందంటున్నారు వాస్తు పండితులు. ఇంతకీ, వాస్తు ప్రకారం.. కరివేపాకు చెట్టును ఏ దిశలో పెంచుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
- ఇంట్లో కరివేపాకు మొక్క నాటుకోవడానికి.. ఇంటికి పడమర దిశ అనువైనదిగా వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. ఈ దిశను చంద్రుడి దిశగా చెబుతుంటారు. కాబట్టి, ఆ దిశ కరివేపాకు చెట్టు పెంచుకోవడానికి సరైన ప్రదేశమని చెబుతున్నారు.
- వాస్తుప్రకారం.. పడమర దిశలో కరివేపాకు మొక్క పెంచుకోవడం వలన శుభ ఫలితాలు లభిస్తాయంటున్నారు వాస్తు పండితులు. ముఖ్యంగా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని చెబుతున్నారు
- అలాగే.. ఆ ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయని, లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలు కలుగుతాయని అంటున్నారు. అయితే, సరైన దిశలో నాటడం మాత్రమే కాదు దాని సంరక్షణకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.
వాస్తు : ఇంట్లో ఈ మొక్కలు పెంచుతున్నట్టయితే - కష్టాలను పిలిచినట్టే!
- మీరు కరివేపాకు మొక్కను పెంచుకుంటున్న ప్రాంతంలోకి మురుగు నీటి పారుదల లేకుండా చూసుకోవాలని చెబుతున్నారు. ప్రధానంగా సింక్ నుంచి వేస్ట్ వాటర్ పోయే ప్రాంతంలో పొరపాటున కూడా కరివేపాకు మొక్కను నాటవద్దంటున్నారు.
- అదేవిధంగా.. కరివేపాకు మొక్క ఎదిగే క్రమంలో కూడా చీడ పట్టకుండా, ఆరోగ్యంగా పెరిగేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. అంతేకాదు.. మొక్క మీద ఎప్పుడైనా చీడ పట్టినట్లు కనిపిస్తే ఆ భాగాన్ని వెంటనే తొలగించడం మంచిదంటున్నారు.
- ఎందుకంటే.. ఇంట్లోని కరివేపాకు చెట్టు ఎండినా, చీడ పట్టినా ఆ ప్రభావం ఇంట్లో నివసించే కుటుంబ సభ్యులపై ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. కుటుంబ సభ్యుల మధ్య గొడవలకు దారితీస్తుదంట. ఇంటి సామరస్య వాతావరణానికి విఘాతం కలిగిస్తుందంటున్నారు.
- అలాగే, కొన్ని రకాల చెట్లను పొరపాటున కూడా కరివేపాకు చెట్ల పక్కన పెంచవద్దని సూచిస్తున్నారు. ముఖ్యంగా చింత చెట్టు.. కరివేపాకు చెట్టు పక్కపక్కన అస్సలు పెంచుకోవద్దని చెబుతున్నారు. వాస్తుప్రకారం ఇలా పెంచడం ఏమాత్రం శుభకరం కాదంటున్నారు. అంతేకాదు.. ఆర్థిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని సూచిస్తున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు.
Note : పైన తెలిపిన వివరాలు కొందరు వాస్తు నిపుణులు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ఇంట్లో గన్నేరు పూల మొక్కలను పెంచుకోవచ్చా? వాస్తు నిపుణులు సమాధానమిదే!